నోబెల్ శాంతి బహుమతి వద్దు, కానీ, ప్రపంచాన్ని జయించాలి: ట్రంప్

న్యూయార్క్: ప్రసిద్దమైన నోబెల్ శాంతి బహుమతిపై తనకు ఆసక్తి లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. కానీ, ప్రపంచాన్ని జయించాలనే కోరిక తనకు ఉందని ఆయన ప్రకటించారు.

దక్షిణ కొరియా అధ్యక్షుడు ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు నోబెల్ బహుమతి ఇవ్వాలని కోరారు. ఈ తరుణంలో ఓ సమావేశంలో పాల్గొన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను ఓ విలేకరి ఈ విషయమై ప్రశ్నించాడు.

Donald Trump says hes not interested in Nobel Peace Prize, but wants victory for the world

నోబెల్ బహుమతికి మీరు అర్హులేనా అని ప్రశ్నించారు. అయితే ఈ విషయమై ట్రంప్ సమాధానమిచ్చారు. ప్రతి ఒక్కరికీ కూడ ఏదో ఒకరకమైన బహుమతి పొందాలనే కోరిక ఉంటుందని చెప్పారు. అయితే ఎవరూ కూడ బహుమతిని వద్దని చెప్పరని ఆయన గుర్తు చేశారు. అంతేకాదు నోబెల్ శాంతి బహుమతి తనకు వద్దని ఆయన చెప్పారు. ఈ బహుమతిపై తనకు ఆసక్తి లేదన్నారు.

కానీ, ప్రపంచాన్ని జయించాలనే కోరిక మాత్రం తనకు ఉందన్నారు. అదే తనకు పెద్ద బహుమతి అని ట్రంప్ జవాబిచ్చారు. ప్రపంచ విజయాన్ని బహుమతిగా తీసుకోవాలని తనకు కోరికగా ఉందన్నారు.

ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌తో సమావేశం కావాలనుకోవడం ప్రపంచానికి మంచి పరిణామం అని ట్రంప్ అభిప్రాయ పడ్డారు. ఇలాంటి ఆలోచన గత కొన్నేళ్లుగా ఎవరూ చేయలేదు.

ఈ సమావేశంతో ఉత్తర కొరియా, దక్షిణ కొరియా, జపాన్‌ దేశాలకు మంచి జరుగుతుందని భావిస్తున్నానన్నారు. 'ఈ చర్చలు సఫలం కావడానికి సహాయం అందిస్తోన్న చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు ధన్యవాదాలు తెలిజేస్తున్నాను. మేము చైనాతో వర్తకాన్ని కొనసాగిస్తున్నాం. ఇరు దేశాలు స్నేహభావంతో ఒకరికొకరు సాయం అందించుకుంటామని ట్రంప్‌ చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+