వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

covid పుట్టుకపై షాకింగ్ ట్విస్ట్: chinaలో కాదు, అమెరికాలోనే -whoతో దర్యాప్తునకు డ్రాగన్ డిమాండ్

|
Google Oneindia TeluguNews

యోగుల పుట్టుక, వాగుల పుట్టుక ఎవరికీ తెలీదనే నానుడి కరోనా వైరస్‌కూ వర్తించేలా పరిస్థితి తయారైంది. పుట్టి ఏడాదిన్నర దాటినా, ఇప్పటికీ భూగోళమంతా మహమ్మారి కోరల నుంచి బయటపడలేకపోతున్నది. గురువారం నాటికి గ్లోబల్ గా కేసుల సంఖ్య 17.78కోట్లకు, మరణాల సంఖ్య 38.5లక్షలకు పెరిగాయి. వైరస్ పుట్టుక మూలాలను కనిపెట్టగలిగితే దాని వ్యాప్తిని అడ్డుకోవడం ఇంకా సులువు అవుతుందని సైంటిస్టులు చెబుతుండగా, ఆ విషయంలో అగ్రదేశాలైన అమెరికా, చైనాలు మాటలతోనే యుద్ధం చేసుకుంటున్నాయి. మొన్నటిదాకా వూహాన్ ల్యాబ్ లీక్ థియరీతో అమెరికా బాణాలు విసరగా, ఇప్పుడు చైనా.. యూఎస్ ఎన్ఐహెచ్ నివేదికను అడ్డంపెట్టి కొత్త డిమాండ్లను తెరపైకి తెచ్చింది..

Etelaపై Jagan ఆగ్రహం -KCR బర్రెలు తినేవాడైతే నువ్వు గొర్రెలు తినే రకమంటూ -BJP, Modiపైనా ఫైర్Etelaపై Jagan ఆగ్రహం -KCR బర్రెలు తినేవాడైతే నువ్వు గొర్రెలు తినే రకమంటూ -BJP, Modiపైనా ఫైర్

వూహాన్ ల్యాబ్ లీకేజీ థియరీ..

వూహాన్ ల్యాబ్ లీకేజీ థియరీ..

చైనాలోని వూహాన్ సిటీలోగల వైరాలజీ ల్యాబ్ లో రహస్య పరిశోధనల్లోనే కరోనా వైరస్ పుట్టిందని అమెరికా ముందు నుంచీ వాదిస్తుండగా, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఆధ్వర్యంలోని ఓ బృందం చైనా గడ్డపై పరిశీలన జరిపి, ఆ వాదన తప్పని, వైరస్ పుట్టింది ల్యాబ్ లో కాదని తేల్చింది. అయితే, కొవిడ్ ముమ్మాటికీ ల్యాబ్ లో పుట్టిందేనని, తొలిగా మహమ్మారి కాటుకు అక్కడి సైంటిస్టులే బాధితులయ్యారంటూ అమెరికాకు చెందిన పలు సంస్థలు రిపోర్టులు రాయడంతో ఆ వ్యవహారంపై ఇంటెలిజెన్స్ దర్యాప్తునకు ఆదేశించారు ప్రెసిడెంట్ జో బైడెన్. కరోనా పుట్టుకకు కారకురాలైన చైనా ఆ బాధ్యత నుంచి తప్పించుకోడానికి తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నదని, తక్కువ ధరకు వ్యాక్సిన్లు పంపిణీ చేయడం ద్వానా తన నేరాన్ని దాచుకోవాలని చూస్తోందని జోబైడెన్ తాజాగా విమర్శించారు. ఇదిలా ఉంటే..

instagram bug: ప్రమాదాన్ని గుర్తించిన 21ఏళ్ల హ్యాకర్ మయూర్‌ -వెంటనే రూ. 22లక్షలిచ్చిన Facebookinstagram bug: ప్రమాదాన్ని గుర్తించిన 21ఏళ్ల హ్యాకర్ మయూర్‌ -వెంటనే రూ. 22లక్షలిచ్చిన Facebook

కరోనా పుట్టింది అమెరికాలోనే

కరోనా పుట్టింది అమెరికాలోనే


ఏడాదిన్నరగా అమెరికా చేస్తోన్న వాదనలకు కౌంటర్ గా చైనా ఎదురుదాడికి దిగింది. కరోనా వైరస్‌ పుట్టుకపై అమెరికాలోనూ దర్యాప్తు జరపాలని చైనా వైద్య నిపుణులు డిమాండ్‌ చేస్తున్నారు. 2019 డిసెంబరు ప్రారంభంలోనే అమెరికాలోని ఐదు రాష్ట్రాల్లో ఏడుగురికి సార్స్‌-కోవ్‌-2 సోకిందంటూ అక్కడ ఓ అధ్యయనానికి సంబంధించిన వివరాలు ప్రచురితమయ్యాయనే కీలక అంశాన్ని ప్రస్తావిస్తూ చైనీస్‌ డిసీజ్‌ కంట్రోల్‌ చీఫ్‌ ఎపిడెమాలజిస్ట్‌ జెన్‌ గువాంగ్‌ ఈ వాదనను తెరపైకి తెచ్చారు. కరోనా పుట్టుకపై చైనాలో చేసినట్లే ఇప్పుడు అమెరికాలో కూడా డబ్ల్యూహెచ్ఓ ఆద్వర్యంలో దర్యాప్తు చేయాలన్నారు. అమెరికాలో కరోనా వ్యాప్తి ప్రారంభంలో ఎందుకు తక్కువ టెస్టులు చేశారని ఆయన ప్రశ్నించారు. ప్రపంచం మొత్తంలోకి అమెరికాలోనే ఎక్కువ బయోలాజికల్‌ ల్యాబ్‌లు ఉన్నాయని, ఆ లెక్కన కొవిడ్ పుట్టుకకు అమెరికా కూడా కారణమయ్యే అవకావాలు లేకపోలేదని ఆయన తెలిపారు. దీనిపై..

డబ్ల్యూహెచ్ఓ మెడపై చైనా కత్తి

డబ్ల్యూహెచ్ఓ మెడపై చైనా కత్తి


కరోనా వైరస్ అమెరికాలోనే పుట్టి ఉండొచ్చన్న జెన్ గువాంగ్ వాదనపై చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి జావో లిజాన్‌ స్పందించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనా వైరస్‌కు సంబంధించిన మూలాలను అన్ని దేశాల్లో పరిశోధించాల్సిన అవసరం ఉందని ఆయన వక్కాణించారు. కరోనా వైరస్‌ మూలాల గురించి ఇప్పటికే అనేక వాదోపవాదాలు జరిగినా, అమెరికా, చైనాలు పరస్పరం దుమ్మెత్తిపోసుకున్నా ఇప్పటిదాకా వైరస్ మూలాలు బయటపడలేదు. అమెరికాలో కంటే ముందే, గత సెప్టెంబరులోనే యూరోప్‌లో కరోనా కేసులు వచ్చాయని ఒక పరిశోధనలో తేలింది. కానీ, దీన్ని నిపుణులు బలపరచలేదు. చైనా తాజా డిమండ్ తో కరోనా మూలాలను తేల్చే అంశమై డబ్ల్యూహెచ్ఓకు కొత్త తలనొప్పులు మొదలయ్యాయి.

English summary
A senior Chinese expert said the United States should be the priority in the next phase of investigations into the origin of COVID-19 after a study showed the disease could have been circulating there as early as December 2019, state media said on Thursday. The study, published this week by the U.S. National Institutes for Health (NIH), showed that at least seven people in five different U.S. states were infected with SARS-CoV-2, the virus that causes COVID-19, weeks before the first official cases were reported. Zeng Guang, chief epidemiologist with the Chinese Center for Disease Control and Prevention while speaking to state-owned Global Times said that it's time to shift the attention to the United States which was slow to test people when the outbreak first happened and it was the home for many biological laboratories.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X