• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

యుద్ధం తప్పదా:చైనా మరో పెనువివాదం.. వినాశనమన్న అమెరికా.. హాంకాంగ్ సెక్యూరిటీ బిల్లు పాస్..

|

చూడబోతే చైనాకు కాలంమూడినట్లుంది. ఇటు భారత భూభాగాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తోన్న డ్రాగన్ దేశం.. అటు హాంకాంగ్ స్వయంప్రతిపత్తిని కాలరాస్తూ మరో వివాదాస్పద చర్యకు ఉపక్రమించింది. ''వన్ కంట్రీ.. టూ సిస్టమ్స్'' ఒప్పందానికి విరుద్ధంగా హాంకాంగ్ లో కొత్త నేషనల్ సెక్యూరిటీ చట్టం అమలు చేయాలనే బిల్లుకు గురువారం చైనా పార్లమెంట్ ఆమోదం తెలిపింది. హాంకాంగ్ పై చైనా పెత్తనాన్ని ప్రపంచ దేశాలన్నీ నిరసిస్తుండగా, అమెరికా మరో అడుగుముందుకేసి.. వారం రోజుల్లోనే కఠిన చర్యలకు దిగుతామని హెచ్చరించడంతో దక్షిణ చైనా సముద్రంలో మళ్లీ యుద్ధమేఘాలు కమ్ముకున్నట్లయింది.

చైనాపై ముప్పేటదాడి.. తగ్గని భారత్.. యుద్ధసన్నద్ధతపై ఐరాస జోక్యం.. మరో షాకిచ్చిన అమెరికాచైనాపై ముప్పేటదాడి.. తగ్గని భారత్.. యుద్ధసన్నద్ధతపై ఐరాస జోక్యం.. మరో షాకిచ్చిన అమెరికా

అసలేంటీ బిల్లు?

అసలేంటీ బిల్లు?


1997 జూలై 1 బ్రిటీష్ పాలకులు హాంకాంగ్‌ను చైనాకు అప్పగించిన సందర్భంలో.. ప్రత్యేక రాజ్యాంగాన్ని, ‘వన్ కంట్రీ, టూ సిస్టమ్స్' పేరుతో ఒప్పందాన్ని రూపొందించారు. వాటి ప్రకారం హాంకాంగ్ ప్రజలకు భావ ప్రకటనా స్వేచ్ఛ, స్వతంత్ర న్యాయవ్యవస్థ, ప్రజాస్వామిక హక్కులు లభించాయి. చైనా మెయిన్ లాండ్ లో ఈ తరహా స్వేచ్ఛకు అవకాశంలేదు. 50 ఏళ్ల వరకు ఈ ఒప్పందాలు కొనసాగుతాయని స్పష్టంగా పేర్కొన్నప్పటికీ.. హాంకాంగ్ స్వయంప్రతిపత్తిని ఎత్తేసి, ఆ సిటిని పూర్తిగా తనలో కలుపుకునేందుకు చైనా ప్రయత్నిస్తున్నది. అందులో కీలక మలుపే ఇవాళ్టి ‘నేషనల్ సెక్యూరిటీ యాక్ట్' ఆమోదం.

ఇకపై అక్కడా చైనా చట్టాలే..

ఇకపై అక్కడా చైనా చట్టాలే..

‘వన్ కంట్రీ.. టూ సిస్టమ్స్' ఒప్పందం కారణంగా హాంకాంగ్ కు ఏవైతే హక్కులు దక్కాయో.. కొత్త జాతీయ భద్రతా చట్టంతో అవన్నీ రూపుమాసిపోనున్నాయి. ఇకపై చైనా మెయిన్ లాండ్ లో అమలయ్యే కఠిన చట్టాలనే హాంకాంగ్ వాసులు పాటించాల్సి ఉంటుంది. చైనా జాతీయ గీతాన్ని అవమానించడాన్ని నేరంగా పరిగణిస్తారు. ఈ మేరకు జాతీయ భద్రతా చట్టం డ్రాఫ్ట్ బిల్లుకు నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్‌లో(చైనా జాతీయ పార్లమెంట్) దాదాపు ఏకగ్రీవ ఆమోదం లభించింది. బిల్లుకు అనుకూలంగా 2,878 ఓట్లు రాగా, వ్యతిరేకంగా ఒక్కరు మాత్రమే ఓటేశారు. ఆరుగురు సభ్యులు గైర్హాజరయ్యారు. పార్లమెంటు ఆమోదం పొందిన ఈ కొత్త బిల్లును స్టాండింగ్ కమిటీ ముందుకు పంపారు.. హాంకాంగ్ లోని రబ్బర్ స్టాంప్ ప్రభుత్వం ఆమోదంతో ఆగస్టు నాటికి ఇది చట్టంగా రూపుదాచ్చనుంది.

నిరసనల జోరు..

నిరసనల జోరు..

తమపై చైనా ఆధిపత్యాన్ని నిరసిస్తూ హాంకాంగ్ వాసులు ఏడాది కాలంగా ఎడతెగని ఉద్యమాలు చేస్తున్నారు. గురువారం చైనా పార్లమెంటులో హాంకాంగ్ జాతీయ భద్రతా చట్టం డ్రాప్టు బిల్లుకు ఆమోదం లభించినట్లు వార్తలు రాగానే.. వేల మంది రోడ్లపైకొచ్చి నిరసనలు తెలిపారు. స్థానిక పార్లమెంట్, ప్రభుత్వ భవంతుల ముందు నిలబడి ప్రజాస్వామ్య అనుకూల నినాదాలు చేశారు. పోలీసుల దమనకాండకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భారీగా మోహరించిన పోలీసులు.. ఆందోళనకారుల్ని అదులోకి తీసుకున్నారు. వీకెండ్ కావడంతో శుక్రవారం నుంచి నిరసనల జోరు పెరిగే అవకాశముంది.

అమెరికా యుద్ధ హెచ్చరిక..

అమెరికా యుద్ధ హెచ్చరిక..

హాంకాంగ్ విషయంలో చైనా వైఖరిని తొలి నుంచీ తప్పుపడుతోన్న అమెరికా.. నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ బిల్లు ఆమోదం తర్వాత తీవ్రస్థాయి హెచ్చరికలు చేసింది. ఈ బిల్లును ఏకపక్ష, వినాశకరమైనదిగా అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో ఘాటుగా విమర్శించారు. అంతకు కొద్దిగంటల ముందే ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సైతం కీలక ప్రకటన చేశారు. చైనాపై అతి తీవ్ర చర్యలు ఉంటాయని, అత్యంత శక్తిమంతమైన నిర్ణయాన్ని తీసుకోబోతున్నామని, అదేటో వారం రోజుల్లో తెలుస్తుందని, అప్పటి వరకు వేచి చూడాలని అన్నారు. ట్రంప్ యుద్ధ హెచ్చరికలు చేయడం కొత్త కానప్పటికీ.. ప్రపంచ వాణిజ్య విపణిలో హాంకాంగ్ కు ఉన్న ప్రముఖ్యతను బట్టి ఎంతకైనా తెగించొచ్చనే చర్చ జరుగుతున్నది.

హాంకాంగ్ కోసం ఆరాటం..

హాంకాంగ్ కోసం ఆరాటం..

భౌగోళిక అనుకూలత కారణంగా బ్రిటిష్ కాలనీగా ఉన్నప్పటి నుంచే హాంకాంగ్.. ఆర్థికంగా సంపన్న సిటీగా ఎదిగింది. భిన్నసంస్కృతుల నిలయంగా, ప్రజాస్వామిక, పెట్టుబడిదారీ విధానాలకు అనుకూలంగా ఉండటంతో అమెరికా, యూరప్ దేశాల నుంచి పెట్టుబడులు వెల్లువెత్తాయి. అనతికాలంలోనే హాంకాంగ్ ‘‘వరల్ట్ ఎకనామిక్ పవర్ హౌస్''గా ఎదిగింది. చైనా ప్రభుత్వరంగ, ప్రైవేటు సంస్థలు సైతం హాంకాంగ్ గుండానే ప్రపంచదేశాలకు విస్తరించగలిగాయి. ప్రపంచంలోని టాప్ కంపెనీల్లో కొన్నింటి హెడ్డాఫీసులు హాంకాంగ్ లోనే పనిచేస్తున్నాయి. ఎలా చూసినా హాంకాంగ్ బంగారుబాతే కాబట్టి, దాన్ని పూర్తిగా వశం చేసుకోడానికి చైనా రెడీ అయింది. అమెరికాను బూచిగా చూపించి.. హాంకాంగ్ లో కొనసాగుతోన్న ప్రజాస్వామిక ఉద్యమాలపై చైనా ఉక్కుపాదం మోపుతున్నది. అమెరికా హెచ్చరికల నేపథ్యంలో హాంకాంగ్ వివాదం ఏమలుపుతిరుగుతుందో వేచిచూడాలి..

English summary
China on Thursday passed a new security legislation for Hong Kong, defying a threat by US President Donald Trump to respond strongly to a measure that democracy advocates say will curb essential freedoms in the city.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X