H-1B Visa: హెచ్1బీ వీసాలపై అమెరికా మరో షాక్-ఆ డేటా మొత్తం డిలీట్..!
అమెరికాలో అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి వలసదారులపై ఉరుముతున్న డొనాల్డ్ ట్రంప్ వారిని దేశం నుంచి తరిమేసేందుకు కొత్త మార్గాలన్నీ వెతుకుతున్నారు. ఇందులో భాగంగా తాజాగా మరో షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. గతంలో హెచ్1 బీ వీసాల క్లియరెన్స్ కోసం దరఖాస్తుదారుల నుంచి సేకరించిన డేటాను ఫారిన్ లేబర్ యాక్సెస్ గేట్ వే నుంచి తొలగించాలని ఆదేశాలు ఇచ్చేశారు. దీంతో ఇవాళ్టి నుంచి ఈ ప్రక్రియ మొదలుకాబోతోంది.
అమెరికాకు హెచ్1బీ వీసాల కోసం గతంలో దరఖాస్తు చేసుకున్న వారికి తుది క్లియరెన్స్ ఇచ్చిన డేటాను ఎప్పటికప్పుడు అక్కడి ప్రభుత్వం ఫారిన్ లేబర్ యాక్సెస్ గేట్ వేలో భద్రంగా ఉంచుతుంది. భవిష్యత్తులో వారికి మరోసారి హెచ్1బీ వీసాలు ఇవ్వాల్సి వచ్చినా, ఉన్నవి పొడిగించాల్సి వచ్చినా, రద్దు చేయాల్సి వచ్చినా ఈ డేటా అనేది చాలా కీలకం. ఇది లేకపోతే మొత్తం ప్రక్రియ తిరిగి చేపట్టాల్సి వస్తుంది. ఇంత కీలకమైన డేటాను తమ గేట్ వే నుంచి డిలీట్ చేసేయాలని ట్రంప్ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.

ఐదేళ్ల వరకూ డేటాను భద్రంగా ఉంచి, అంతకంటే పాత హెచ్1 బీ వీసాల డేటాను గేట్ వే నుంచి తొలగించాలని అధికారులకు ట్రంప్ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఇకపై అమెరికా హెచ్1 బీ వీసాల కోసం దరఖాస్తు చేసుకునేవారు, వీసాలు పొందే వారికి కష్టాలు తప్పేలా లేవు. ఐదేళ్ల కంటే పాత హెచ్1బీ వీసాల డేటాను ప్రభుత్వం గేట్ వే నుంచ తొలగిస్తున్నందున అక్కడి కంపెనీలు దీన్ని సర్వర్ ల నుంచి డౌన్ లోడ్ చేసి పెట్టుకోవాలని ట్రంప్ సర్కార్ సూచించింది.
మరోవైపు వలసదారులపై కొరడా ఝళిపిస్తున్న ట్రంప్ సర్కార్.. అన్ని రకాల వీసాలపై మరో క్లారిటీ ఇచ్చింది. ఓసారి వీసాలు పొందితే ఇక ఇబ్బంది లేదని భావిస్తున్న వారికి షాకిస్తూ.. అలాంటి పప్పులేవీ ఉడకవని తేల్చేసింది. ఓసారి వీసా జారీ తర్వాత వలస చట్టాల ప్రకారం ఇది ఉందా లేదా అనేది ఎప్పుడైనా తనిఖీ చేసి రివ్యూ చేసే అధికారం తమకు ఉందని స్పష్టం చేసింది.
ప్రస్తుతం భారతీయ గ్రీన్ కార్డుదారులపై తనిఖీల నేపథ్యంలో ట్రంప్ సర్కార్ ఈ క్లారిటీ ఇచ్చింది. ముఖ్యంగా భారతీయ సీనియర్ సిటిజన్ల విషయంలో జరుగుతున్న తనిఖీల నేపథ్యంలో ట్రంప్ సర్కార్ వ్యాఖ్యలు మరింత టెన్షన్ పుట్టించేలా ఉన్నాయి.
-
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
Donald Trump: పీకల్లోతు కష్టాల్లో ట్రంప్-స్వదేశంలో భారీ షాక్..! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
పెరుగులో ఉప్పు లేదా చక్కెర - ఆరోగ్యానికి ఎవరికి ఏది మంచిది..!! -
Bay of Pigs: క్యూబాలో అమెరికా ఎలా ఓడిపోయి లొంగిపోయింది ? నెక్ట్స్ ఇరానేనా ? -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..!











Click it and Unblock the Notifications