వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బ్రస్సెల్‌లో తల దాచుకున్న ‘కేటలోనియా’ నేత ‘ఫాగ్‌డిమాంట్’

స్పెయిన్ ప్రభుత్వం, న్యాయస్థానాల ఆదేశాలను బేఖాతర్ చేస్తూ రీజియన్ పార్లమెంట్‌లో ‘స్వాతంత్ర్య’ తీర్మానం ఆమోదించిన కార్ల్స్ పాగ్‌డిమాంట్.. కేటలోనియన్లకు ఆరాధ్య నాయకుడయ్యారు.

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

బార్సిలోనా: స్పెయిన్ ప్రభుత్వం, స్పెయిన్ న్యాయస్థానాలు వద్దన్నా.. రిఫరెండం నిర్వహించి.. కేటలోనియా పార్లమెంట్‌లో 'స్వాతంత్ర్య ప్రకటన' తీర్మానాన్ని ఆమోదింపజేసిన జాతీయోద్యమ నేత కార్ల్స్ ఫాగ్‌డిమాంట్.. దేశం విడిచి పారిపోయారు. విస్త్రుత ప్రాతిపదికన అమలులో ఉన్న స్వయంప్రతిపత్తిని ఆసరాగా తీసుకుని కార్ల్స్‌ఫాగ్ డిమాంట్ 'స్వాతంత్ర్య' తీర్మానం ఆమోదించినందుకు అతడిపై స్పెయిన్ ప్రభుత్వం 'తిరుగుబాటు' ముద్ర వేస్తూ దేశ ద్రోహ అభియోగాలు నమోదు చేసేందుకు సిద్ధం కావడం వల్లే దేశం విడిచి పారిపోయారని తెలుస్తున్నది. పొరుగున ఉన్న బెల్జియం రాజధాని బ్రస్సెల్స్‌ నగరంలో తలదాచుకున్నారని స్పెయిన్ అధికారులు తెలిపారు.

తొలి నుంచి బెల్జియంతో కేటలోనియాకు సత్సంబంధాలు ఉండటం వల్లే ఆయన బ్రస్సెల్స్ శరణు జొచ్చారని సమాచారం. ఒకవేళ కేటలోనియాలోనే ఉంటే స్పెయిన్ ప్రభుత్వం మోపే అభియోగాలు రుజువైతే ఫాగ్ డిమాంట్ 30 ఏళ్లకు పైగా జైలుశిక్ష అనుభవించాల్సి వస్తుందని న్యాయ నిపుణులు చెప్తున్నారు. మరోవైపు కేటలోనియాలో ఇంకా సహాయ నిరాకరణ చేయాలనే వాదన వినిపిస్తుండగా, ఆదివారం ఐక్యతా ప్రదర్శనతో సోమవారం స్పెయిన్ మార్కెట్లు నిలదొక్కుకున్నాయి.

బ్రస్సెల్స్‌కు భారీగా తరలి వెళ్లిన పాగ్ డిమాంట్ మద్దతు దారులు
తిరుగుబాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న కార్ల్స్‌ఫాగ్ డిమాంట్‌కు ఆశ్రయం కల్పించేందుకు సిద్ధమని ఇప్పటికే బెల్జియం, వలసల వ్యవహారాలశాఖ మంత్రి థియో ఫ్రాంకెన్ ప్రకటించారు. కార్ల్స్‌ఫాగ్ డిమాంట్ శరణు కోరవచ్చునన్నారు. ఫ్రాంకెన్ నూతన ఫ్లెమిష్ కూటమికి చెందిన ఫ్లెమిష్ నేషనలిస్టు పార్టీకి చెందిన వారు. ఈ ఫ్లెమిష్ కూటమికి కేటలోనియా వేర్పాటువాద ఉద్యమంతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారు. కనుక రాజకీయంగా ముప్పు ఉన్న వారు, సమస్యలు ఎదుర్కొంటున్న వారు బెల్జియంలో తల దాచుకోవచ్చునని పేర్కొన్నారు. అయితే కార్ల్స్‌ఫాగ్ డిమాంట్‌తోపాటు గణనీయంగా కేటలోనియా తిరుగుబాటు దారులు, ఆయన మద్దతుదారులైన మాజీ పార్లమెంట్ సభ్యులు, కేటలోనియా ప్రాంతీయ ప్రభుత్వ ప్రతినిధులు కూడా ఆయనతోపాటు దేశాన్ని వీడి వెళ్లారని స్పెయిన్ వార్తాపత్రికలు వార్తా కథనాలు ప్రచురించాయి.

Catalan leader Carles Puigdemont has fled the country amid rebellion charges

పాగ్ డిమాంట్‌పై దేశ ద్రోహ అభియోగాల నమోదుకు స్పెయిన్ రెడీ
స్వాతంత్ర్యం ప్రకటించుకున్న కేటలోనియా మాజీ అధ్యక్షుడు కార్ల్స్‌ఫాగ్ డిమాంట్‌ పై తిరుగుబాటు, దేశ ద్రోహం అభియోగాలు నమోదు చేయనున్నట్లు స్పెయిన్ ప్రాసిక్యూటర్ జోస్ మానుయల్ మాజా తెలిపారు. ఇప్పటికే కేటలోనియా పార్లమెంట్ స్వాతంత్ర్య ప్రకటనను స్పెయిన్ ప్రభుత్వం సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. స్పెయిన్ చట్టాల ప్రకారం ఇటువంటి దేశ ద్రోహ అభియోగాలు నమోదు చేయడం కుదరదు. కేటలోనియాపై పూర్తిగా స్పెయిన్ నియంత్రణ సాధించినా తిరుగుబాటు నాయకుడు పాగ్ డిమాంట్ మాత్రం నిరసన స్వరం వినిపిస్తూనే ఉన్నారు. బార్సిలోనాలో స్పెయిన్ - కేటలోనియా ఐక్యతా మద్దతుదారులు నిర్వహించిన ఐక్యతా ర్యాలీని పాగ్ డిమాంట్ వ్యతిరేకిస్తూనే ఉన్నారు. ఇప్పటికైనా, ఎప్పటికైనా కేటలోనియా అధ్యక్షుడు పాగ్ డిమాంట్ మాత్రమేనని ఆయన డిప్యూటీ ఓరియల్ జుంకెరాస్ చెప్పారు. కానీ స్పెయిన్ ప్రధాని మారియానో రాజోయ్ సారథ్యంలోని పాపులర్ పార్టీ మాత్రం కేటలోనియా పార్లమెంట్ తీసుకున్న నిర్ణయం స్పెయిన్‌కు వ్యతిరేకమేనని చెప్పారు. పాగ్ డిమాంట్ పై అభియోగాలు రుజువైతే 30 ఏళ్లకు పైగా జైలులో శిక్ష పడుతుందని న్యాయ నిపుణులు అంటున్నారు.

Catalan leader Carles Puigdemont has fled the country amid rebellion charges

ఐక్యతా ర్యాలీతో కుదురుకున్న స్టాక్ మార్కెట్లు

కేటలోనియా స్వాతంత్ర్య ప్రకటనపై శరవేగంగా స్పందించడంతోపాటు మొత్తం అధికార యంత్రాంగాన్ని ఆధీనంలోకి తీసుకున్న స్పెయిన్ ప్రభుత్వం నిర్ణయంపై వేర్పాటువాదుల్లో ఇంకా నిరసన స్వరం వినిపిస్తూ ఉన్నారు. పౌర సహాయ నిరాకరణ చేపట్టాలని ప్రతిపాదిస్తున్నారు. కేటలోనియా 'స్వాతంత్ర్య' ప్రకటన నిర్ణయాన్ని రాజ్యాంగంలోని 155 నిబంధన సాకుగా మాడ్రిడ్ రద్దు చేయడంపై నిరసన తెలియజేస్తున్నారు. 'స్వాతంత్ర్య ప్రకటన తీర్మానానికి' ముందే కేటలోనియా విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి (ప్రస్తుతం ఉద్వాసనకు గురయ్యారు) రాల్ రొమేవా స్పందిస్తూ కేటలోనియాలో రెండు లక్షల మంది సివిల్ సర్వంట్లు ఉన్నారని, వారంతా ఎన్నికైన చట్టబద్ధ సంస్థల ఆదేశాలను మాత్రమే పాటించాలని సూచించారు. సోమవారం నుంచి కేటలోనియాలో స్పెయిన్ ప్రభుత్వం విధించిన ఆంక్షలు సజావుగా అమలులోకి వచ్చేశాయి. ఆదివారం కేటలోనియా రాజధాని బార్సిలోనాలో నిర్వహించిన ఐక్యతా ర్యాలీతో స్పెయిన్‌లోని పారిశ్రామిక సంస్థల షేర్లు షేర్ మార్కెట్‌లో కుదురుకున్నాయి. హెచ్ఎస్‌బీసీ, ఎఫ్టీఎస్ఈ, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, ఈజీ జెట్ తదితర సంస్థల షేర్లు పెరిగిపోయాయి. తద్వారా కార్పొరేట్, పారిశ్రామిక వర్గాల్లో స్థిరత ఏర్పడింది.

Catalan leader Carles Puigdemont has fled the country amid rebellion charges
English summary
Ousted Catalan leader Carles Puigdemont has left Spain and travelled to Brussels, Spanish government officials have said. Mr Puigdemont is facing sedition charges from the Spanish government after Catalonia declared independence under his leadership.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X