విమానాన్ని సముద్రంలో ల్యాండ్ చేయబోయిన పైలట్!
టోక్యో: ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అందించిన సంకేతాలను తప్పుగా అర్థం చేసుకున్న ఓ పైలట్ విమానాన్ని సముద్రంలో ల్యాండ్ చేయబోయాడు! చివరకు తేరుకుని జాగ్రత్తగా రన్ వేపైకి తీసుకొచ్చి సురక్షితంగా దింపాడు.
జపాన్ ఎయిర్ లైన్స్‌కు చెందిన ఎయిర్ బస్ ఏ320-200 విమానం జపాన్‌లోని ఒకివా విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యే ప్రయత్నంలో పైలట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అందించిన సంకేతాలను తప్పుగా అర్థం చేసుకున్నాడు.

సముద్ర ఉపరితలానికి 75 మీటర్ల ఎత్తు వరకు తీసుకు వచ్చాడు. అనంతరం అప్రమత్తమై విమానాన్ని సురక్షితంగా రన్ వేపై లాండ్ చేశాడు. దీంతో విమానాశ్రయంలో టెక్నికల్ సిబ్బంది అంతా ఊపిరిపీల్చుకున్నారు.
ఈ ఘటన జరిగినప్పుడు విమానంలో ఆరుగురు సిబ్బంది సహా 53 మంది ప్రయాణికులు ఉన్నారని అధికారులు మంగళవారం వెల్లడించారు.












Click it and Unblock the Notifications