• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

హాంకాంగ్ భద్రతా చట్టానికి ఆమోదం... చైనాలో హాంకాంగ్ కలిసిన వార్షికోత్సవం నాడే నిరసనల హోరు

|

చైనా పార్లమెంటు హాంగ్ కాంగ్ కోసం వివాదాస్పద జాతీయ భద్రతా చట్టాన్ని ఆమోదించింది. డ్రాగన్ కంట్రీ చైనా మరో వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. చైనా పార్లమెంట్ హాంకాంగ్ కోసం వివాదాస్పద జాతీయ భద్రతా చట్టాన్ని ఆమోదించింది. చైనా పార్లమెంట్లో హాంకాంగ్ చట్టానికి ఏకగ్రీవ ఆమోదం తెలిపింది. బిల్లుకు అనుకూలంగా మొత్తం 122 ఓట్లు పోలైన నేపథ్యంలో హాంకాంగ్ చట్ట బిల్లు పాస్ అయింది. ఇక ఈ చట్టం ప్రకారం చైనా పట్ల హాంకాంగ్ లో ఎటువంటి జాతి వ్యతిరేక కార్యకలాపాలు జరిగినా కఠిన శిక్షలు ఉంటాయి.

హాంకాంగ్ సిటీ గుర్తింపుకు ప్రమాదం ఉందని ఆందోళనలు

హాంకాంగ్ సిటీ గుర్తింపుకు ప్రమాదం ఉందని ఆందోళనలు

చైనా ఏకపక్షంగా హాంకాంగ్ భద్రతా చట్టాన్ని ఆమోదించటం పై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. జాతీయ భద్రతా చట్టం పాసైన తీరు హాంకాంగ్లో ఆందోళనకు కారణమవుతుంది.ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. హాంకాంగ్ సిటీ గుర్తింపుకు ప్రమాదం ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆదివారం ప్రారంభమైన మూడు రోజుల సమావేశంలో నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ స్టాండింగ్ కమిటీ ఈ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించింది.

హాంకాంగ్ స్వేచ్ఛను కోల్పోతుందని నిరసనలు

హాంకాంగ్ స్వేచ్ఛను కోల్పోతుందని నిరసనలు

చైనా ఆమోదించిన జాతీయ భద్రతా చట్టం వల్ల హాంకాంగ్ తన న్యాయ స్వేచ్ఛను, సిటీ స్వేచ్ఛను కూడా కోల్పోతుందని,ఈ చట్టం వల్ల హాంకాంగ్ ప్రజలకు ఇబ్బంది తలెత్తుతుందని విమర్శలు వస్తున్నాయి.హాంకాంగ్ బ్రిటన్ నుండి 1997లో చైనాకు అప్పగించడం జరిగింది . బ్రిటన్ నుండి తిరిగి చైనా భూభాగానికి హాంకాంగ్ ను మారుస్తూనిర్ణయం తీసుకున్నారు. హాంకాంగ్ చైనాలో భాగమైన వార్షికోత్సవానికి ఒక్క రోజు ముందు ఒక రోజుకు ముందు ఈ చట్టం ఆమోదించబడటం గమనార్హం.

సెమీ అటానమస్ నగరంపై బీజింగ్ ప్రత్యక్ష నియంత్రణ

సెమీ అటానమస్ నగరంపై బీజింగ్ ప్రత్యక్ష నియంత్రణ

హాంకాంగ్ బిల్లును వ్యతిరేకిస్తూ అంతర్జాతీయ దేశాలు మే నెలలో ఆందోళన వ్యక్తం చేసినా సరే, అవేవీ పట్టింపు లేకుండా చైనా మాత్రం హాంకాంగ్ జాతీయ భద్రతా చట్టాన్ని ఆమోదించిందిఈ చట్టాన్ని హాంకాంగ్‌లోని ప్రతిపక్ష శాసనసభ్యులు, ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కుల సంఘాలు మరియు రాజకీయ నాయకులు తీవ్రంగా విమర్శించారు, సెమీ అటానమస్ నగరంపై బీజింగ్ యొక్క ప్రత్యక్ష నియంత్రణను ఇది నిర్ధారిస్తుందని చాలామంది అంటున్నారు . తమపై బీజింగ్ పెత్తనాన్ని హాంకాంగ్ ఒప్పుకోలేకపోతుంది.

  G4 EA H1N1 : China పందుల్లో కొత్త వైరస్.. Corona కంటే డేంజర్.. అవలీలగా మనుషులకు సంక్రమణ! || Oneindia
  నిరంతరం అణిచివేతలకు పాల్పడటానికి ఈ నిర్ణయమా !!

  నిరంతరం అణిచివేతలకు పాల్పడటానికి ఈ నిర్ణయమా !!

  ప్రెసిడెంట్ జిన్‌పింగ్ ఆధ్వర్యంలో పౌర సమాజంపై కేంద్ర ప్రభుత్వం నిరంతరం అణిచివేతలకు పాల్పడటానికి ఇది ఉపయోగపడుతుందని చాలా మంది ఆందోళన చెందుతున్నారు. చైనా లో హాంకాంగ్ కలిసిన సందర్భంగా నిర్వహించవలసిన వార్షికోత్సవం ఇప్పుడు, జాతీయ భద్రతా చట్టాన్ని ఆమోదిస్తూ తీసుకున్న నిర్ణయంతో నిరసనల దినోత్సవం గా మారింది. అయితే శాంతియుతంగా నిరసనలు వ్యక్తం చెయ్యటానికి మాత్రమే వారికి అనుమతినిచ్చింది.

  English summary
  China has passed a controversial security law on hongkong giving it new powers over Hong Kong to beijing deepening fears for the city's freedoms. The law has sparked demonstrations in Hong Kong since it was announced by Beijing in May. China says it is needed to tackle unrest and instability and rejects criticism as interference in its affairs.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more