మేం తల్చుకుంటే భారత్‌లో ఒక్క నగరం మిగలదు.. జాగ్రత్త: భారత్ కు పాక్ హెచ్చరిక
మేం తల్చుకుంటే భారత్‌లో ఒక్క నగరం మిగలదు.. ఢిల్లీ సహా పలు నగరాలను నేల మట్టం చేస్తాం.. మా అణు శక్తిని తట్టుకోలేరు.. అంటూ భారత్‌ను పాకిస్తాన్ హెచ్చరించింది.
ఇస్లామాబాద్ : మేం తల్చుకుంటే భారత్‌లో ఒక్క నగరం మిగలదు.. ఢిల్లీ సహా పలు నగరాలను నేల మట్టం చేస్తాం.. మా అణు శక్తిని తట్టుకోలేరు.. అంటూ భారత్‌ను పాకిస్తాన్ హెచ్చరించింది.
అంతేకాదు, ఐఎస్‌ఐతో ఉగ్రవాదులకు సంబంధాలున్నాయన్న అమెరికా ప్రకటనపైనా స్పందించింది. అమెరికాలోని గన్ లాబీయిస్టులకే ప్రపంచంలోని అన్ని రకాల ఉగ్రవాదులతో సంబంధాలున్నాయని పాక్ వ్యాఖ్యానించింది.

'భారత ప్రభుత్వం ఆదేశిస్తే.. ఏకకాలంలో చైనా, పాకిస్తాన్‌లతో యుద్ధం చేయగలమని.. అవసరం అయితే పాకిస్తాన్‌లోని అణ్వాయుధ స్థావరాలపై సర్జికల్ స్ట్రయిక్స్ చేస్తామని..' ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ చీఫ్ బీఎస్ ధనోవా ప్రకటనపై పాక్ ప్రతిస్పందించింది.
మేం తల్చుకుంటే భారత్‌లోని ఏ నగరాన్ని అయినా నేలమట్టం చేయగలని పాకిస్తాన్ విదేశాంగ శాఖమంత్రి ఖ్వాజా ఆసిఫ్ శుక్రవారం ప్రకటించారు. అంతేకాక మా అణుశక్తిని తట్టుకుని భారత్ నిలబడలేదని కూడా ఆయన హెచ్చరించారు.
సరిహద్దునుంచి లక్ష్యం నిర్ణయించి మా అణ్వాయుధాలను వదిలితే.. క్షణాల్లో ఢిల్లీ సహా పలు నగరాలు నేలమట్టం అవుతాయని ఆయన అన్నారు. ఎవరు అంగీకరించినా.. అంగీకరించకపోయినా.. శక్తివంతమైన అణ్వాయుధాలు కలిగిన దేశాల్లో పాక్ ఒకటని ఆయన చెప్పారు.
పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ సంస్థ ఐఎస్‌ఐకు ఉగ్రవాదులతో సంబంధాలున్నాయన్న వ్యాఖ్యలను ఆసిఫ్ ఖండించారు. అసలు అమెరికాలోని గన్ లాబీ సంస్థలకే ఉగ్రవాదులతో సంబంధాలున్నాయని చెప్పారు. ఇందుకు లాస్‌వేగాస్ ఘటనే నిదర్శనమని అన్నారు. ప్రపంచంలో ఉగ్రవాదం పెరగడానికి గన్ లాబీనే కారణమని వ్యాఖ్యానించారు.
-
భారత్‌లోకి " పైప్డ్ " గ్యాస్ ఎక్కడి నుండి వస్తుంది? ఇది కూడా అయిపోతుందా?? -
పెరుగులో ఉప్పు లేదా చక్కెర - ఆరోగ్యానికి ఎవరికి ఏది మంచిది..!! -
దివ్యాంగుల ప్రతిభకు పట్టం: రూ. 5 లక్షలు గెలుచుకునే ఛాన్స్.. అప్లై చేసుకోండిలా! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications