వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చైనా దుందుడుకు: లఢక్ బోర్డర్ వద్ద మళ్లీ: 8 చోట్ల కొత్త నిర్మాణాలు: చీకటి యుద్ధంపై రిహార్సల్స్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: డ్రాగన్ కంట్రీ.. చైనా తన తెంపరితనాన్ని మానుకోవట్లేదు. దుందుడుకు చర్యలకు దిగుతూనే వస్తోంది. భారత్‌ను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తూనే ఉంది. దాదాపుగా ఏడాదిన్నర కాలంగా లఢక్ సమీపంలోని వాస్తవాధీన రేఖ వద్ద ఉద్రిక్త పరిస్థితులు, యుద్ధ వాతావరణానికి కారణమౌతోన్న చైనా.. తన వైఖరిని దూకుడు వైఖరిని తగ్గించుకోవట్లేదు. ఈ తరహా వాతావరణాన్ని నియంత్రించుకోవడానికి రెండు దేశాలు కూడా దశలవారీగా కమాండర్ స్థాయి చర్చలను కొనసాస్తూనే.. సరిహద్దుల వద్ద తన సైనిక బలగాలను బలోపేతం చేసుకుంటోంది.

Bharat Bandh: స్తంభించిన రవాణా: జాతీయ రహదారులు క్లోజ్..రైళ్లు బంద్: పట్టాలపైనే సభలుBharat Bandh: స్తంభించిన రవాణా: జాతీయ రహదారులు క్లోజ్..రైళ్లు బంద్: పట్టాలపైనే సభలు

వాస్తవాధీన రేఖ వద్ద ఎనిమిది చోట్ల..

వాస్తవాధీన రేఖ వద్ద ఎనిమిది చోట్ల..

లఢక్ సమీపంలోని వాస్తవాధీన రేఖ వద్ద ఎనిమిది చోట్ల చైనా కొత్తగా నిర్మాణాలను చేపట్టింది. వాస్తవాధీన రేఖకు అతి సమీపంలో ఉండే అవుట్ పోస్ట్ ప్రాంతాలవి. కొన్ని చోట్ల మోడ్యులర్ కంటైనర్ బేస్డ్ నిర్మాణాలను పూర్తి చేసింది కూడా. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ సైనికుల కోసం ఈ ఎనిమిది చోట్ల కొత్త షెల్టర్ల నిర్మాణాన్ని చేపట్టిందనే అభిప్రాయాలు ఉన్నాయి. గత ఏడాది పొడవునా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న హాట్ స్ప్రింగ్స్‌తో పాటు ఛాంగ్ లా, టషిగోంగ్, మన్జా, ఛురుప్, కొరాకోమ్ పాస్ సమీపంలోని వాహబ్ ఝిల్గా వంటి చోట్ల కొత్తగా ఆర్మీ షెల్టర్లు వెలిసినట్లు చెబుతున్నారు.

 ఒక్కో లొకేషన్‌లో ఏడు క్లస్టర్లు..

ఒక్కో లొకేషన్‌లో ఏడు క్లస్టర్లు..

ఒక్కో ప్రాంతంలో చైనా ఏడు క్లస్టర్లను ఎంపిక చేసుకుందని, ఒక్కో క్లస్టర్‌లో 80 నుంచి 84 కంటైనర్ బేస్డ్ షెల్టర్లను నిర్మించినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. గత ఏడాది రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న తరువాత ఇప్పటిదాకా చేపట్టిన నిర్మాణాలకు ఇవి అదనం. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ చేపట్టిన ఈ నిర్మాణాల వ్యవహారం- వాస్తవాధీన రేఖ వద్ద మరింత ఉద్రిక్తతకు దారి తీయడానికి అవకాశాలు లేకపోలేదని సీనియర్ అధికారిని తన కథనంలో ఉటంకించింది.

 రాత్రివేళ యుద్ధంపై

రాత్రివేళ యుద్ధంపై

రాత్రివేళ యుద్ధాన్ని కొనసాగించడం, చీకట్లో శతృవులపై దాడులు చేయడానికి అవసరమైన రిహార్సల్స్‌ను కొద్దిరోజుల కిందటే పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ సైనికులు నిర్వహించారు. దీన్ని దశలవారీగా కొనసాగిస్తున్నట్లు సమాచారం ఉంది. 16,000 అడుగుల ఎత్తు ఉన్న గ్ఝిన్‌జియాంగ్ రీజియన్‌లో ఈ తరహా యుద్ధరీతుల్లో శిక్షణ పొందినట్లు నివేదికలు అందుతున్నాయి. దీనితోపాటు- వాస్తవాధీన రేఖకు సమీపంలో ఉన్న తన ఎయిర్ బేస్‌లను కూడా చైనా సైనికులు బలోపేతం చేసుకుంటోంది. నైట్ ల్యాండింగ్, టేకాఫ్ వంటి చర్యలకు అనుకూలంగా ఉండేలా ఎయిర్ బేస్‌లను డెవలప్ చేసినట్లు తెలుస్తోంది.

Recommended Video

PM Modi In US 5G - Had Meetings With Qualcomm CEO, Blackstone Group CEO
3,488 కిలోమీటర్ల మేర..

3,488 కిలోమీటర్ల మేర..

భారత్-చైనా సరిహద్దుల పొడవు దాదాపు 3,488 కిలోమీటర్లు. లఢక్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు ఈ రెండు దేశాలు సరిహద్దులను పంచుకుంటోన్నాయి. ఈ సరిహద్దుల వెంబడి కొన్ని కీలకమైన, వ్యూహాత్మకమైన లొకేషన్లలోనూ ఇవే తరహా నిర్మాణాలను చేపట్టింది చైనా. హోటన్, కష్గర్, గర్గున్సా, ల్హాసా-గొంగ్గర్, షిగాట్సే వద్ద ఈ తరహా కొత్త నిర్మాణాలను చేపట్టిందని పేర్కొంది. ఎయిర్ బేస్‌లల్లో రష్యా నుంచి కొనుగోలు చేసిన ఎస్-400 మిస్సైళ్లు, యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ మిస్సైల్ బ్యాటరీస్‌లను మోహరింపజేసినట్లు నిర్ధారించింది. గర్గున్సా వద్ద ఎస్-400 ఎక్సర్‌‌సైజెస్ చేపట్టినట్లు తెలిపింది.

English summary
Amid the border dispute between India and China in eastern Ladakh and ongoing military and diplomatic talks to resolve it, the Chinese People's Liberation Army. continues to build more troops shelters and strengthen its airbases near the LAC.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X