చేసిన పాపానికి ఇప్పుడు ఫలితం అనుభవిస్తోన్న చైనా..!!

బీజింగ్: రెండున్నర సంవత్సరాల పాటు ప్రపంచం మొత్తాన్నీ వణికించిన ప్రాణాంతక కరోనా వైరస్‌కు పుట్టినిల్లుగా గుర్తింపు పొందింది చైనా. చైనాలోని హ్యూబే ప్రావిన్స్‌లోని వుహాన్ సిటీలో పుట్టుకొచ్చిన ఈ అత్యంత ప్రమాదకర మహమ్మారి బారిన పడని దేశమంటూ లేదు. ప్రపంచాన్ని కమ్మేసింది. అన్ని దేశాల్లోనూ అడుగు పెట్టింది. లక్షలాది మంది ప్రజల ప్రాణాలను తీసింది. కరోనా వైరస్ బారిన తీవ్రంగా పడిన దేశాల్లో అమెరికా అగ్రస్థానంలో ఉంటోంది. 10 కోట్లకు పాజిటివ్ కేసులు అక్కడ నమోదయ్యాయి. 11 లక్షల మందికి పైగా దీని బారిన పడి మరణించారు.

తీవ్రత తగ్గినా..

కరోనా బారిన పడి పెద్ద ఎత్తున ప్రాణ నష్టాన్ని చవి చూసిన దేశాల జాబితాలో రెండో స్థానంలో భారత్ నిలిచింది. నాలుగున్నర కోట్లకు పైగా పాజిటివ్ కేసులు భారత్‌లో నమోదయ్యాయి. అయిదున్నర లక్షల మంది మృతి చెందారు. కరోనా వైరస్‌‌ను నిర్మూలించడానికి భారత్ సహా కొన్ని దేశాలు వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన తరువాత దీని తీవ్రత తగ్గింది. పూర్తిగా నిర్మూలించకపోయినప్పటికీ- అన్ని దేశాల్లోనూ ఈ మహమ్మారి విస్తరించే వేగం అదుపులోకి వచ్చింది. మాస్కులను ధరించాల్సిన అవసరం లేనంతగా దీని తీవ్రత తగ్గిపోయింది.

కొత్త కేసులు..

కొత్త కేసులు..

ఇప్పుడు మళ్లీ చైనాలో కరోనా వైరస్ అనూహ్యంగా విస్తరించింది. ప్రతి రోజూ వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. అదే స్థాయిలో మరణాలు కూడా సంభవిస్తోన్నాయి. కోవిడ్ పేషెంట్లతో ఆసుపత్రులు, క్లినిక్స్, స్పెషల్ వార్డులు భర్తీ అయ్యాయి. కొత్త పేషెంట్ల కోసం బెడ్స్ దొరకని దుస్థితిని ఎదుర్కొంటోంది డ్రాగన్ కంట్రీ. మృతదేహాలకు అంత్యక్రియలను నిర్వహించడానికి కూడా చోటు దక్కని దుర్భర పరిస్థితులు చైనాలో ఏర్పడ్డాయి.

జీరో కోవిడ్ పాలసీ..

కరోనా వైరస్‌‌ను నిర్మూలించడానికి ఇదివరకు చైనా ప్రభుత్వం జీరో-కోవిడ్ పాలసీని అనుసరించిన విషయం తెలిసిందే. ఈ విధానం కింద అత్యంత కఠినమైన ఆంక్షలను విధించింది. దీన్ని చైనీయులు తిరస్కరించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. నిరసన ప్రదర్శనలను నిర్వహించారు. దాడులకూ వెనుకాడలేదు. ప్రభుత్వ కార్యాలయాలపై దాడులు చేయడంతో అక్కడ హింసాత్మక పరిస్థితులు నెలకొన్నాయి.

 ఆంక్షలు సడలించడంతో..

ఆంక్షలు సడలించడంతో..

దీని తరువాత ప్రభుత్వం ఆంక్షలను సడలించింది. అదే ఇప్పుడు చైనా కొంప ముంచుతోంది. కోవిడ్ కేసులు వేలల్లో పుట్టుకొని వస్తోండటంతో ఆసుపత్రులు, కరోనా వార్డులు కిటకిటలాడుతున్నాయి. చాలినంత చోటు దొరకట్లేదు. సెకెండ్ వేవ్ సమయంలో భారత్‌లో ఎలాంటి విపత్కర పరిస్థితులు నెలకొన్నాయో.. సరిగ్గా అలాంటి వాతావరణమే ఇప్పుడు చైనాలో నెలకొంది. వార్డుల్లో నేల మీద పేషెంట్లకు చికిత్స అందించే దుస్థితి ఏర్పడిందక్కడ. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

మరిన్ని కేసులు..

మరిన్ని కేసులు..

ఈ దుష్ప్రభావం ఇక్కడితో ఆగేలానూ లేదు. మిలియన్ల మంది ప్రజలు వైరస్ బారిన పడే ప్రమాదం ఉందనే అంచనాలు వ్యక్తమౌతోన్నాయి. ప్రముఖ ఎపిడమియాలజిస్ట్ ఎరిక్ ఫీగల్-డింగ్ దీనిపై హెచ్చరికలు చేశారు. థర్మోన్యూక్లియర్ బాడ్ పరిస్థితి గురించి వివరించారు. చైనాలో కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతాయని అంచనా వేశారు. ప్రపంచ దేశాలపైనా దీని దుష్ప్రభావం పడే ప్రమాదం లేదని ఎరిక్ అభిప్రాయపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+