ట్రంప్ బిగ్ యూటర్న్-ఉక్రెయిన్ కు హ్యాండ్-రష్యాకు మద్దతు..!

రష్యా-ఉక్రెయిన్ మధ్య మూడేళ్లుగా కొనసాగుతున్న యుద్దానికి పరోక్షంగా అమెరికా కూడా ఓ కారణం. ఉక్రెయిన్ పై రష్యా దాడి తర్వాత ఆ దేశానికి అండగా నిలిచిన అమెరికా.. భారీ ఎత్తున నిధులు, ఆయుధాలు సరఫరా చేసింది. దీంతో ఉక్రెయిన్ రష్యాతో ఇన్నాళ్లూ దీటుగా పోరాడుతూ వస్తోంది. అయితే అమెరికా ప్రభుత్వం మారడంతో ఆ ప్రభావం రష్యా-ఉక్రెయిన్ మీద పడింది. బైడెన్ స్ధానంలో అధ్యక్షుడైన ట్రంప్.. ఇప్పుడు ఉక్రెయిన్ కు వరుస షాకులిస్తున్నారు.

ఇన్నాళ్లూ అమెరికాతో పాటు పాశ్చాత్య దేశాల అండ చూసుకుని రష్యాపై పోరాడుతున్న ఉక్రెయిన్ కు ఎదురుదెబ్బలు మొదలయ్యాయి. దీంతో రష్యాతో యుద్దం ముగించేందుకు సైతం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ సిద్దమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనంతటికీ ప్రధాన కారణం అమెరికాలో అధ్యక్షుడైన డొనాల్డ్ ట్రంపే. ఇప్పటికే రష్యాతో విభేదాలను పక్కనబెట్టేసి పుతిన్ కు స్నేహ హస్తం అందిస్తున్న ట్రంప్.. ఉక్రెయిన్ కు తాజాగా మరో షాకిచ్చారు.

Donald trump s major U turn on Russia-Ukraine War backs UN resolution

రష్యా-ఉక్రెయిన్ యుద్దంలో కాల్పుల విరమణకు మద్దతుగా ఐక్యరాజ్యసమితిలో ప్రవేశపెట్టిన తీర్మానానికి అమెరికా అండగా నిలిచింది. తద్వారా రష్యా వాదనకు మద్దతు పలికింది. దీంతో సహజంగానే ఉక్రెయిన్ కు భారీ షాక్ తగిలినట్లయింది. ఇదే ఐక్యరాజ్యసమితిలో గతంలో ప్రవేశపెట్టిన పలు తీర్మానాల్లో ఉక్రెయిన్ కు అండగా నిలిచిన అమెరికా ఇప్పుడు రూటు మార్చి ఇలా రష్యాకు మద్దతివ్వడం అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది.

అయితే ఉక్రెయిన్, దాని యూరోపియన్ మిత్రదేశాలు ప్రవేశపెట్టిన ఈ తీర్మానం తీర్మానానికి ఐరాస సాధారణ సభ అనుకూలంగా ఓటు వేసింది. ఈ తీర్మానానికి అనుకూలంగా 93 ఓట్లు రాగా వ్యతిరేకంగా 18 ఓట్లు వచ్చాయి. మరో 65 మంది గైర్హాజరయ్యారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రవేశపెట్టిన తీర్మానంపై రష్యాకు మద్దతు ఇచ్చిన వారిలో దాని మిత్రదేశాలు బెలారస్, ఉత్తర కొరియా, సూడాన్ ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+