• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఎట్టకేలకు కుదిరిన డీల్... యూరోపియన్ యూనియన్‌తో బ్రిటన్ ట్రేడ్ ఒప్పందం...

|

బ్రెగ్జిట్ డీల్‌పై నెలకొన్న అనిశ్చితికి ఎట్టకేలకు తెరపడింది. గురువారం(డిసెంబర్ 24) యూరోపియన్ యూనియన్‌(ఈయూ)తో బ్రిటన్ బ్రెగ్జిట్ ట్రేడ్ డీల్ కుదుర్చుకుంది. యూరోపియన్ యూనియన్‌తో దీర్ఘకాలిక వాణిజ్య ఒప్పందానికి చివరి గడువు మరో వారం రోజులు మాత్రమే ఉన్న తరుణంలో తాజా డీల్ కుదరడం గమనార్హం. తాజా పరిణామంపై 'డీల్ ఈజ్ డౌన్' శీర్షికన డౌనింగ్ స్ట్రీట్ కథనాన్ని ప్రచురించింది.

'ఇక మా డబ్బు,సరిహద్దులు,చట్టాలు,వాణిజ్యం,మత్స్య వేటను తిరిగి మా నియంత్రణలోకి తెచ్చుకున్నాం.' అని బ్రిటన్ పేర్కొంది. యూకెలోని కుటుంబాలకు,వ్యాపారాలకు ఇది మంచి వార్త అని పేర్కొంది. జీరో టారిఫ్స్,జీరో కోటా ప్రాతిపదికన స్వేచ్చా వాణిజ్య ఒప్పందంపై సంతకం చేసినట్లు తెలిపింది.అత్యంత సంక్లిష్ట పరిస్థితుల్లో, రికార్డు సమయంలో ఈ డీల్‌ను కుదుర్చుకోగలిగామని పేర్కొంది. బ్రిటన్‌ అంతర్గత మార్కెట్ సమగ్రతను ఇది పరిరక్షిస్తుందని ధీమా వ్యక్తం చేసింది. తాజా డీల్‌తో ఇకపై ఈయూ నిబంధనలకు బ్రిటన్ తలొగ్గాల్సిన అవసరం ఉండదు.

 deal is done Britain Clinches Trade Deal with European Union

యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వొన్ డెర్ మాట్లాడుతూ... ఈ డీల్ సరైనదని,సమతుల్యమైనదని పేర్కొన్నారు.పారదర్శకమైన,సరసమైన పోటీ,భవిష్యత్తులో వివాదాల పరిష్కరించే విధానాలు,మత్స్య వేటపై హక్కులు తదితర అంశాలు తాజా డీల్‌లో కీలకంగా మారాయి.

కాగా, ఈ ఏడాది జనవరి 31న బ్రిటన్ యూరోపియన్ యూనియన్ నుంచి బయటకు వచ్చింది.గత 47 ఏళ్లుగా ఈయూలో కొనసాగుతూ వచ్చిన బ్రిటన్ ఇలా బయటకు రావడంపై అక్కడి ప్రజల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. అయితే బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ మాత్రం... ప్రస్తుత ఈయూ విధానాలు తమకు తగినవిధంగా లేవని... అందుకే బయటకు రావాల్సి వచ్చిందని తెలిపారు. ఈయూ నుంచి బ్రిటన్ నిష్క్రమణ ముగింపు కాదని, సరికొత్త ఆరంభమని అన్నారు.

జనవరిలోనే బ్రెగ్జిట్ నుంచి బ్రిటన్ నిష్క్రమించినప్పటికీ ఈయూ చట్టాల్లో చాలావాటికి డిసెంబర్ 31 వరకు గడువు ఉంది. కాబట్టి అప్పటివరకూ యూకె వాటిని తప్పనిసరిగా పాటించాల్సిందే. ఇందులో ప్రజల స్వేచ్చాయుత రాకపోకలకు సంబంధించిన చట్టం కూడా ఉంది. డిసెంబర్ 31 తర్వాత ఈ చట్టాల గడువు తీరుతుండటంతో వ్యాపార వ్యవహారాల కోసం ఈయూతో యూకె తాజా డీల్ కుదుర్చుకుంది.

English summary
Britain clinched a narrow Brexit trade deal with the European Union on Thursday, just seven days before it exits one of the world's biggest trading blocs in its most significant global shift since the loss of empire.The deal means it has swerved away from a chaotic finale to a tortuous divorce that has shaken the 70-year project to forge European unity from the ruins of World War Two.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X