ఇతడో మాన్‌స్టర్..: ట్రంప్ స్ట్రేంజ్ కాంప్లిమెంట్ కు బిక్కమొహం వేసిన సుందర్ పిచాయ్

అమెరికా వైట్‌హౌస్‌లో జరిగిన ఓ ఉన్నత స్థాయి సమావేశం.. ఆసక్తికరమైన సంభాషణలకు వేదిక అయింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒప్పందాల కోసం సిలికాన్ వ్యాలీకి చెందిన టెక్ దిగ్గజాలతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ఓవల్ ఆఫీస్ లో నిర్వహించిన సమావేశం ఇది. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధుల సమక్షంలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేకించి.. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌ను ఉద్దేశించి చెప్పిన మాటలు హాట్ టాపిక్ అయ్యాయి.

ఈ సమావేశం ముగిసిన అనంతరం వైట్ హౌస్ లాన్ లో మీడియాతో మాట్లాడారు డొనాల్డ్ ట్రంప్. తన మాటలను నిలిపివేసి తన పక్కనే నిల్చొని ఉన్న సుందర్ పిచాయ్‌ను దగ్గరికి పిలిచారు. "నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావా?" అని ప్రశ్నించారు. దీనికి బదులుగా పిచాయ్ నవ్వుతూ థాంక్స్ అని చెప్పారు. ఏదో చెప్పబోతోండగా ట్రంప్ మధ్యలోనే జోక్యం చేసుకున్నారు. పూర్తిగా మాట్లాడనివ్వలేదు. "This Guy is a Monster.. అని అభివర్ణించారు. అదే పదాన్ని రెండుసార్లు ఉచ్ఛరించారాయన.

Donald Trump Monster Compliment to Sundar Pichai Leaves Google CEO Smiling at White House Media meet

సుందర్ పిచాయ్ ఓ పని రాక్షసుడని, ఈ విషయం ఎవరికీ తెలియదని ట్రంప్ నవ్వుతూ చెప్పారు. అదే సమయంలో మీడియాపైనా సెటైర్లు వేశారు. మీడియాతో రోజూ మాట్లాడే అవసరం గానీ, మాట్లాడాలనే ఒత్తిడి గానీ ఈ టెక్ లీడర్స్ కు ఉండదని, ఫలితంగా వారు గొప్ప జీవితాన్ని గడుపుతున్నారని ట్రంప్ వ్యాఖ్యానించడంతో అక్కడ ఉన్న వాళ్లంతా సరదాగా నవ్వారు.

పసిడి ధరల్లో పురోగమనం
పసిడి ధరల్లో పురోగమనం

తనను మాన్ స్టర్ గా అభివర్ణించిన సమయంలో సుందర్ పిచాయ్ సిగ్గుపడుతూ తలదించుకోవడం కనిపించింది. కొద్దిసేపటి తర్వాత ఈ కాంప్లిమెంట్ కు బదులిచ్చారు. 'మాన్‌స్టర్..' అనే క్యాప్షన్ కంటే ఇంకేదైనా మంచి ట్యాగ్‌లైన్ తనకు దొరికితే బాగుంటుందని పిచాయ్ సరదాగా వ్యాఖ్యానించారు. ఆ తర్వాత ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ.. పిచాయ్ పేరును గుర్తుంచుకోవాలని సూచించారు.

ఆంథ్రోపిక్ చీఫ్ డారియో అమోడెయ్‌తో కూడా ట్రంప్ సరదాగా మాట్లాడారు. అమోడెయ్‌ను దగ్గరకు పిలిచి టేక్ కేర్ అని సున్నితంగా హెచ్చరించడం వినిపించింది. భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల మానవాళి మనుగడకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందంటూ గతంలో అమోడెయ్ చేసిన ఆందోళనకర వ్యాఖ్యల నేపథ్యంలో ట్రంప్ ఈ విధంగా జోక్ చేశారు. దీనికి అమోడెయ్ కూడా నవ్వుతూ ట్రంప్‌తో ఏకీభవించారు. ఈ స్పెషల్ లంచ్ మీటింగ్‌లో మార్క్ జుకర్‌బర్గ్, ఎలాన్ మస్క్, జెన్సన్ హువాంగ్, గ్రెగ్ బ్రాక్‌మన్ పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+