మోదీ అమెరికా పర్యటన వేళ- భారత్‌కు బిగ్ షాక్ ఇచ్చిన చైనా
వాషింగ్టన్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటనకు బయలుదేరి వెళ్లారు. భారత కాలమానం ప్రకారం.. ఈ అర్ధరాత్రి దాటిన తరువాత 1:30 గంటలకు వాషింగ్టన్‌కు చేరుకోనున్నారు. ఆండ్రూస్ ఎయిర్ ఫోర్స్ బేస్‌లో ల్యాండ్ కానున్నారు. పలువురు ప్రవాస భారతీయులు ఆయనకు స్వాగతం పలకనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. మోదీ రాకకోసం ఎన్నారైలు ఉత్సాహంగా ఎదురు చూస్తోన్నారు.
బుధవారం 9వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని మోదీ న్యూయార్క్‌లోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో నిర్వహించే యోగా కార్యక్రమానికి హాజరుకానున్నారు. 180 దేశాల ప్రముఖులు ఇందులో పాల్గొననున్నారు. అనంతరం న్యూయార్క్ నుంచి వాషింగ్టన్ డీసీకి చేరుకుంటారు. అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్‌లో జో బైడెన్, జిల్ బైడెన్ ఇచ్చే విందుకు హాజరవుతారు.

ఈ పరిణామాల మధ్య- భారత్‌కు బిగ్ షాక్ ఇచ్చింది చైనా. లష్కరే తోయిబాకు చెందిన భయానక ఉగ్రవాది సాజిద్ మీర్‌ను గ్లోబల్ టెర్రరిస్ట్‌గా ప్రకటించాలంటూ భారత్ చేసిన ప్రతిపాదనలను అడ్డుకుంది. ఈ సాజిద్ మీర్ మరెవరో కాదు- భారత్‌లో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్. 2008 నవంబర్ 11వ తేదీన ప్రపంచం మొత్తాన్నీ దిగ్భ్రాంతికి గురి చేసిన ముంబై దాడులు, బాంబు పేలుళ్ల ప్రధాన సూత్రధారి.
పాకిస్తాన్ దేశస్తుడు. అతణ్ని గ్లోబల్ టెర్రరిస్ట్‌గా ప్రకటించాలంటూ భారత్ ఇటీవలే ఐక్యరాజ్య సమితికి విజ్ఞప్తి చేసింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను అందజేసింది. 26/11 ఉగ్రదాడి వివరాలను ఇందులో పొందుపరిచింది. కసబ్ ఇచ్చిన వివరాల ఆధారంగా సాజిద్ మీర్‌ను ప్రధాన సూత్రధారిగా నిర్ధారించినట్లు భారత్ వెల్లడించింది. అతణ్ని గ్లోబల్ టెర్రరిస్ట్‌గా ప్రకటించాలంటూ విజ్ఞప్తి చేసింది.
ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి రూపొందించిన 1267 అల్ ఖైదా ఆంక్షల కమిటీ కింద సాజిద్ మీర్‌ను గ్లోబల్ టెర్రరిస్ట్‌గా గుర్తించడానికి అన్ని అర్హతలు ఉన్నాయని వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా అతని ఆస్తులను స్తంభింపజేయాలని, వివిధ దేశాల మధ్య రాకపోకలను నిషేధించాలని భారత్ కోరింది. ఆయుధాల వినియోగంపైనా నిషేధాన్ని వర్తింపజేయాలంటూ ప్రతిపాదించింది. అమెరికా కూడా ఈ ప్రతిపాదనలకు మద్దతె తెలిపింది.
ఈ ప్రతిపాదనలను భద్రత మండలిలో చైనా అడ్డుకుంది. తాను దీన్ని వ్యతిరేకిస్తోన్నట్లు వెల్లడించింది. భారత్‌తో శతృత్వాన్ని, పాకిస్తాన్‌తో మిత్రత్వాన్ని కొనసాగిస్తోన్న నేపథ్యంలో చైనా ఈ నిర్ణయాన్ని తీసుకుంది. పాకిస్తాన్‌లోని యాంటీ టెర్రరిజం కోర్టు- సాజిద్ మీర్‌కు 15 సంవత్సరాల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. మీర్ చనిపోయాడంటూ గతంలో పాకిస్తాన్ బుకాయించింది కూడా. దీనికి తగిన సాక్ష్యాధారాలను చూపించలేకపోయింది.
-
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications