ఇమ్రాన్ ఖాన్‌పైకి కాల్పులు: పాక్‌లో ఘర్షణలు
ఇస్లామాబాద్: మాజీ క్రికెటర్, పాకిస్తాన్ ప్రతిపక్ష నాయకుడు ఇమ్రాన్ ఖాన్ వాహనంపైకి శుక్రవారం కాల్పలు జరిగాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెండు పాకిస్తాన్ ఆందోళనకారుల గుంపులు ఒక చోటికి చేరాయి. గుజ్రన్‌వాలా నగరంలో ఇమ్రాన్ ఖాన్‌పైకి కాల్పులు జరిగాయి. పాలకపార్టీ కార్యకర్తలు అతనిపైకి రాళ్లు, చెప్పులు విసిరారు.
ఇస్లామాబాద్‌కు భారీ యెత్తున ర్యాలీగా వెళ్తుండగా ఇమ్రాన్ ఖాన్ వాహనంపై కాల్పులు జరిగాయి. కాల్పుల నుంచి అతను సురక్షితంగా బయటపడ్డారు. ఇమ్రాన్ ఖాన్‌తో పాటు మతగురువు తాహిర్ ఉల్ - ఖాద్రీ వేర్వేరుగా ఊరేగింపులు చేపట్టారు. ప్రధాని నవాజ్ షరీఫ్ రాజీనామాను డిమాండ్ చేస్తూ వారు ఈ ర్యాలీలు నిర్వహించారు.

ఇస్లామాబాద్‌లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రధాన రోడ్లకు షిప్పింగ్ కంటైనర్లను, వైర్లను అడ్డం పెట్టారు. డ్రమ్ములు వాయిస్తూ, పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ వందలాది ఆందోళనకారులు వీధుల్లోకి వచ్చారు.
దాడికి బెదరబోనని, లాంగ్ మార్చ్ సాగిస్తానని ఇమ్రాన్ ఖాన్ చెప్పారు. తన హత్యకు కుట్ర జరిగిందని ఆయన ఆరోపించారు. తనపై దాడి వెనక పిఎంఎల్ - ఎన్ హస్తం ఉందని ఆయన ఆరోపించారు. ఆజాదీ మార్చ్ పేరు మీద ఇమ్రాన్ ఖాన్ ర్యాలీ తలపెట్టారు.












Click it and Unblock the Notifications