వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Earthquake: వణికిన చైనా: 69 వేలమందిని బలిగొన్న ఆ ప్రావిన్స్‌లోనే మరోసారి..!!

|
Google Oneindia TeluguNews

బీజింగ్: చైనాలో భారీ భూకంపం సంభవించింది. ఆగ్నేయ ప్రాంతంలో సంభవించిన భూ ప్రకంపనల తీవ్రత అనూహ్యంగా ఉంటోంది. పలు భవనాలు కంపించాయి. భూకంప తీవ్రతకు ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. రోడ్ల మీదికి పరుగులు తీశారు. ప్రధాన భూకంపం తరువాత కూడా స్వల్పంగా ప్రకంపనలు సంభవించాయి. ఫలితంగా- తమ ఇళ్లల్లోకి వెళ్లడానికి ప్రజలు భయపడ్డారు. భూకంపం వల్ల ప్రాణ, ఆస్తినష్టం సంభవించినట్లు ఇప్పటివరకు సమాచారం లేదు.

చైనా ఆగ్నేయ ప్రాంతంలోని సించువాన్ ప్రావిన్స్‌లో ఈ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.6గా రికార్డయింది. ఈ ప్రావిన్స్‌లోని కంగ్డింగ్ సిటీ సమీప ప్రాంతాన్ని భూకంప కేంద్రంగా గుర్తించారు. కంగ్డింగ్ సిటీకి ఆగ్నేయ దిశగా 43 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది భూకంప కేంద్ర ప్రాంతం. ఉపరితలం నుంచి 10 కిలోమీటర్ల లోతున ఫలకాల్లో మార్పుల వల్ల భూకంపం చోటు చేసుకున్నట్లు యునైటెడ్ స్టేట్స్ జియాలాజికల్ సర్వే (యూఎస్‌జీఎస్) తెలిపింది.

China: A 6.6-magnitude earthquake struck southwestern of the city of Kangding in Sichuan province

భూప్రకంపనలు సంభవించిన వెంటనే స్థానిక అధికారులు సించువాన్ ప్రావిన్స్‌కు లెవెల్-2 రెస్పాన్స్‌ను జారీ చేశారు. లెవెట్-2 రెస్పాన్స్‌ను రెండో అతి తీవ్ర ప్రమాదకరమైన హెచ్చరికగా భావిస్తారు. ఈ హెచ్చరికలు జారీ అయిన వెంటనే స్థానిక డిజాస్టర్ మేనేజ్‌మెంట్, ఇన్వెస్టిగేషన్ అండ్ రెస్క్కూ విభాగం అధికారులు అప్రమత్తం అయ్యారు. ప్రకంపన తీవ్రత.. కంగ్డింగ్ సిటీకి సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న చెంగ్డూలోనూ కనిపించాయి.

2008లో ఇదే సించువాన్ ప్రావిన్స్‌లో పెను భూకంపం సంభవించింది. అప్పట్లో దాని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 8.0గా రికార్డయింది. ఆ భూకంపంలో వేలాదిమంది మరణించారు. 69 వేల మందికి పైగా నాటి భూకంపానికి బలి అయ్యారు. 3,74,176 మంది గాయపడ్డారు. 18,222 మంది అదృశ్యం అయ్యారు. వారంతా భూకంపం వల్ల కుప్పకూలిన భవన శిథిలాల మధ్య చిక్కుకుని మరణించినట్లు అప్పట్లో అధికారులు ప్రకటించారు.

English summary
A 6.6-magnitude earthquake struck southwestern China on Monday, according to the US Geological Survey.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X