అమెరికాలో వలసలకు ట్రంప్ మరో షాక్-ఏలియన్ శత్రువుల చట్టం ప్రయోగం..!

అమెరికాలో ఏళ్ల తరబడి పాగా వేసిన అక్రమ వలసల్ని సాధ్యమైనంత త్వరగా దేశం నుంచి తరిమేసేందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలు తుది దశకు చేరుకుంటున్నాయి. ఇప్పటికే పలు దేశాలకు వలసల్ని నిర్దాక్షిణ్యంగా పంపేసిన ట్రంప్.. నిధుల కొరత కారణంగా ఈ మధ్య కాస్త బ్రేక్ ఇచ్చారు. అయితే ఈసారి మాత్రం ఏకంగా యుద్ధ కాలం నాటి శత్రువుల చట్టాన్ని అమలు చేయడం ద్వారా భారీ ఎత్తున వలసల్ని స్వదేశాలకు పంపేందుకు సిద్దమవుతున్నారు.

ఏలియన్ చట్ట ప్రయోగం

అమెరికాలో యుద్ధ కాలంలో అధ్యక్షుడికి ప్రత్యేక అధికారాలు వస్తాయి. ఇలా వలసల బహిష్కరణలను వేగవంతం చేయడానికి యుద్ధ సమయంలో వాడే 1798 నాటిక గ్రహాంతర శత్రువుల చట్టాన్ని అమలు చేసేందుకు ట్రంప్ సిద్దమవుతున్నారు. ఈ మేరకు అధికారులతో ఇప్పటికే చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ట్రంప్ ఇతర నిర్ణయాల తరహాలో ఈ నిర్ణయాన్ని కోర్టుల్లో సవాల్ చేసే అవకాశం కూడా లేదని చెప్తున్నారు. దీంతో ట్రంప్ దూకుడుగా అడుగులు వేస్తున్నారు.

Donald trump to invoke alien enemies act to speed-up mass deportations- how it works

గ్రహాంతర శత్రువుల చట్టం అంటే ఏమిటి?

అమెరికా యుద్ధంలో ఉన్న దేశాల నుండి, అమెరికాపై దాడి చేసిన లేదా దోపిడీ, చొరబాట్లలో పాల్గొన్న వ్యక్తులను దేశం ననుంచి బహిష్కరించడానికి ఈ చట్టం అనుమతిస్తుంద. ఈ ఏడాది జనవరిలో అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత ట్రంప్ తన తొలి ప్రసంగంలోనే దీన్ని గుర్తుచేసారు. ఈ మేరకు కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం కూడా చేశారు. గతంలో అమెరికాలో మూడుసార్లు ఈ అధికారాన్ని ఉపయోగించారు. మొదటి, రెండో ప్రపంచ యుద్ధాలలో జర్మన్, ఆస్ట్రో-హంగేరియన్, జపనీస్ , ఇటాలియన్ వలసదారులను వారి పూర్వీకుల ఆధారంగా మాత్రమే లక్ష్యంగా చేసుకుని నిర్బంధాలు, బహిష్కరణలు, ఆంక్షలు అమలు చేశారు.

Take a Poll

ముందుగా వీరి బహిష్కరణ..

ఈ శత్రువుల చట్టం అమల్లోకి వస్తే ట్రంప్ ప్రభుత్వానికి 14 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వలసదారులను కోర్టు విచారణ లేదా ఆశ్రయం స్క్రీనింగ్ లేకుండానే అరెస్టు చేసి దేశం నుంచి బహిష్కరించే అధికారం వస్తుంది. యుద్ధకాల చట్టం ప్రకారం విదేశీ ప్రభుత్వ చర్యలకు లింక్‌ను ఏర్పాటు చేయాలని న్యాయ నిపుణులు చెప్తున్నారు. వలసదారుల్ని, మాదకద్రవ్యాల కార్టెల్‌ల అనుమానిత సభ్యులను బహిష్కరించడానికి ట్రంప్ దీనిని ఎంతవరకు వాడుకుంటారనేది ఇంకా తేలలేదు. అయితే ముందుగా వెనిజులా గ్రూప్ ట్రెన్ డి అరగువాతో సహా డ్రగ్ కార్టెల్‌లు, క్రిమినల్ ముఠాల అనుమానిత సభ్యులను బహిష్కరించడానికి ట్రంప్ ఈ చట్టాన్ని వాడతోతున్నట్లు తెలుస్తోంది.

ఏలియన్ శత్రువుల చట్టాన్ని అమెరికాలో ఏ ప్రపంచ యుద్దంలో వాడారు ?

ఏలియన్ శత్రువుల చట్టాన్ని అమెరికాలో మొదటి, రెండవ ప్రపంచ యుద్దాల సందర్భంగా వాడారు. అప్పట్లో అమెరికాకు శత్రువులుగా ఉన్న జపాన్, ఇటలీ వంటి దేశాల వారిని అమెరికా నుంచి బహిష్కరించేందుకు ఈ చట్టం ప్రయోగించాల్సి వచ్చింది. అయితే ఇది చరిత్రలో అత్యంత అమానవీయ చట్టంగా పేరు తెచ్చుకుంది. దీంతో ఈ చట్టం ప్రయోగంపై అమెరికాతో పాటు వలసల స్వదేశాల్లోనూ ఆందోళన వ్యక్తమవుతోంది.  

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+