Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

భారత్ చేతిలో పాకిస్తాన్ ప్రధాని ఎప్పుడో చనిపోయేవాడు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన స్టేట్ ఆఫ్ ది యూనియన్ ను ఉద్దేశించి ప్రసంగించారు. కీలక ప్రకటనలు చేశారు. అనేక అంశాలను ప్రస్తావించారు. టారిఫ్స్ మొదలుకుని ఇరాన్ వరకు చాలా అంశాలపై ఆయన మాట్లాడారు. కొన్నింటికి వివరణలూ ఇచ్చారు. టారిఫ్ ను సుప్రీంకోర్టు రద్దు చేయడాన్ని కూడా ఆయన ఈ సందర్భంగా తప్పుపట్టారు. యుద్ధాలను ఆపిన విషయాన్ని కూడా వదల్లేదు. దీన్ని పునరుద్ఘాటించారు. 100 నిమిషాల పాటు ఆయన ప్రసంగం కొనసాగింది. ఇదో రికార్డు.

గత ఏడాది పహల్గామ్ ఉగ్రదాడుల తదనంతరం తలెత్తిన భారత్-పాకిస్తాన్ వివాదంతో సహా ఎనిమిది యుద్ధాలను తాను ముగించానని డొనాల్డ్ ట్రంప్ మరోసారి స్పష్టం చేశారు. ఈ ఘర్షణలో తాను జోక్యం చేసుకోకుంటే దాదాపు 35 మిలియన్ల మంది మరణించేవారని గుర్తు చేశారు. చివరికి పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ కూడా ప్రాణాలతో ఉండేవాడు కాదని తేల్చి చెప్పారు. భారత్ సైనిక చర్యను ఆపివేయడం ద్వారాషెహబాజ్ షరీఫ్ ప్రాణాలను కాపాడానని ట్రంప్ పేర్కొన్నారు.

Donald Trump says Pakistan PM would have died if it were not for my involvement as India had nuclear

ఇదే విషయాన్ని షెహబాజ్ స్వయంగా తనతో చెప్పారని ట్రంప్ వెల్లడించారు. రెండో విడత దేశాధ్యక్షుడిగా ప్రమాణం స్వీకారం చేసిన మొదటి 10 నెలల్లోనే ఎనిమిది యుద్ధాలు ఆపానని చెప్పుకొన్నారు. కంబోడియా, థాయిలాండ్, భారత్- పాకిస్తాన్ వంటివి ఇందులో ఉన్నాయని చెప్పారు. తాను అడ్డుకోకపోయివుంటే భారత్- పాకిస్తాన్ మధ్య అణు యుద్ధం వచ్చేదని తేల్చి చెప్పారు. తన ప్రమేయం లేకుంటే 35 మిలియన్ల మంది చనిపోయేవారని పాక్ ప్రధాని చెప్పారని ట్రంప్ ఉటంకించారు.

డొనాల్డ్ ట్రంప్ తాను పరిష్కరించానని పేర్కొన్న యుద్ధాలలో, ప్రధానంగా ఇజ్రాయెల్-హమాస్, ఇజ్రాయెల్-ఇరాన్, ఈజిప్ట్-ఇథియోపియా, భారత్-పాకిస్తాన్, సెర్బియా-కొసావో, రువాండా-కాంగో, అర్మేనియా-అజర్‌బైజాన్, కంబోడియా-థాయ్‌లాండ్ ఉన్నాయి.

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం గురించి కూడా ట్రంప్ ప్రస్తావించారు. ఈ యుద్ధం మొదలయ్యే సమయానికి తాను అమెరికా అధ్యక్షుడిగా ఉండివుంటే ఇది ప్రారంభమే అయ్యేది కాదని పేర్కొన్నారు. 2022 లో సరిగ్గా ఇదే రోజు అంటే ఫిబ్రవరి 25వ తేదీన రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఆరంభమైన విషయం తెలిసిందే. జో బైడెన్ అప్పట్లో అమెరికా అధ్యక్షుడిగా ఉన్నారు. తాను ఉండివుంటే ఈ యుద్ధం ప్రారంభానికి ముందే అడ్డుకుని ఉండేవాడినని చెప్పారు.

అయినప్పటికీ- ఈ రెండు దేశాల మధ్య హత్యలు, మారణకాండను ముగించడానికి తీవ్రంగా కృషి చేస్తోన్నామని ట్రంప్ తెలిపారు. ఇరాన్ పరిస్థితులపై ట్రంప్ స్పందించారు. దౌత్యపరమైన పరిష్కారాన్నే ఇష్టపడతానని, అయితే ఇతర మార్గాలను కూడా పరిశీలిస్తున్నానని అన్నారు. ఇరాన్ వైఖరిని తప్పుపట్టారు. ఇప్పటికే యూరప్, ఇతర దేశాలపై దాడులు చేయడానికి అవసరమైన క్షిపణులను అభివృద్ధి చేశారని అన్నారు. అమెరికాను చేరుకోగల సామర్థ్యం గల క్షిపణులను తయారు చేయడానికి డానికి ప్రయత్నిస్తోన్నారని చెప్పారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+