పాక్ లో చిచ్చురేపిన భారత్-యూఎస్ డీల్..! సర్కార్ కు షాకులు..!

భారత్-అమెరికా మధ్య తాజాగా కుదిరిన వాణిజ్య ఒప్పందం పాకిస్తాన్ (Pakistan) లో తీవ్ర చిచ్చు రేపుతోంది. ముఖ్యంగా ఇన్నాళ్లూ ట్రంప్ తో సన్నిహితంగా ఉన్నట్లు మెలుగుతూ, ఏకంగా ఆయనకు నోబెల్ బహుమతికి నామినేట్ కూడా చేసిన పాక్ ప్రభుత్వం.. ఇప్పుడు ఈ డీల్ తో ఇరుకునపడింది. దీనికి స్వదేశంలో సమాధానం చెప్పుకోలేక అటు ప్రధాని షెహబాజ్ షరీఫ్ తో పాటు ఆర్మీఛీఫ్ ఆసిమ్ మునీర్ సైతం సతమతం అవుతున్నారు. దీంతో మీరు గౌరవం కొనుక్కోలేరంటూ విమర్శకులు వారిని టార్గెట్ చేస్తున్నారు.

పాక్ కు సీన్ రివర్స్ (pakistan)

గత వేసవిలో భారత్ లోని పహల్గాంలో ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ పై జరిగిన ఆపరేషన్ సింధూర్ ను ఆపాలంటూ ఆ దేశం అమెరికాను వేడుకుంది. అంతే కాదు ట్రంప్ ఏం చెప్పినా వింటామంటూ ఆయనకు లొంగిపోయింది. ఆర్మీఛీఫ్ ఆసిమ్ మునీర్ అయితే ఏకంగా ట్రంప్ తో విందుల్లో కూడా పాల్గొన్నాడు. మరోవైపు భారత్ రష్యా నుంచి డిస్కౌంట్ పై చమురు కొనుగోలు చేస్తున్న కారణంగా అమెరికా నుంచి 50 శాతం సుంకాల మోత ఎదుర్కొంది. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది.

Domestic backlash in Pakistan after India-US Trade Deal You Can t Buy Respect

అతి వినయం చూపి..

రష్యా నుంచి చమురు కొనుగోళ్లు ఆపేస్తామన్న హామీ ఇచ్చి భారత్ అమెరికాతో డీల్ కుదుర్చుకుంటే.. అటు ఇన్నాళ్లుగా ట్రంప్ కు సరెండర్ అయిపోయి సన్నిహితంగా మెలుగుతున్నట్లు కలరింగ్ ఇచ్చుకున్న పాకిస్తాన్ చిక్కుల్లో పడింది. ఈ నేపథ్యంలో స్వదేశంలో పాకిస్తాన్ ప్రభుత్వ విదేశాంగ విధాన వైఫల్యంపై విమర్శలు మొదలయ్యాయి. ఓవైపు ట్రంప్ విషయంలో అతి గౌరవం చూపకుండానే సైలెంట్ గా భారత్ డీల్ సాధించుకుంటే.. పాకిస్తాన్ మాత్రం అతి వినయం ప్రదర్శించి కూడా దెబ్బతిందనే చర్చ సాగుతోంది.

Domestic backlash in Pakistan after India-US Trade Deal You Can t Buy Respect

స్వదేశంలో విమర్శల వెల్లువ

పాకిస్తాన్ పాలకులు ట్రంప్ కు సాగిలపడటం వల్లే ఇప్పడు ఈ పరిస్ధితి ఎదురైందని విపక్షాలు మండిపడుతున్నాయి. ట్రంప్ చెప్పినట్లు విన్నా భారత్ కంటే ఎక్కువ సుంకాలు భరించాల్సి వస్తోందని, అలాగే గాజా శాంతి బోర్డులో చేరడం వల్ల ఇస్లామిక్ దేశాలకు సైతం దూరమవుతున్నామని, ఇంత చేసినా ఇప్పుడు తమను కాదని భారత్ తో అమెరికా డీల్ కుదుర్చుకోవడం అంటే ఇంతకంటే పెద్ద ఎదురుదెబ్బ ఉండదనే విమర్శలు పాకిస్తాన్ లో వినిపిస్తున్నాయి. పాకిస్తాన్ లో వెన్నెముక లేని ప్రభుత్వం వల్లే ఇలాంటి దుస్దితి ఎదురవుతోందని ప్రభుత్వంపై జర్నలిస్టులు సైతం విమర్శలు ఎక్కుపెడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+