'ఉ.కొరియాతో ముప్పే, మున్ముందు చైనా కూడా పెద్ద సవాలే?'

Subscribe to Oneindia Telugu

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాను ఉత్తరకొరియా బెంబేలెత్తిస్తుంటే.. ఇటు భారత్‌ను చైనా ముప్పు తిప్పలు పెట్టాలని చూస్తోంది. యుద్ద వాతావరణంతో ఈ దేశాల్లో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి.

భయంకరమైన నిజాలు: భూతల నరకం ఉ.కొరియా, ప్రపంచానికి తెలియని అక్కడి బతుకు?

అదే సమయంలో అగ్రరాజ్యానికి చైనా శాంతి వచనాలు బోధించడం, ఇటు భారత్ తో యుద్దానికి కాలు దువ్వడం చైనా ద్వంద్వ నీతికి అద్దం పడుతోంది. ఈ వ్యవహారాన్ని గమనిస్తున్న అమెరికా.. డ్రాగన్ దూకుడు దీర్ఘకాలంలో అతిపెద్ద సవాల్ అని అభిప్రాయపడింది.

 China, extremism long-term challenge in Asia Pacific: US

దక్షిణ చైనా సముద్రంపై పట్టుకోసం డ్రాగన్ కుటిల యుక్తులు పన్నుతోందని ఇంతకుముందు వెల్లడించిన అమెరికా.. తాజాగా మరోసారి స్పందించడం గమనార్హం.ఆసియన్ పసిఫిక్ ప్రాంతంపై ఫోకస్ చేసిన
అమెరికన్ కమాండర్ అడ్మిరల్ హ్యారీ హారిస్ ఈ వ్యాఖ్యలు చేశారు.

ప్రస్తుతం ఉత్తరకొరియా నుంచి ముప్పు పొంచి ఉందని, అమెరికా సహా ఆసియా పసిఫిక్ దేశాలన్నింటిని చైనా, ఉత్తరకొరియాల తర్వాత ఐసిస్, ఇతర ఉగ్రవాద సంస్థల కార్యకలాపాలు కలవరపరుస్తాయని అన్నారు. ఉత్తరకొరియా దుందుడుకు వైఖరి ఆందోళనపరిచే అంశమని, అదే సమయంలో ఆసియాలో ఐసిస్ ఉనికి కూడా ఆందోళనపరిచే విషయమని అన్నారు.

తూర్పు, దక్షిణ సముద్ర ప్రాంతాల్లో చైనా చేపడుతున్న చర్యలు ఆక్షేపణీయమన్నారు. మారావి నగరాన్ని తిరిగి చేజిక్కించుకునేందుకు ఫిలిప్పీన్స్ కు సైనిక సహాయం అందిస్తున్నామని చెప్పుకొచ్చారు. దక్షిణాసియాలోని ఇండోనేషియా, మలేషియా, దక్షిణ ఫిలిప్పీన్స్, మరియు బంగ్లాదేశ్ ల గురించి తాను ఆందోళన చెందుతున్నట్లు తెలిపారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
An assertive China and the violent extremism pose greatest challenge to the Asia Pacific region in the long term, but North Korea is the most immediate and pressing challenge, a top American commander has said.
Please Wait while comments are loading...