Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

భారత్ చుట్టూ ఉచ్చు పన్నుతున్న చైనా: శ్రీలంక సహకారం?

కొలంబో: భారత్ చుట్టూ చైనా క్రమక్రమంగా ఉచ్చు పన్నుతున్నట్టే కనిపిస్తోంది. భారత్ పొరుగు దేశాలను చేరదీసే ప్రయత్నాలకు తెర తీసింది. ఇప్పటికే శతృదేశం పాకిస్తాన్‌ను తనవైపునకు తిప్పుకొంది. పాకిస్తాన్‌లో రోడ్లు, ఓడరేవులు, ఇతర మౌలిక వసతుల అభివృద్ధి ప్రాజెక్టులకు పెద్ద ఎత్తున ఆర్థిక సహకారాన్ని అందజేస్తోంది. లఢక్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ వంటి సరిహద్దు ప్రాంతాల వద్ద చైనా స్వయంగా గ్రామాలను నిర్మిస్తోంది. అన్ని రకాల యుద్ధ సామాగ్రిని సరిహద్దులకు తరలించడానికి వీలుగా రోడ్లను నిర్మించుకుంటోంది.

భారత్ అభ్యంతరాలు బేఖాతర్..

భారత్ అభ్యంతరాలు బేఖాతర్..


ఇప్పుడు తాజాగా శ్రీలంకతో స్నేహ సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడానికి ప్రాధాన్యత ఇచ్చింది. చైనాకు చెందిన అత్యాధునిక పరిశోధక నౌక యువాన్ వాంగ్ 5ను రంగంలోకి దింపింది. ఈ ఇన్నోవేటివ్ షిప్‌ను శ్రీలంకకు పంపించింది. ఒకవంక భారత్ తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేస్తోన్నప్పటికీ- రణిల్ విక్రమసింఘె సారథ్యంలో శ్రీలంకలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం.. ఈ షిప్‌కు అనుమతి ఇవ్వడం సరికొత్త వివాదానికి దారి తీసింది.

అత్యాధునిక నౌక..

అత్యాధునిక నౌక..

యువాన్ వాంగ్ 5 షిప్.. ఈ తెల్లవారు జామున శ్రీలంకలోని హంబన్‌టోట పోర్ట్‌కు చేరుకుంది. బాలిస్టిక్‌ క్షిపణులు, అంతరిక్షం, ఉపగ్రహాలపై నిఘా వేయగలిగే అత్యాధునిక టెక్నాలజీ దీని సొంతం. సుమారు 750 కిలోమీటర్ల చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉన్న రీజియన్ల గగనతలంలో చోటు చేసుకునే అన్ని రకాల కార్యకలాపాలను ఇది పసిగట్టగలదు. భారత రక్షణ వ్యవస్థ, సబ్ మెరైన్స్, అంతరిక్ష పరిశోధనలు, మిస్సైల్ టెస్టింగ్, న్యూక్లియర్.. వంటి కార్యకలాపాలన్నింటిపైనా నిఘా ఉంచే సామర్థ్యం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి.

రక్షణ వ్యవస్థపై నిఘా..

రక్షణ వ్యవస్థపై నిఘా..


ఒకరకంగా ఈ షిప్.. పరిశోధనలపై కాకుండా భారత రక్షణ వ్యవస్థపై డేగకన్ను వేయడానికే వచ్చిందనే వాదనలు లేకపోలేదు. దేశ రక్షణ వ్యవస్థకు సంబంధించిన విషయాలను తెలుసుకోవడానికి గూఢచర్యం కోసం చైనా ఈ షిప్‌ను ఉపయోగిస్తోందని భారత్ భావిస్తోంది. యువాన్ వాంగ్ 5 నౌకకు శ్రీలంక ప్రభుత్వం అనుమతి ఇవ్వడం పట్ల భారత్ ఇదివరకే అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. శ్రీలంక మాత్రం దీనికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదనడానికి.. తాజాగా ఉదాహరణ- ఈ షిప్ హంబన్‌టోట ఓడరేవును చేరుకోవడమే.

Recommended Video

    China Spy Ship భారత్ చుట్టూ చైనా ఉచ్చు, శ్రీలంక సహకారం? *International | Telugu OneIndia
    శ్రీలంక సంక్షోభాన్ని అనుకూలంగా..

    శ్రీలంక సంక్షోభాన్ని అనుకూలంగా..


    ప్రస్తుతం శ్రీలంకలో నెలకొన్న ఆర్థిక సంక్షోభాన్ని చైనా ఈ రకంగా వాడుకుంటోందనే వాదనలు లేకపోలేదు. ఆ దేశానికి సహాయం చేస్తూ.. భారత రక్షణ వ్యవస్థపై నిఘా ఉంచడానికి శ్రీలంక పరిస్థితులను తనకు అనుకూలంగా మలచుకుందని చెబుతున్నారు. తమ దేశానికి చైనా ఆర్థికంగా సహాయ, సహకారాలను అందిస్తోన్నందున.. శ్రీలంక ప్రభుత్వం భారత అభ్యంతరాలను పెద్దగా పట్టించుకోవట్లేదనే అభిప్రాయాలు ఉన్నాయి.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+