మా ఓపిక నశిస్తోంది: భారత్‌కు చైనా, నౌకాదళాన్ని శక్తిమంతం చేస్తున్న ఇండియా
భారత్ - చైనా సరిహద్దులోని డొక్లామ్ వద్ద ఉద్రిక్తతపై చైనా మరోసారి స్పందించింది. తాను ఈ అంశంపై నిగ్రహంతో ఉంటున్నామని, కానీ తమ ఓపిక చివరి దశకు వచ్చిందని భారత్‌ను హెచ్చరించింది.
బీజింగ్: భారత్ - చైనా సరిహద్దులోని డొక్లామ్ వద్ద ఉద్రిక్తతపై చైనా మరోసారి స్పందించింది. తాను ఈ అంశంపై నిగ్రహంతో ఉంటున్నామని, కానీ తమ ఓపిక చివరి దశకు వచ్చిందని భారత్‌ను హెచ్చరించింది.
కేంద్రమంత్రి సుష్మా స్వారాజ్ రాజ్యసభలో ఈ అంశంపై గురువారం మాట్లాడారు. దీంతో చైనా దీనిపై స్పందించింది. డొక్లామ్ ఘటన ప్రారంభం నుంచి చైనా సానుకూలంగా ముందుకు వెళ్తోందని చైనా డిఫెన్స్ మినిస్ట్రీ తెలిపింది.

నిగ్రహంతో ఉన్నాం
చర్చల ద్వారా పరిష్కారం కోసం తాము చూస్తున్నామని చెప్పారు. తమ సైన్యం కూడా నిగ్రహంతో ఉందని చెప్పారు. తమ దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకుంటామని తెలిపారు.
Recommended Video


రంగంలోకి ఐఎన్ఎస్ కల్వారి సబ్ మెరైన్
ఇదిలా ఉండగా, చర్చలకు ఒప్పుకోకుండా రోజుకో విధంగా హెచ్చరికలు చేస్తున్న చైనా ఆగడాలను దృష్టిలో ఉంచుకుని నావికా దళాన్ని బలపరిచే పనిలో భారత్ నిమగ్నమైంది. ఇందులో భాగంగా శత్రువులకు దొరక్కుండా భీకర దాడి చేయగల ఐఎన్ఎస్ కల్వారి సబ్‌మెరైన్‌ను రంగంలోకి దించారు.

భారత్ వద్ద 15 సబ్ మెరైన్లు
2005లో చేసుకున్న 3.7 బిలియన్ డాలర్ల ఒప్పందంలో భాగంగా మాజ్‌గావ్ డాక్‌తో కలిసి ఫ్రెంచ్ నేవీ సంస్థ నిర్మిస్తున్న ఆరు సబ్ మెరైన్లలో ఐఎన్ఎస్ కల్వారి మొదటిది. భారత రక్షణలో భాగంగా హిందూ మహాసముద్రంలో భారత సబ్ మెరైన్ల సంఖ్యను పెంచాల్సి ఉంది. ప్రస్తుతం భారత్ దగ్గర కేవలం 15 సబ్ మెరైన్లు మాత్రమే ఉన్నాయి.

చైనా కూడా సబ్ మరైన్లను దించింది కానీ
చైనా నావికా దళంలో దాదాపు 60 సబ్ మెరైన్లు ఉన్నట్లు అమెరికా రక్షణ సంస్థ పెంటగాన్ రిపోర్ట్‌లో తేలింది. అంతేకాకుండా చైనా కూడా హిందూ మహాసముద్రంలో తమ సబ్‌మెరైన్లను దింపిందని, అవి రాడార్‌కు కూడా చిక్కడం లేదని సమాచారం. అలాగే పాకిస్థాన్ కూడా ఈ మధ్య న్యూక్లియర్ సబ్ మెరైన్ల కొనుగోలుపై దృష్టి సారించిన నేపథ్యంలో జలాంతర మార్గాల్లో భారత్‌కు యుద్ధ ప్రమాదాలు అధికంగా ఉండే అవకాశముంది.

నావికాదళాన్ని శక్తిమంతం చేయాలని
దీర్ఘకాలిక ప్రణాళిక లేకపోవడం, యుద్ధం గురించిన నిర్లక్ష్యాల కారణంగా నావికా దళాన్ని శక్తిమంతం చేసుకోవడంలో భారత్ విఫలమైందని రక్షణ పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా వీలైనంత త్వరగా భారత నావికా దళాన్ని బలపరిచే ప్రయత్నాలు చేయాలని వారు సూచిస్తున్నారు.
-
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!!












Click it and Unblock the Notifications