Donald trump: చరిత్ర సృష్టించబోతున్న ట్రంప్..తొలిరోజే 200కు పైగా సంతకాలు..!

అమెరికా అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ఇవాళ ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. భారత కాలమానం ఇవాళ రాత్రి పదిన్నర గంటల సమయంలో ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. అంతర్జాతీయంగా అతి పెద్ద ఈవెంట్ గా భావిస్తున్న ఈ కార్యక్రమానికి దేశ, విదేశీ ప్రతినిధులు, అధ్యక్షులు, ప్రధానులు, ఇతర నేతలు హాజరు కాబోతున్నారు. అయితే ఈ కార్యక్రమం తర్వాత ట్రంప్ మరో రికార్డు సృష్టించేందుకు సిద్దమవుతున్నారు.

డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా తన మొదటి రోజున భారీ ఎత్తున కీలక నిర్ణయాలు తీసుకునేందుకు సిద్దమయ్యారు. ఈ మేరకు కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేస్తానని ఇప్పటికే ట్రంప్ ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన కొన్ని గంటల్లోనే తాను మెరుపు వేగంతో పని చేయబోతున్నట్లు సంకేతాలు ఇచ్చారు. వాషింగ్టన్ DC అరేనాలో జరిగిన విక్టరీ ర్యాలీలో ట్రంప్.. రాబోయే నాలుగు సంవత్సరాల్లో ఏం చేస్తారో చెప్పేశారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులపై ట్రంప్ తొలిరోజు సంతకాలు చేయబోతున్నారు.

Donald trump to put sign on 200 decisions on first day- here are details

అధ్యక్షుడిగా మొదటి రోజు ట్రంప్ దాదాపు 200కు పైగా కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకాలు చేయడంతో పాటు పలు కీలక ప్రకటనలు చేస్తారని భావిస్తున్నారు. ఇందులో సరైన పత్రాలు లేని వలసదారులను లక్ష్యంగా చేసుకుని సామూహిక బహిష్కరణ చేపట్టేందుకు వీలుగా నిర్ణయం ఉంటుందని భావిస్తున్నారు. అలాగే అమెరికా మొత్తానికి ఐరన్ డోమ్ క్షిపణి రక్షణ కవచాన్ని అభివృద్ధి చేయడానికి సైన్యాన్ని నిర్దేశించే మరో ఉత్తర్వుపై సంతకం చేయబోతున్నారు.

అలాగే మిలిటరీ నుండి వైవిధ్యం, ఈక్విటీ , ఇన్‌క్లూజన్ వంటి విధానాలను తొలగించేందుకు ఉద్దేశించిన ఉత్తర్వులపైనా ట్రంప్ సంతకం చేస్తారు. మహిళా క్రీడా విభాగాల్లో లింగమార్పిడి, మహిళలను పోటీ చేయకుండా నిషేధించే ఉత్తర్వులపై ట్రంప్ సంతకం ఉంటుందని భావిస్తున్నారు.

కృత్రిమ మేధ కార్యక్రమాలను విస్తృతం చేయడం, 1963లో జాన్ ఎఫ్.కెన్నెడీ హత్యకు సంబంధించిన రికార్డులను విడుదల చేయడం, 2021లో కాపిటల్ బిల్డింగ్ అల్లర్లలో పాల్గొన్నందుకు దోషులుగా తేలిన వ్యక్తులను "బందీలుగా" మారుస్తూ క్షమాభిక్ష ప్రకటించడం వంటివి ఉన్నాయి. అలాగే ఎలాన్ మస్క్, వివేక్ రామస్వామి నేతృత్వంలో ప్రభుత్వ సమర్థత విభాగం ఏర్పాటు చేయడం కూడా ట్రంప్ లిస్ట్ లో ఉందని తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+