అలా చేస్తూ భారత్ యుద్ధానికి సిద్ధమవుతోంది: చైనా ఆరోపణలు
నెలన్నర రోజులుగా భారత్ - చైనాల మధ్య వివాదాస్పదంగా మారిన డోక్లామ్ సరిహద్దు ప్రాంతంలో రోడ్లు బాగు చేయడం, బలగాలను మోహరించడం వంటి పనులు చేపడుతూ భారత్ యుద్ధ సన్నాహాలు చేస్తోందని చైనా విద
బీజింగ్/న్యూఢిల్లీ: నెలన్నర రోజులుగా భారత్ - చైనాల మధ్య వివాదాస్పదంగా మారిన డోక్లామ్ సరిహద్దు ప్రాంతంలో రోడ్లు బాగు చేయడం, బలగాలను మోహరించడం వంటి పనులు చేపడుతూ భారత్ యుద్ధ సన్నాహాలు చేస్తోందని చైనా విదేశాంగ శాఖ ఆరోపించింది.
చైనా భూభాగంలో భారత్ సైన్యం అక్రమంగా ప్రవేశించడమే కాకుండా తమ వైపు భాగంలో బలగాలను మోహరిస్తోందని చైనా ఇష్టారీతిన ఆరోపణలు చేసింది. ఇది నిజంగా శాంతి కోసం మాత్రం కాదని చైనా విదేశాంగ శాఖ తెలిపింది.

చైనా ఆరోపణలను భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఖండించారు. దీనిపై ఆమె పార్లమెంట్‌కు లిఖితపూర్వక సమాధానం అందజేశారు.
భారత్ ఎప్పుడూ ఇరు దేశాల మధ్య శాంతి సమన్వయాన్నే కోరుకుంటుందని, మన మధ్య ద్వైపాక్షిక సంబంధాలు సజావుగా సాగాలంటే అలాగే ఉండాలని, అందుకు భారత్ కట్టుబడి ఉందన్నారు.
ఈ డోక్లాం సమస్యకు ఇరు దేశాల ప్రతినిధులు చర్చించడం ద్వారానే సమాధానాన్ని వెతికే ఆలోచనలో భారత్ ఉందని సుష్మా పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications