వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాస్ట్రో-మారడోనా : విప్లవ యోధుడితో ఫుట్‌బాల్ యోధుడు.. ప్రపంచ చరిత్రలోనే ప్రత్యేకత కలిగిన స్నేహం..

|
Google Oneindia TeluguNews

ఒకరు మార్క్సిస్ట్-లెనినిస్ట్ రివల్యూషనరీ పొలిటీషియన్... మరొకరు ప్రపంచ ఫుట్‌బాల్ రారాజు... ఇప్పటి ప్రపంచంలో ఇంత విభిన్న నేపథ్యం కలిగిన ఇద్దరు వ్యక్తుల మధ్య స్నేహాన్ని ఊహించడం కష్టమే. కానీ చరిత్రలో ఆ స్నేహానికి కొన్ని పేజీలు నిక్షిప్తమయ్యాయి. ఆ రివల్యూషనరీ లెజెండ్ ఫిడల్ కాస్ట్రో కాగా... ఆ ఫుట్‌బాల్ రారాజు డీగో మారడోనా... ఒక విప్లవ యోధుడికి,ఒక దిగ్గజ క్రీడాకారుడికి మధ్య చిగురించిన ఈ స్నేహం ప్రపంచ చరిత్రలో ప్రత్యేకంగా నిలిచిపోతుంది. అసలు ఈ ఇద్దరి మధ్య స్నేహానికి ఎక్కడ బీజం పడింది... కాస్ట్రో పట్ల మారడోనా ఎలాంటి అభిప్రాయంతో ఉండేవాడు...

2000లో చిగురించిన స్నేహం...

2000లో చిగురించిన స్నేహం...

1986లో అర్జెంటీనా ఫుట్‌బాల్ టీమ్‌కు సారథ్యం వహించిన మరుసటి ఏడాది 1987లో డీగో మారడోనా తొలిసారిగా ఫిడెల్ కాస్ట్రోని కలిశారు. అయితే ఇద్దరి మధ్య స్నేహం చిగురించింది మాత్రం 2000 సంవత్సరంలో. డ్రగ్స్‌కు బానిసై... ఆ మత్తును వదిలించుకునేందుకు క్యూబాలో మారడోనా వైద్య చికిత్స పొందిన సమయంలో ఇద్దరి స్నేహం మొదలైంది. దాదాపు మృత్యువుకు దగ్గరైన సమయంలో క్యూబాలో గడిపిన ఆ నాలుగేళ్ల కాలంలో ఫిడెల్ కాస్ట్రో తనకెంత సాయపడ్డారో మారడోనా పలు సందర్భాల్లో స్వయంగా వెల్లడించాడు.

కాస్ట్రోని ఇంటర్వ్యూ చేసిన మారడోనా

కాస్ట్రోని ఇంటర్వ్యూ చేసిన మారడోనా

'మారడోనా మా చేతుల్లో చనిపోవడం మాకిష్టం లేదని అర్జెంటీనా క్లినిక్స్ అన్నీ తలుపులు మూసిన తరుణంలో క్యూబా మాత్రమే నాకు తలుపులు తెరిచింది.' అని మారడోనా చాలా సందర్భాల్లో గుర్తుచేసుకున్నాడు. క్యూబాలో ఉన్న కాలంలో ఫిడెల్ కాస్ట్రో తనను మార్నింగ్ వాక్స్‌కి పిలిచేవాడని... రాజకీయాలు,క్రీడల గురించి మాట్లాడేవారని చెప్పాడు. 2005లో మారడోనా ఫిడెల్ కాస్ట్రోని ఓ టెలివిజన్ షోలో ఇంటర్వ్యూ కూడా చేశాడు. అందులో ఈ ఇద్దరు లెజెండ్స్ అమెరికా పట్ల తమ వ్యతిరేకతను బయటపెట్టారు.

తండ్రి సమానుడిగా...

తండ్రి సమానుడిగా...

ఫిడెల్ కాస్ట్రోని మారడోనా అమితంగా ఆరాధించేవాడు. ఆయన్ను తన రెండో తండ్రిగా భావించేవాడు. ఆయనపై తనకున్న ప్రేమను చాటుకునేందుకు ఎడమ కాలిపై కాస్ట్రో టాటూ కూడా వేయించుకున్నాడు. కుడి కాలిపై మరో విప్లవ యోధుడు చెగువేరా టాటూ ఉండేది. నవంబర్ 25,2016లో ఫిడెల్ కాస్ట్రో చనిపోయినప్పుడు మారడోనా తీవ్రమైన దు:ఖంలో మునిగిపోయాడు. తన తండ్రి మరణం తర్వాత కాస్ట్రో చనిపోయినప్పుడే తాను అంతలా ఏడ్చానని చాలా సందర్భాల్లో చెప్పాడు.

స్పష్టమైన రాజకీయ అభిప్రాయంతో...

స్పష్టమైన రాజకీయ అభిప్రాయంతో...

మారడోనా క్రీడలను ఎంతగా ప్రేమించేవాడో... రాజకీయాలూ అంతే ముఖ్యమని భావించేవాడు. అందుకే సమకాలీన రాజకీయాలపై తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టేవాడు. లాటిన్ అమెరికా వామపక్ష నేతలకు మద్దతునివ్వడంలో ఎప్పుడూ ముందుండేవాడు. 1986లో ఇంగ్లాండ్ జట్టుపై 2-1 తేడాతో అర్జెంటీనా మ్యాచ్ గెలిచినప్పుడు మారడోనా చేసిన వ్యాఖ్యలు ఆయన రాజకీయ దృక్పథాన్ని స్పష్టం చేశాయి. తమవరకు అది కేవలం మ్యాచ్‌ విన్నింగ్ కాదని... 1982లో బ్రిటన్ చేతిలో ఓడిపోయినందుకు అర్జెంటీనా తీర్చుకున్న ప్రతీకారమని వ్యాఖ్యానించాడు. వెనిజులా మాజీ అధ్యక్షుడు హ్యూగో చావెజ్‌తోనూ మారడోనాకు మంచి సంబంధాలున్నాయి. ఆయనతో కలిసి ఓ టెలివిజన్ షోలోనూ పాల్గొన్నాడు.

విషాదంలో క్రీడా లోకం...

విషాదంలో క్రీడా లోకం...

ఇంత విలక్షమైన నేపథ్యం కలిగిన మారడోనా బుధవారం(నవంబర్ 25) కన్నుమూశారు. అర్జెంటీనాలోని బ్యూనస్‌ ఎయిర్స్‌లో గల తన నివాసంలో గుండెపోటుతో మృతి చెందారు. 1960 అక్టోబర్‌ 30న అర్జెంటీనాలో డిగో జన్మించారు. ప్రస్తుతం అర్జెంటీనా ఫుట్‌బాల్‌ జట్టుకు మేనేజర్‌గా ఉన్నారు. 1990 వరల్డ్‌కప్‌లో అర్జెంటీనా జట్టును ఫైనల్‌ వరకు తీసుకెళ్లాడు. అర్జెంటీనా తరఫున 96 మ్యాచ్‌లకు ప్రాతినిధ్యం వహించిన డిగో 34 గోల్స్‌ చేశాడు. కెరీర్ సెకండ్ ఇన్నింగ్స్‌లో కొకైన్‌కు బానిసై జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. 1991లో డోపింగ్‌ పరీక్షలో పట్టుబడి 15 నెలలు నిషేధానికి గురయ్యాడు. నాలుగుసార్లు ఫుట్‌బాల్‌ వరల్డ్‌కప్‌కు ప్రాతినిధ్యం వహించిన మారడోనా 1997లో ప్రొఫెషనల్‌ ఫుట్‌బాల్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. మారడోనా మరణం ప్రపంచ క్రీడా లోకాన్ని విషాదంలో ముంచెత్తింది.

English summary
Fidel Castro was a Cuban lawyer cum revolutionary, becoming the leader of Cuba from the revolution in 1959 until his retirement in 2008 and death in 2016. Diego Maradona was an Argentine football player still known as one of the greatest soccer players ever to play the game.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X