Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఎయిర్‌పోర్టులపై సైబర్ దాడి: విమానాలు రద్దు, ఆకలితో అల్లాడిన ప్రయాణికులు

Cyberattack Hits Airports: సైబర్ దాడి కారణంగా శనివారం యూరప్‌లోని అనేక ప్రధాన ఎయిర్‌పోర్టులలో చెక్-ఇన్, బోర్డింగ్ సిస్టమ్‌లు నిలిచిపోయాయి. దీని వల్ల లండన్‌లోని హీత్రో, బ్రస్సెల్స్, బెర్లిన్ విమానాశ్రయాలలో అనేక విమానాలు ఆలస్యమయ్యాయి. మరికొన్ని విమానాలు రద్దు చేయబడ్డాయి. ఈ సైబర్ దాడి థర్డ్-పార్టీ సర్వీస్ ప్రొవైడర్‌పై జరిగింది.బ్రస్సెల్స్ ఎయిర్‌పోర్టు ప్రకారం.. ఆటోమేటిక్ చెక్-ఇన్, బోర్డింగ్ సిస్టమ్‌లు ఆగిపోవడంతో మాన్యువల్ ప్రాసెసింగ్ చేయాల్సి వచ్చింది. దీని కారణంగా 10 విమానాలు రద్దు కాగా, 17 విమానాలు ఆలస్యమయ్యాయి.

హీత్రోలో చెక్-ఇన్‌కు ఎక్కువ సమయం పట్టే అవకాశం
లండన్‌లోని హీత్రో విమానాశ్రయం థర్డ్-పార్టీ ప్రొవైడర్ అయిన కాలిన్స్ ఏరోస్పేస్ సిస్టమ్‌లో సాంకేతిక లోపం తలెత్తిందని తెలిపింది. తమ సాఫ్ట్‌వేర్‌లో సమస్య వచ్చిందని, దానిని పరిష్కరించే పనిలో ఉన్నామని కాలిన్స్ ఏరోస్పేస్ తెలిపింది. బెర్లిన్ విమానాశ్రయం కూడా తమ వెబ్‌సైట్‌లో ప్రయాణికులకు చెక్-ఇన్ చేయడానికి ఎక్కువ సమయం పట్టవచ్చని హెచ్చరిక జారీ చేసింది.

Cyberattack Cripples European Airports Flights Cancelled Passengers Stranded

ప్రయాణికుల ఇబ్బందులు
అనేక ఎయిర్‌పోర్టుల విమానాల ఆలస్యం, చెక్-ఇన్ చేయలేకపోవడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. హీత్రో విమానాశ్రయంలో జానీ లాల్ అనే ఒక భారతీయ ప్రయాణికుడు మాట్లాడుతూ.. తన అత్తగారి అంత్యక్రియల కోసం ముంబై వెళ్లాల్సి ఉందని, కానీ తన విమానం మిస్ అయిందని ఆవేదన వ్యక్తం చేశాడు. చాలా చోట్ల పెద్ద క్యూలు ఏర్పడ్డాయి. ప్రయాణికులు ఆకలితో నిలబడాల్సి వచ్చింది. లండన్ వెళ్లే ఎయిర్ ఇండియా విమాన ప్రయాణికులకు ముందుగానే వెబ్ చెక్-ఇన్ పూర్తి చేయమని సలహా ఇచ్చారు. ప్రయాణికుల అసౌకర్యాన్ని తగ్గించడానికి తమ అదనపు గ్రౌండ్ సిబ్బంది లండన్‌లో ఉన్నారని ఎయిర్‌లైన్ తెలిపింది.

ఢిల్లీ ఎయిర్‌పోర్టు నుంచి అడ్వైజరీ జారీ
ఢిల్లీ ఎయిర్‌పోర్టు ఒక అడ్వైజరీ జారీ చేస్తూ.. "లండన్ హీత్రోతో సహా యూరోపియన్ విమానాశ్రయాలపై సైబర్‌దాడి కారణంగా, ఢిల్లీ విమానాశ్రయం నుంచి యూరప్‌కు వెళ్లే మరియు వచ్చే విమానాలలో కొన్ని ఆటంకాలు ఏర్పడవచ్చు. ప్రయాణికులు తాజా విమాన సమాచారం కోసం తమ సంబంధిత ఎయిర్‌లైన్‌లను సంప్రదించమని సలహా ఇవ్వబడింది." అంటూ అడ్వైజరీని జారీ చేసింది.

ఎయిరిండియా సూచన
సైబర్‌దాడి నేపథ్యంలో ఎయిరిండియా కూడా శనివారం ఒక ప్రయాణ సలహాను జారీ చేసింది. చెక్-ఇన్ ప్రక్రియలో ఆలస్యంపై ప్రయాణికులను అప్రమత్తం చేసింది. ఎయిరిండియా ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ చేస్తూ, "హీత్రోలోని థర్డ్-పార్టీ ప్యాసెంజర్ సిస్టమ్‌లో సాంకేతిక లోపం కారణంగా చెక్-ఇన్ ప్రక్రియలో జాప్యం జరగవచ్చు. లండన్‌లోని మా బృందాలు అసౌకర్యాన్ని తగ్గించడానికి కృషి చేస్తున్నాయి. ఈ రోజు లండన్ నుంచి మా విమానాలలో ప్రయాణించే వారు విమానాశ్రయానికి చేరుకునే ముందు తమ వెబ్ చెక్-ఇన్‌ను పూర్తి చేయాలని సలహా ఇస్తున్నాం." అని పేర్కొంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+