కరోనా విలయం: ట్రావెల్ ‘రెడ్‌లిస్ట్’లో భారత్‌ను చేరిన యూకే -విమానాలను నిషేధించిన హాంకాంగ్

కరోనా వైరస్ రెండో దశ విలయం రోజురోజుకూ ఉధృతం అవుతున్నది. ఈ క్రమంలో ప్రపంచదేశాలన్నీ కఠిన ఆంక్షలకు దిగుతున్నాయి. భారత్‌లో కరోనా వైరస్ కేసులు పెద్ద ఎత్తున వెలుగుచూస్తున్న నేపథ్యంలో బ్రిటన్, హాంకాంగ్ లాంటి దేశాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి..

భారత్‌ను ట్రావెల్ 'రెడ్ లిస్ట్'లో చేర్చుతూ బ్రిటన్ ప్రభుత్వం సోమవారం ఆదేశాలిచ్చింది. ఇండియాలో తొలిసారి బయటపడిన కరోనా వేరియంట్‌కు సంబంధించిన 103 కేసులు బ్రిటన్‌లో గుర్తించడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. తాజా నిబంధనల ప్రకారం యూకే రావడానికి ముందు ఇండియాలో పది రోజులు ఉన్న యూకే, ఐరిష్, బ్రిటన్ జాతీయులు తప్పనిసరిగా పది రోజులపాటు హోటల్ క్వారంటైన్‌లో ఉండాలి.

covid surge: UK Adds India to Travel ‘Red List’, Hong Kong bans flights from India

భారత్ ప్రయాణాలపై రెడ్ లిస్ట్ జారీ ఆంక్షలు ఈ నెల 24 నుంచి అమల్లోకి వస్తాయని యూకే ప్రభుత్వం పేర్కొంది. ఇక భార‌త్‌లో కొవిడ్ పాజిటివ్ కేసులు గ‌ణ‌నీయంగా పెరుగుతున్న క్ర‌మంలో హాంకాంగ్ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఈ నెల 20వ తేదీ నుంచి మే 3 వ‌ర‌కు భార‌త్ మీదుగా హాంకాంగ్ వెళ్లే విమానాల‌న్నింటినీ ర‌ద్దు చేసింది.

ఇండియాతోపాటు పాకిస్తాన్, ఫిలిఫీన్స్ నుంచి బ‌య‌ల్దేరే విమానాల‌పై కూడా హాంకాంగ్ నిషేధం విధించింది. ఈ నెల‌లో రెండు విస్తారా విమానాల్లో ప్ర‌యాణించిన 50 మంది ప్ర‌యాణికుల‌కు క‌రోనా సోక‌డంతో ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు హాంకాంగ్ ప్ర‌భుత్వం వెల్ల‌డించింది. ముంబై - హాంకాంగ్ మార్గంలో వెళ్లే విస్తారా విమానాల‌ను మే 3 వ‌ర‌కు నిషేధించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+