పదేళ్లలో క్యాన్సర్, గుండె జబ్బుల ఖేల్ ఖతం.. అద్భుత ఆవిష్కరణ రాబోతుంది..!
ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) క్రమక్రమంగా విస్తరిస్తున్న సంగతి తెలిసిందే. ఏఐ అన్ని రంగాల్లోకి చొచ్చుకువస్తోంది. మానవుడు పరిష్కరించలేని అనేక క్లిష్టమైన సమస్యలకు క్షణాల్లోనే ఏఐ సమాధానం చెబుతోంది. అటు ఏఐ టూల్స్ వినియోగం కూడా ఇటీవలి కాలంలో విపరీతంగా పెరిగిన సంగతి తెలిసిందే. అయితే వైద్య రంగంలో ఏఐ ఇప్పుడు సంచలనాత్మక మార్పులకు నాంది పలుకుతోందని ఆంథ్రోపిక్ సీఈఓ డేరియో అమోడేయ్ తెలిపారు. రానున్న పదేళ్లలో క్యాన్సర్, గుండె జబ్బులు, మానసిక వ్యాధులు, అల్జీమర్స్ అంతరించిపోతాయని అంచనా వేశారు. ఈ వ్యాధులను పూర్తిగా నిర్మించేందుకు ఏఐ టెక్నాలజీ సాయపడుతుందని అన్నారు. ఏఐ కారణంగా ఔషధాల అభివృద్ధిలో, నూతన వైద్య ఆవిష్కరణల్లో వేగవంతమైన మార్పులు చోటు చేసుకుంటాయని స్పష్టం చేశారు.
ఏఐ టెక్నాలజీ సాయంతో కొత్త కొత్త ఔషధాలను కనుగొనడం సాధ్యమని.. కానీ వాటికి క్లినికల్ ట్రయల్స్ అలాగే టెస్టింగ్ కు మానవాళి అవసరం అని ఆంథ్రోపిక్ సీఈఓ డేరియో అమోడేయ్ అభిప్రాయపడ్డారు. ఇక అల్జీమర్స్, క్యాన్సర్, గుండె జబ్బుల కారణంగా లక్షలాది మంది ఇబ్బందులు పడుతున్నారని వీటిలో కొన్ని వ్యాధులు వైద్య శాస్త్రానికే పరీక్ష పెడుతూ కఠినతరంగా మారాయని ఆయన తెలిపారు. " మనం ఏఐ టెక్నాలజీని మెరుగైన పద్ధతిలో వినియోగించి అద్భుతాలు సృష్టించవచ్చు" అని అమోడేయ్ స్పష్టం చేశారు. అయితే అమోడేయ్ తో పాటు గతంలో స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్, గూగుల్ ఏఐ బాస్ డెమిస్ హస్సాబిస్ కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

గతంలో హస్సాబిస్ మాట్లాడుతూ.. ఏఐ టెక్నాలజీతో పదేళ్ల సమయం తీసుకునే వైద్య పరిశోధనలను కేవలం వారం రోజుల్లోనే పరిష్కరించవచ్చని అన్నారు. ఈ మేరకు ప్రోటీన్ల నిర్మాణాలకు అంచనా వేసిన ఆల్ఫా ఫోల్డ్ టెక్నాలజీని ఆయన బెస్ట్ ఉదాహరణగా తెలిపారు. ఈ మేరకు బయోలాజికల్ రీసెర్చ్ లో ఏఐ గణనీయంగా అభివృద్ధి చెందుతోందని అభిప్రాయపడ్డారు. అలాగే ఏఐ టెక్నాలజీపై ఎలాన్ మాస్క్ మాట్లాడుతూ.. ఏఐ సాయంతో అమెరికా అధ్యక్షుడికి ఏ విధమైన మెడికల్ కేర్ అందుతుందో సాధారణ మానవాళి సైతం వాటిని పొందవచ్చని తెలిపారు.
ఇక మరోవైపు కొందమంది నిపుణులు.. ప్రస్తుతం ఉన్న ఏఐ సాంకేతిక బయోలాజికల్ రీసెర్చ్ విషయంలో అంత మెరుగ్గా లేదని చెబుతున్నారు. 2026 నాటికి ఏఐ గుర్తించిన ఏ ఔషధం కూడా పూర్తిగా క్లినికల్ పరీక్షల్లో నెగ్గలేకపోయిందని వివరించారు. ఓ ఔషధం పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందాలంటే క్లినికల్ ట్రయల్స్, ల్యాబ్ టెస్టులు అవసరం అని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications
