Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ప్రమాదపుటంచుల్లో ప్రపంచం ... 87 లక్షలకు పైగా కేసులు .. టాప్ 5 దేశాలు ఇవే

ప్రపంచం ఇప్పుడు డేంజర్ జోన్ లోకి వెళుతుంది. కరోనాకేసులు రోజురోజుకు పెరుగుతున్న తీరు ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఇప్పటికే అనేక మార్పులు హెచ్చరించిన డబ్ల్యూహెచ్వో కూడా మరోమారు హెచ్చరికలు జారీ చేసింది. ప్రతిరోజు లక్షల కేసులు పెరుగుతూ ఉంటే భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.

 ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 87,65,303

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 87,65,303

ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 87,65,303 కాగా ఇప్పటి వరకు కరోనా కారణంగా సంభవించిన మరణాలు 4,62,678. కరోనా యాక్టివ్ కేసుల విషయానికి వస్తే 36,74,791 కాగా ఇప్పటివరకు కరోనా నుంచి బయటపడిన వారు 46,27,834. ప్రపంచ వ్యాప్తంగా ప్రతిరోజు లక్షకుపైగా ప్రపంచవ్యాప్తంగా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తుంది. అమెరికా, దక్షిణాసియా, ప్రాచ్య దేశాల్లో పెద్ద సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి.

 యూఎస్ లో కరోనా కేసులు 22,97,190.. తర్వాత స్థానంలో బ్రెజిల్

యూఎస్ లో కరోనా కేసులు 22,97,190.. తర్వాత స్థానంలో బ్రెజిల్

ఇక ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులలో మొదటి స్థానంలో యూఎస్ ఏ ఉంది. అమెరికాలో కరోనా దారుణమైన పరిస్థితులను సృష్టించింది. అగ్రరాజ్యమైన అమెరికాను కరోనా వణికిస్తుంది . ఇక యూఎస్ఏ లో నమోదైన కరోనా కేసులు చూసినట్లయితే ఇప్పటివరకు 22 ,97,190 కేసులు నమోదయ్యాయి. కరోనా మరణాలు చూస్తే 1,21,407 గా ఉంది. ప్రపంచంలోనే అత్యధిక కరోనా ప్రభావిత దేశంగా యుఎస్ ఉంది. ఇక తర్వాతి స్థానంలో బ్రెజిల్ ఉంది. బ్రెజిల్ లో కరోనా కేసులు 10,38,568 కాగా,ఇక కరోనా మరణాలు 49,090 గా నమోదయ్యాయి.

మూడో స్థానంలో రష్యా .. నాల్గవ స్థానంలో ఇండియా

మూడో స్థానంలో రష్యా .. నాల్గవ స్థానంలో ఇండియా

ఇక ప్రపంచంలో మూడో స్థానంలో రష్యా ఉంది.ఇప్పటివరకు రష్యాలో నమోదైన కేసులు చూస్తే 5,69,063గా ఉంది. ఇక కరోనా మరణాలు చూస్తే 7,841గా నమోదయ్యాయి. రష్యా తర్వాతి స్థానంలో ఇండియా ఉంది. ప్రస్తుతం ఇండియా కరోనాకేసుల్లో నాలుగవ స్థానంలో ఉంది. ఇక ఇండియాలో చూస్తే ఇప్పటివరకూ వరల్డ్ మీటర్ ప్రకారం 3,95,812 కరోనా కేసులు నమోదు కాగా 12,970 మరణాలు సంభవించాయి. మూడో స్థానంలో ఉన్న రష్యాతో పోల్చుకుంటే,నాలుగో స్థానంలో ఉన్న ఇండియాలోనే కరోనా మరణాలు ఎక్కువగా సంభవించాయని వరల్డ్ మీటర్ ప్రకారం లెక్కలు చెబుతున్నాయి.

ఐదవ స్థానంలో యూకే .. ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు

ఐదవ స్థానంలో యూకే .. ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు

ఇక ఇండియా తర్వాతి స్థానంలో యూకే ఉంది.యూకేలో కరోనా కేసులు విషయానికి వస్తే 3,01,815 కేసులు నమోదు కాగా, ఇప్పటివరకు యూకేలో 42,461మంది కరోనా కారణంగా మృత్యువాతపడ్డారు. ప్రస్తుతానికి అమెరికా,బ్రెజిల్,రష్యా,ఇండియా,యూకే లు టాప్ ఫైవ్ ప్రభావిత దేశాలుగా ఉన్నాయి. ఇక ప్రతిదేశంలోనూ కేసులు రోజురోజుకీ పెరుగుతున్న తీరు ఆందోళన కలిగిస్తుంది.కరోనా విషయంలో అప్రమత్తంగా ఉండాలని, ఏమరపాటు మంచిదికాదని అన్ని దేశాలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు జారీ చేస్తుంది.

Recommended Video

    Bandla Ganesh కు Coronavirus పాజిటివ్..టెన్షన్ లో Tollywood!
    కరోనా కంట్రోల్ లో ప్రపంచమే విఫలం అవుతుందా ? తస్మాత్ జాగ్రత్త్

    కరోనా కంట్రోల్ లో ప్రపంచమే విఫలం అవుతుందా ? తస్మాత్ జాగ్రత్త్

    రోజురోజుకూ పరిస్థితులు దిగజారిపోతున్నాయని,మరింత ప్రమాదపు అంచులకు ప్రపంచం చేరుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. అయినప్పటికీ ఏ దేశంలోనూ కరోనా కంట్రోల్ లేని పరిస్థితి కనిపిస్తుంది. అధికారికంగా ప్రకటించిన జాబితానే ఇలా ఉంటే ప్రపంచవ్యాప్తంగా అనధికారికంగా మరెంత మంది కరోనా బాధితులు ఉన్నారో అన్నది ఆందోళన కలిగించే అంశమే. ఏది ఏమైనప్పటికీ వ్యక్తిగతమైన భద్రత, ఆరోగ్య రక్షణను దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ మెలగాల్సిన అవసరం ఉందని తాజా పరిస్థితులు ప్రపంచ ప్రజలకు చెబుతున్నాయి.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+