వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికాలో ఆవు పిడకల గిరాకీ .. ప్యాకెట్ పై పెద్ద ఉపోద్ఘాతమే ఎందుకంటే ...

|
Google Oneindia TeluguNews

ఆవు పాలు, పాల పదార్థాల కంటే దాని పేడ, పిడకలకు మంచి గిరాకీ ఉంది. ఆన్లైన్ మార్కెట్లో కూడా ఆవు పిడకలు లభిస్తున్నాయి అంటే వాటి డిమాండ్ ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. నిన్న మొన్నటి దాకా అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి సైట్లలో అమ్మకానికి పెట్టిన ఆవు పిడకలపై చర్చ జరగగా ఇప్పుడు ఢిల్లీ నుండి గల్లీ దాకా మాత్రమే కాదు ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా ఆవు పిడకలు ఇట్టే లభిస్తున్నాయి. దీంతో ఆవు పిడకల వ్యాపారం కాసుల వర్షం కురిపిస్తోంది.

ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే అమెరికాలో ఆవు పిడకల వ్యాపారం మూడు ఆవులు వంద పిడకలు అన్నట్టుగా సాగుతుందట. అక్కడ సైతం ఆవు పిడకలను వినియోగించే భారతీయ సంతతి బాగానే పెరిగారట. ఇక న్యూజెర్సీలోని ఒక షాపులో ఆవు పిడకలను అమ్ముతున్న దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పది పిడకలు ఉన్న ఒక ప్యాకెట్ ధర ఇండియన్ కరెన్సీలో 214 రూపాయలు. ఇక అమెరికాలో భారత సంతతికి దొరకని ఏదీ లేదు అంటూ ఒక వ్యక్తి సోషల్ మీడియాలో ఈ విషయాన్ని షేర్ చేయడం తో ప్రస్తుతం పిడకల ప్యాకెట్ వైరల్ గా మారింది.

Demand for cow dung cakes in America .. interesting matter on packet

ఇక ప్యాకెట్ మీద ఇది తినే పదార్థం కాదు, మత పరమైన విషయాలను మాత్రమే ఉపయోగించాలి, ఇది ఓ భారతీయ ఉత్పత్తి అని రాసి ఉందట. మరి అలా రాయకుంటే ఇబ్బంది ఎదురవుతుందని ముందే గుర్తించి అలా రాశారు. అది తినే పదార్థం అనుకొని అమెరికన్స్ కొనుగోలు చేసే ప్రమాదముందని కాబోలు పిడకల ప్యాకెట్ మీద కూడా ఇంత ఉపోద్ఘాతం రాయాల్సి వచ్చింది. ఏదేమైనప్పటికీ అమెరికన్ మార్కెట్లో కూడా ఆవు పిడకలు హల్చల్ చేస్తున్నాయి అంటే వాటి డిమాండ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

English summary
The Cow dung cakes Trade in America is going viral . The scene of a cow selling a cow dung cakes in New Jersey has gone viral on social media. The price of a packet containing ten cow dung cakes are Rs 214 in Indian currency.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X