Chandrayaan-3: చంద్రయాన్ ప్రయాణంలో కీలక మైలురాయి-విడిపోయిన విక్రమ్ ల్యాండర్..
చంద్రయాన్ -3 ప్రయాణంలో ఇవాళ మరో కీలక అడుగు పడింది. భూమి నుంచి చంద్రుడిపైకి వెళ్లి అక్కడి నిగూఢ రహస్యాలను ఛేదించే లక్ష్యంతో ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3 అంతరిక్ష నౌక తన ప్రయాణం విజయవంతంగా సాగిస్తోంది. ఇప్పటికే భూమి కక్ష్య నుంచి చంద్రుడి కక్ష్యలోకి వెళ్లడమే కాకుండా తన వ్యాసాన్ని తగ్గించుకుంటూ వచ్చిన ఈ అంతరిక్ష నౌక.. ఇవాళ విజయవంతంగా మరో మైలురాయిని దాటేసింది. ఈ మేరకు ఇస్రో ట్వీట్ చేసింది.
Chandrayaan-3 Mission:
— ISRO (@isro) August 17, 2023
‘Thanks for the ride, mate! 👋’
said the Lander Module (LM).
LM is successfully separated from the Propulsion Module (PM)
LM is set to descend to a slightly lower orbit upon a deboosting planned for tomorrow around 1600 Hrs., IST.
Now, 🇮🇳 has3⃣ 🛰️🛰️🛰️… pic.twitter.com/rJKkPSr6Ct

చంద్రయాన్ ప్రయాణంలో భాగంగా అంతరిక్ష నౌక కక్ష్యలో తన వ్యాసాన్ని తగ్గించుకుంటూ వస్తూ ఇవాళ చంద్రుడి సమీపానికి చేరుకుంది. దీంతో అంతరిక్ష నౌకలోని ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి విక్రమ్ ల్యాండర్ విడిపోయింది. ఇప్పుడు విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపైకి సాఫ్ట్ ల్యాడింగ్ కావడమే మిగిలుంది. ఇందు కోసం విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపైకి నిట్ట నిలువుగా వెళ్లి మరో ఆరు రోజుల్లో సురక్షితంగా దిగాల్సి ఉంది. చంద్రుడి దక్షిణ ధృవం వద్ద విక్రమ్ ల్యాండర్ సురక్షితంగా దిగితే దాదాపుగా చంద్రయాన్ లక్ష్యం నెరవేరినట్లే అనుకోవచ్చు. అక్కడి నుంచి చంద్రుడిపై తిరుగుతూ అక్కడి రహస్యాల్ని ఛేదించేందుకు వీలవుతుంది.
ఇవాళ చంద్రయాన్ నౌక నుంచి విక్రమ్ ల్యాండర్ విజయవంతంగా విడిపోయిన విషయాన్ని ఇస్రో ట్వీట్ చేసింది. ఇందులో థ్యాంక్స్ ఫర్ ద రైడ్, మేట్ అంటూ ఇస్రో పేర్కొంది. అలాగే ప్రొపల్షన్ మాడ్యూల్ (PM) నుంచి ల్యాండర్ మాడ్యూల్ (LM)విజయవంతంగా విడిపోయిందని తెలిపింది. రేపు దాదాపు సాయంత్రం 4 గంటల కోసం ప్లాన్ చేయబడిన డీబూస్టింగ్‌పై ల్యాండర్ కొంచెం తక్కువ కక్ష్యలోకి దిగడానికి సిద్ధంగా ఉందని ఇస్రో వెల్లడించింది.
మరో ట్వీట్ లో ఇస్రో ప్రొపల్షన్ మాడ్యూల్ కొన్ని నెలలు లేదా సంవత్సరాల పాటు ప్రస్తుత కక్ష్యలో తన ప్రయాణాన్ని కొనసాగిస్తుందని కూడా ఇస్రో తెలిపింది. ఇది భూమి యొక్క వాతావరణ స్పెక్ట్రోస్కోపిక్ అధ్యయనం, భూమిపై ఉన్న మేఘాల నుండి ధ్రువణతలో వైవిధ్యాలను కొలుస్తుందని వెల్లడించింది. అలాగే మన నివాస యోగ్యతకు అర్హత సాధించే ఎక్సోప్లానెట్‌ల ఆధారాల్ని సేకరిస్తుందని కూడా ఇస్రో తెలిపింది. దీంతో ఇప్పుడు అందరి చూపూ విక్రమ్ ల్యాండర్ ల్యాండింగ్, పనితీరుపైనే ఉంది.












Click it and Unblock the Notifications