మరోసారి రెచ్చగొట్టిన పాక్..? ఈసారి అమెరికా కూడా కాపాడలేదు..!
దేశ రాజధాని దిల్లీలోని ఎర్రకోట వద్ద పేలుడు ఘటన తర్వాత పాకిస్థాన్- భారత్ మధ్య మరోసారి నిప్పు రాజుకుంది. ఇప్పటికే పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ తో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే తాజాగా దిల్లీ పేలుడు ఘటన నేపథ్యంలో ఆపరేషన్ సింధూర్-2.O అంటూ నెట్టింట కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఈ మేరకు భారత ప్రభుత్వం తీవ్ర చర్యలకు సిద్ధం అవుతున్నట్లు స్పష్టం అవుతోంది. తాజాగా జరిగిన కేంద్ర కేబినెట్ మీటింగ్ లో దిల్లీ పేలుడును కిరాతక ఉగ్ర ఘాతుకంగా అభివర్ణించింది. ఇది ఉగ్రవాదుల కుట్రేనని తేల్చింది. ఈ ఘటనకు కారకులైన వారిని చట్టం ముందు నిలబెడతామని పేర్కొంది. దిల్లీ పేలుడు ఘటన విచారణను వేగవంతంగా చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది.
పేలుడు ఘటన జరిగిన సమయంలో భూటాన్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ.. అక్కడి నుంచి ఉగ్రమూకలకు వార్నింగ్ ఇచ్చారు. ఈ దాడికి పాల్పడిన వారిని శిక్షించి తీరుతామని స్పష్టం చేశారు. ఇప్పటికే రెండు సార్లు లైన్ దాటిన పాకిస్థాన్ పై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందా అన్న ఉత్కంఠ నెలకొంది.
అయితే తాజాగా పాకిస్థాన్ రక్షణమంత్రి ఖవాజా ఆసిఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్, అఫ్గానిస్తాన్ తో తాము ప్రత్యక్ష యుద్ధానికి సిద్ధంగా ఉన్నట్లు మరోసారి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఇస్లామాబాద్ లో ఇటీవల జరిగిన సూసైడ్ బాంబ్ బ్లాస్ట్ లో 12 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఆ దాడి చేసింది తామేనని పాకిస్థానీ తాలిబాన్ ప్రకటించుకున్న తర్వాత పాక్ డిఫెన్స్ మంత్రి ఖవాజా ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకున్నాయి. భారత్ మద్దతుతోనే ఈ దాడి జరిగిందని ఇటీవల పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆరోపించిన విషయం తెలిసిందే.

ఇక ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్థాన్- భారత్ మధ్య కాల్పుల విరమణకు ఒప్పందం కుదిర్చినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పుకొచ్చారు. అయితే ఈ సారి మాత్రం పాక్ ను అమెరికా కూడా కాపాడలేదని నెట్టింట కామెంట్స్ వినిపిస్తున్నాయి. అమెరికానే ఇప్పుడు పలు సమస్యలతో ఉందని.. షట్ డౌన్, సుప్రీంకోర్టులో టారిఫ్ కేసులు.. వ్యాపార ఒప్పందాలు తగ్గిపోవడం.. తదితర కారణాల వల్ల పాకిస్థాన్ గురించి ఆలోచించే స్థితిలో అమెరికా లేదని కామెంట్స్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications