4 కార్పోరేషన్లు, పెండింగ్ మున్సిపాల్టీల పోలింగ్ తేదీలు ఖరారు..!?
ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికలు జరగాల్సిన 4 కార్పోరేషన్లు, 23 మున్సిపాల్టీల ఎన్నికల ప్రక్రియ ఖరారైంది. ఇప్పటికే ఏపీలో మున్సిపల్..జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు పూర్తి కాగా.. పంచాయితీ ఎన్నికలకు షెడ్యూల్ ఖరారైంది. అయితే, కోర్టు వ్యవహారాల కారణంగా ఎన్నికలు జరగని మూడు కార్పోరేషన్లు.. 23 మున్సిపాల్టీల్లో ఎన్నికల నిర్వహణ కు ఎన్నికల సంఘం సమాయత్తం అవుతోంది.
ఎన్నికలు జరగాల్సిన నాలుగు కార్పోరేషన్లు, 19 మున్సిపాల్టీల్లో ఎన్నికల నిర్వహణకు ఎస్ఈసీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. శ్రీకాకుళం, మంగళగిరి- తాడేపల్లి, కాకినాడ, రాజమండ్రి కార్పోరేష న్లతో పాటుగా 23 మున్సిపాల్టీల్లో ఎన్నికలకు షెడ్యూల్ ఖరారు చేసింది. ఆముదాల వలస, రాజాం, తణుకు, తాడేపల్లి గూడెం, భీమవరం, చింతల పూడి, తాడిగడప, పొన్నూరు, నరసరావు పేట సహా మొత్తం 23 మున్సిపాల్టీలో ఈ నెల 26న తొలి విడత పంచాయితీ ఎన్నికలతో పాటుగా వీటికీ పోలింగ్ జరగనుంది. ఈ మేరకు అధికారికంగా ఈ నెల 13న నోటిఫికేషన్ విడుదల చేసేందుకు తుది ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్పోరేషన్లలో విలీన గ్రామాల విలీనం పై పలువురు న్యాయస్థానాలను ఆశ్రయించడంతో ఎన్నికలు నిలిచిపోయాయి.

26న పోలింగ్.. 28న ఫలితాలకు అవకాశం
కాగా.. 12 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న శ్రీకాళహస్తి, నెల్లూరు-తిరుపతి పరిధిలోని గూడూరు, అల్లూరు, ప్రకాశం పరిధిలోని కందుకూరు, పొదిలి, అన్నమయ్య జిల్లాలోని బి.కొత్తకోట వంటి మున్సిపాలిటీలు ఈ పెండింగ్ జాబితాలో ఉన్నాయి. వార్డుల సరిహద్దులు, విలీన పంచాయతీల అభ్యంతరాలే ఈ పట్టణాల్లో ఎన్నికల జాప్యానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి. ఇప్పటికే మూడు కార్పోరేషన్ల రిజర్వేషన్లను ఖరారు చేసారు. దీంతో.. న్యాయ పరమైన చిక్కులు లేకుండా ఎన్నికల నిర్వహణ దిశా ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. దీంతో, 26న పోలింగ్ నిర్వహిస్తే.. 28న ఫలితాలు వెల్లడించే అవకాశం ఉంది.













Click it and Unblock the Notifications
