Xi Jinping: దశాబ్దం తర్వాత వైట్‌హౌస్ మెట్లు ఎక్కబోతున్న చైనా బాస్

ప్రపంచ రాజకీయాలను తిరగరాసే ఓ కీలక ఘట్టానికి వాషింగ్టన్ వేదిక కాబోతోంది. చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ ఈ నెల 24న అమెరికాలో పర్యటించనున్నారు. దాదాపు పదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత చైనా అగ్రనేత వైట్‌హౌస్‌కు వస్తుండటంతో ప్రపంచమంతా ఈ పర్యటన వైపే ఆసక్తిగా చూస్తోంది. సాధారణంగా విదేశీ ప్రతినిధులను వైట్‌హౌస్‌లోనే కలిసే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఈసారి ప్రోటోకాల్ పక్కనపెట్టి నేరుగా ఎయిర్‌పోర్టుకే వెళ్లి జిన్ పింగ్‌కు స్వాగతం పలకాలని నిర్ణయించడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ అరుదైన ఆతిథ్యంతో ద్వైపాక్షిక చర్చల్లో తనదైన ముద్ర వేసేందుకు ట్రంప్ సిద్ధమవుతున్నారు.

యుద్ధ రంగాన్ని తలపించే చర్చల అజెండా!

ఈ పర్యటన కేవలం హంగు ఆర్భాటాలకే పరిమితం కాకుండా.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేసే అంశాలపై చర్చలు జరగనున్నాయి. ఇరు దేశాల మధ్య ఎన్నాళ్లుగానో నడుస్తున్న టారిఫ్ యుద్ధం, రక్షణ సాంకేతిక పరిజ్ఞానానికి అత్యంత కీలకమైన 'రారే ఎర్త్' ఖనిజాల సరఫరా, అలాగే భవిష్యత్తును శాసించబోయే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతపై ప్రధానంగా దృష్టి సారించనున్నారు. వ్యాపార రంగంలో ఉన్న వివాదాలను తగ్గించుకోవడానికి కొన్ని వ్యూహాత్మకేతర వస్తువులపై పన్నుల భారాన్ని తగ్గించేందుకు ఇరు దేశాలు ప్రాథమికంగా మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.

Donald Trump Prepares Rare Airport Welcome For Xi Jinping As US And China Tackle Trade Tariffs And AI Tech
Xi Jinping: ప్రాణపాయ స్థితిలో చైనా అధ్యక్షుడు? ఢిల్లీలోనే బ్రెయిన్ స్ట్రోక్?
Xi Jinping: ప్రాణపాయ స్థితిలో చైనా అధ్యక్షుడు? ఢిల్లీలోనే బ్రెయిన్ స్ట్రోక్?

వైట్‌హౌస్‌లో మిలియనీర్ల కోలాహలం!

గురువారం రాత్రి ట్రంప్ దంపతులు ఇవ్వబోయే అధికారిక విందు ఈ పర్యటనలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా మారనుంది. టెక్ ప్రపంచాన్ని శాసిస్తున్న దిగ్గజాలు ఈ విందుకు హాజరుకానున్నారు. టెస్లా అధినేత ఎలాన్ మస్క్, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, అమెజాన్ జెఫ్ బెజోస్, ఎన్విడియా జెన్సన్ హువాంగ్, ఓపెన్ ఏఐ సామ్ ఆల్ట్‌మాన్, ఆపిల్ మాజీ అధినేత టిమ్ కుక్ లాంటి ఎంతోమంది బిలియనీర్లు ఈ జాబితాలో ఉన్నారు. ఈ విందు పాస్‌ల కోసం అమెరికాలోని ప్రసిద్ధ ప్రముఖులు తీవ్రంగా పోటీ పడుతున్నట్లు ట్రంప్ వ్యాఖ్యానించడం గమనార్హం.

Xi Jinping వచ్చేశారు.. ఏడేళ్ల తర్వాత భారత గడ్డపై అడుగు, 'రెడ్ బ్యానర్' కారు ప్రత్యేకతలు
Xi Jinping వచ్చేశారు.. ఏడేళ్ల తర్వాత భారత గడ్డపై అడుగు, 'రెడ్ బ్యానర్' కారు ప్రత్యేకతలు

పూర్వరంగం.. భవిష్యత్తు వ్యూహాలు

2015లో బరాక్ ఒబామా హయాంలో చివరిసారిగా జిన్ పింగ్ అమెరికాలో పర్యటించారు. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు వైట్‌హౌస్ మెట్లు ఎక్కబోతున్నారు. చర్చల కంటే ముందే ఆర్థికపరమైన ప్రాథమిక ముసాయిదాను సిద్ధం చేసేందుకు అమెరికా ఆర్థిక కార్యదర్శి స్కాట్ బెసెంట్, చైనా వైస్ ప్రీమియర్ హే లీఫెంగ్‌లు న్యూయార్క్‌లో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. సైనిక బలాబలాలు, వాణిజ్య సవాళ్లు, రారే ఎర్త్ ఖనిజాలపై చైనా ఆధిపత్యాన్ని తట్టుకోవడం వంటి క్లిష్టమైన సమస్యల నడుమ ఈ ద్వైపాక్షిక భేటీ ఇరు దేశాల బంధాన్ని ఏ మలుపు తిప్పుతుందో వేచి చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+