భారత్‌ను బెదిరించి లొంగదీయలేం, ఆ యుద్ధంతో మనకే నష్టం: చైనా నిపుణుల హెచ్చరిక
భారత్ - చైనా సరిహద్దుల్లో వివాదం నేపథ్యంలో రెండు దేశాల మధ్య యుద్ధం వస్తే చైనాకే ఎక్కువ నష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
బీజింగ్: భారత్ - చైనా సరిహద్దుల్లో వివాదం నేపథ్యంలో రెండు దేశాల మధ్య యుద్ధం వస్తే చైనాకే ఎక్కువ నష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ప్రపంచ జనాభాలో 35 శాతం (260 కోట్లు) నివసించే ఈ రెండు పెద్ద దేశాలు సరిహద్దు గొడవతో అసలు పోరుకు దిగుతాయా అన్నదే అందర్నీ తొలుస్తున్న ప్రశ్న.

మనకు ఇబ్బందులు తప్పవు
భారత్‌తో తగువు ముదిరితే చైనా రోడ్డు - బెల్ట్ ప్రాజెక్టు, ముడి చమురు సరఫరా మార్గంలో ఇబ్బందులు పడతామని మకావ్‌కు చెందిన చైనా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రెండు పెద్ద దేశాల మధ్య పోరు జరిగితే రోడ్ - బెల్ట్ ప్రాజెక్టుకు ఎనలేని నష్టం వాటిల్లుతుందని చైనా సైనిక రంగ నిపుణుడు చైనాను హెచ్చరించారు.
Recommended Video


ఇతర ఆసియా దేశాల్లా భారత్‌ను లొంగదీయలేం
డొక్లాం పేరుతో చైనా యుద్ధ వాతారవరణం సృష్టించి, భారత్‌ను నొప్పిస్తే దానిని శత్రు శిబిరంలోకి నెట్టినట్లవుతుందని నిపుణులు చైనాను హెచ్చరిస్తున్నారు. ఏకకాలంలో బుజ్జగించి, బెదిరించే వ్యూహాలతో చైనా ఇతర ఆగ్నేయాసియా దేశాలను లొంగదీసినట్లు ఇండియాను తన దారిలోకి తెచ్చుకోవడం కుదిరే పని కాదని అభిప్రాయపడుతున్నారు.

ఇలా చేస్తే భారత్ అసలే చేరదు
రోడ్ - బెల్ట్ ప్రాజెక్టులో భాగస్వామి కావడానికి మొదటి నుంచి వెనుకాడుతున్న భారత్ ప్రస్తుత ఉద్రిక్తత వల్ల అసలు చేరకపోయే ప్రమాదముందని చైనా నిపుణులు చైనా సర్కారును హెచ్చరిస్తున్నారు. భారత్‌తో భూతల యుద్ధం జరిగితే మనం సులభంగా ఇండియాను ఓడించగలమేమో.. కానీ సముద్రతలంలో తలపడినప్పుడు భారత్‌ను ఓడించలేమని నిపుణులు చైనాను హెచ్చరిస్తున్నారు.

చైనాకే అననుకూల పరిస్థితులు
ఈశాన్య సరిహద్దులో భారత్ - చైనా సేవలు కేవలం 150 మీటర్ల ఎడంలో నిలబడి ఉన్నాయి. యుద్ధమే మొదలైతే పోరు ఒక సిక్కిం సెక్టారుకే పరిమితం కాదని, అరుణాచల్ ప్రదేశ్ నుంచి జమ్ము కాశ్మీర్ వరకు విస్తరిస్తుందని అంచనా వేస్తున్నారు. 1962లో మాదిరిగా సరిహద్దు మొత్తం సమరాంగణమైతే చైనాకే అననుకూల పరిస్థితులు ఎక్కువ అంటున్నారు.

అలా రంగంలోకి దిగితే చైనాకు కష్టమే
చైనాకు 80 శాతానికి పైగా ముడి చమురు సరఫరా జరిగే మాలాకా జలసంధి (మలేసియా, ఇండోనిసియా మధ్య) అండమాన్ - నికోబర్ దీవులకు సమీపంలో ఉంటుంది. ఆ ప్రాంతం గుండా జరిగే ముడి చమురు రవాణాపై యుద్ధ ప్రభావం పడుతుంది. దీవుల్లో భారత్‌కు భారీ నౌకాదళ కేంద్రం ఉంది. నౌకాదళం రంగంలోకి దిగితే చైనా ఓడలు అండమాన్ పక్క నుంచి పోవడం కష్టమే అంటున్నారు. 1999 కార్గిల్ యుద్ధ సమయంలోను ఈ కారణం వల్లే పాకిస్తాన్‌కు సాయం చేయలేదు.

భారత నౌకాదళ పరిధిలోకి వస్తాయి..
యుద్ధం అనివార్యమైతే, సరిహద్దు యావత్తు సమర రంగమైతే భారత సేనలకు చైనా - పాకిస్తాన్ కారిడార్ లక్ష్యంగా మారుతుందని అంటున్నారు. అప్పుడు చైనా భారీగా నష్టపోతుందని చెబుతున్నారు. ఇటీవలే శ్రీలంకలోని హంబంతోట రేవు, పాకిస్తాన్‌లోని గ్వాదర్ పోర్టులో కొన్ని సౌకర్యాలు పొందేందుకు చైనా ఒప్పందం చేసుకుంది. యుద్ధం ఆరంభమైతే ఈ ప్రాంతాలు భారత నౌకాదళ దాడుల పరిధిలోకి వస్తాయి.












Click it and Unblock the Notifications