12 లక్షల వజ్రం: కనిపెట్టిన పెంపుడు కుక్క, డ్రైవర్‌కు పొదల్లో దొరికింది
లండన్: పెంపుడు కుక్కతో వ్యాహ్యాళికి వెళ్లిన బ్రిటన్‌కు చెందిన ఒక పెద్దాయనకు దాదాపు రూ.12 లక్షల విలువ చేసే వజ్రం దొరికింది. లింకన్‌షైర్‌లో బ్రాటిల్బీకి చెందిన అలెన్ బెల్ ఎప్పట్లాగానే తన రెండు పెంపుడు కుక్కలతో కలిసి వాకింగ్‌కు వెళ్లాడు. ఆయన ఓ పొద వద్ద పెంపుడు కుక్క ఆగిపోవడం గమనించాడు. తీరా చూస్తే వజ్రం కనిపించింది.
వజ్రం దొరికిన వ్యక్తి పేరు అల్లాస్ బెల్. అతని వయస్సు 75. లారీ డ్రైవర్‌గా పని చేసి ఇప్పుడు వయోభారంతో విశ్రాంతి తీసుకుంటున్నాడు. అతనిని ఇప్పుడు అదృష్టం వరించింది. ఈ సంఘటన డిసెంబర్ 23వ తేదీన జరిగింది. ఏదో వాసన పసిగట్టిన కుక్క నారింజ రంగు పారాచ్యూట్‌తో ఉన్న సంచీని లాక్కుంటూ అతని వద్దకు రాగా, అతను విప్పి చూసేసరికి అందులో వజ్రం ఉంది.

77డైమండ్స్ ఆన్‌లైన్ వ్యాపార సంస్థ ఆ వజ్రాన్ని హీలియం బెలూన్ ద్వారా ఆకాశంలోకి పంపింది. అది భూమికి తిరిగొచ్చి ఎవరికి దక్కితే వారికేనని ప్రకటించింది. ఓ వజ్రాన్ని పారాచ్యూట్‌కు కట్టి పంపించారు. చీకటిపడే వేళకు బాగా పైకి వెళ్లగానే అక్కడ మెరుపులు విరజిమ్ముతూ ఆ పారాచూట్ విచ్చుకొని, వజ్రం కిందకు వచ్చే ఏర్పాటు చేశారు.
అయితే, ఆ ఖరు క్షణంలో జీపీఎస్ సంకేతాలు పని చేయక.. పారాచూట్ కాస్తా అదృశ్యమైంది. ఆ వార్తలను అల్లాస్ టీవీలో కూడా చూశాడు. దాదాపు నాలుగు నెలల తర్వాత ఇప్పుడు ఆ పారాచూడ్ అతనికి దొరికింది. అతని పెంపుడు కుక్క పేరు రోజీ. అతను ఆ వజ్ర సంస్థ యజమానులకు ఫోన్ చేసి విషయాన్ని చెప్పాడు.












Click it and Unblock the Notifications