• search

పొల్యూషన్ ఎఫెక్ట్ : ప్రతి ఆదివారం ఆ నగరంలో రోడ్డుపైకి కార్లు నిషేధం

Subscribe to Oneindia Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  పారిస్ : వాతావరణం పై దృష్టి సారించింది ఫ్రాన్స్ ప్రభుత్వం. ఇందులో భాగంగా రాజధాని నగరమైన పారిస్ నగరంపై కాన్సన్‌ట్రేట్ చేసింది. పర్యాటక ప్రాంతం కూడా కావడంతో అక్కడ కాలుష్య నియంత్రణపై ఉక్కుపాదం మోపేందుకు రంగం సిద్ధం చేసింది. ఇందులో భాగంగా ప్రతి ఆదివారం ఇకపై రోడ్లపైకి కార్లు తిరగడంపై నిషేధం విధించింది. ఇది కాలుష్య నియంత్రణ కోసమే అని ప్రభుత్వం వెల్లడించింది. అక్టోబర్ ఏడు నుంచి ఇది అమల్లోకి రానున్నట్లు పేర్కొంది.

  ఇప్పటికే ప్రతిఏటా ఒకరోజు కార్లను రోడ్లపై తిప్పకుండా ఉండే నిబంధన పారిస్‌లో ఉంది. అయితే పాశ్చాత్య యూరప్‌లో అత్యంత కాలుష్య నగరంగా రికార్డులకెక్కింది పారిస్ నగరం. జర్మనీలోని ఉప్పెర్టల్ ఇన్స్‌టిట్యూట్ కాలుష్య నగరాలపై సర్వే నిర్వహించగా అత్యంత కాలుష్య నగరంగా పాశ్చాత్య యూరప్‌లో పారిస్ నగరమే అని పేర్కొంది. ఇక్కడ పీల్చుకునేందుకు స్వచ్ఛమైన గాలి దొరకదని సర్వేలో తేలింది. మొత్తం 13 ప్రధాన నగరాలపై సర్వే నిర్వహించగా మాస్కో అత్యధికంగా కాలుష్య కోరల్లో చిక్కుకుందని సర్వే వెల్లడించింది.

  Cars banned on every Sunday in Paris to protect the city from air pollution

  కొత్తగా పారిస్‌లో ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6గంటలవరకు కార్లను రోడ్లపైకి వచ్చేందుకు నిషేధం విధించారు. దీంతో పాదాచారులు, బైకులు నడిపే వాహనదారులు స్వేచ్ఛగా విహరించే అవకాశం ఉంటుంది. అయితే కొన్నిటికి మాత్రం మినహాయింపు ఇచ్చింది ఫ్రాన్స్ సర్కార్. అందులో డెలివరీ వ్యాన్లు, ట్యాక్సీలకు కొన్ని షరతులతో మినహాయింపు ఇచ్చారు.

  ఈ వాహనాలు ప్రభుత్వం సూచించిన రూట్‌లోనే వెళ్లాల్సి ఉండటంతో పాటు 20 కిలోమీటర్ల వేగం కంటే ఎక్కువగా వెళ్లకూడదనే షరతు విధించారు. పారిస్ మేయర్ పారిస్ రిస్పైర్ అనే నినాదంతో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే వాయుకాలుష్యం అధికంగా ఉన్నచోట కార్లను నిషేధించారు.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  In a new move, Paris is expanding its car-free zones to include most of the city-centre, in a move to combat air pollution and open up more space to pedestrians.Cars will be banned in 1st, 2nd, 3rd and 4th arrondissements for the first Sunday of every month, beginning on October 7

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more