Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ట్రంప్-జిన్‌పింగ్ డీల్: భారత్‌కు బిగ్ షాక్!

America-China Deal: దక్షిణ కొరియాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ల మధ్య జరిగిన సమావేశం తర్వాత అమెరికా, చైనా మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంలో భాగంగా డొనాల్డ్ ట్రంప్ తక్షణమే చైనాపై ఉన్న సుంకాలను 10 శాతం తగ్గించారు. దీంతో టారిఫ్ 57 శాతం నుంచి 47 శాతానికి తగ్గింది. ఇది భారత్‌పై విధించిన 50 శాతం టారిఫ్ కంటే తక్కువ కావడం గమనార్హం. టారిఫ్ తగ్గింపునకు బదులుగా చైనా అమెరికా నుంచి పెద్ద మొత్తంలో సోయాబీన్ కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చింది. అంతే కాకుండా వ్యూహాత్మకం చాలా ముఖ్యమైన రేర్ ఎర్త్ మినరల్స్ (Rare Earth Minerals) సరఫరాను కూడా తిరిగి ప్రారంభిస్తామని హామీ ఇచ్చింది. మరి ఈ అమెరికా-చైనా డీల్ వల్ల భారత్‌కు ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

అమెరికా-చైనా వాణిజ్య ఒప్పందం కుదరడం, భారత్‌తో వాణిజ్యంపై ఇంకా ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ప్రపంచ స్థాయిలో భారత ఆర్థిక వ్యవస్థకు కొన్ని సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది.

1.చైనాపై భారత్ కంటే తక్కువ టారిఫ్
సమస్య: అమెరికాకు ఎగుమతుల్లో చైనా అగ్రస్థానంలో ఉంది. గతంలో అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం కారణంగా అమెరికన్ కంపెనీలు చైనాకు బదులుగా భారత్, వియత్నాం వంటి దేశాల నుంచి దిగుమతి చేసుకోవడం మొదలుపెట్టాయి. దీనివల్ల భారత్‌కు ఎక్కువ ప్రయోజనం చేకూరింది.

ప్రభావం: ఇప్పుడు చైనాపై భారత్ కంటే తక్కువ టారిఫ్ విధించడంతో అమెరికన్ కంపెనీలు తిరిగి చైనా వైపు మొగ్గు చూపవచ్చు. 2024 లో చైనా అమెరికాకు 438.7 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులను సరఫరా చేయగా.. భారత్ 79.44 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులను మాత్రమే సరఫరా చేసింది. టారిఫ్‌లు తగ్గితే భారత్ తన వాణిజ్య వాటాను కోల్పోవచ్చు.

Donald Trump xi jinping Deal Is India Facing a Trade Setback

2. భారత వ్యవసాయ రంగంపై ప్రభావం
సమస్య: భారత్ నుంచి చైనాకు వేరుశనగ, మిరపకాయలు, ధాన్యాలు, సోయాబీన్ వంటి అనేక వ్యవసాయ ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి.

ప్రభావం: చైనా అమెరికా నుంచి పెద్ద మొత్తంలో సోయాబీన్ కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చింది. దీంతో పాటు ఇతర వ్యవసాయ ఉత్పత్తులను కూడా అమెరికా నుంచే కొనుగోలు చేసే అవకాశం ఉంది. దీని ఫలితంగా భారత్ నుంచి చైనాకు వ్యవసాయ ఉత్పత్తుల సరఫరా తగ్గే అవకాశం ఉంది. ఇది భారత వ్యవసాయ ఎగుమతిదారులపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.

3. మ్యానుఫ్యాక్చరింగ్ రంగంపై ఒత్తిడి
సమస్య: ఈ డీల్ కారణంగా అమెరికా, చైనా మధ్య సంబంధాలు మెరుగుపడుతున్నాయి. చైనా నుంచి తమ కార్యకలాపాలను ఇతర దేశాలకు తరలించాలని గత కొన్నేళ్లుగా అనుకుంటున్న అమెరికన్ కంపెనీలు తమ ప్రణాళికలను మార్చుకోవచ్చు.

ప్రభావం: చైనా తర్వాత అమెరికన్ కంపెనీలకు భారత్ మొదటి ఎంపికగా ఉంది. ఈ పరిస్థితుల్లో, అమెరికన్ కంపెనీలు చైనాలో కొనసాగితే, భారతదేశ మ్యానుఫ్యాక్చరింగ్ (తయారీ) రంగానికి నష్టం వాటిల్లుతుంది. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్, టెక్స్‌టైల్స్, ఆటో విడిభాగాల రంగాలపై ఒత్తిడి పెరగవచ్చు.

4. భారతీయ స్టాక్ మార్కెట్‌పై నష్టం
సమస్య: రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య డీల్ కుదరడంతో, విదేశీ పెట్టుబడిదారులు చైనా, అమెరికన్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధం కావచ్చు.

ప్రభావం: దీనివల్ల భారతీయ స్టాక్ మార్కెట్‌లో వారి పెట్టుబడుల వాటాను తగ్గించుకోవచ్చు. డీల్ జరిగిన తర్వాత సెన్సెక్స్ దాదాపు 500 పాయింట్లు, నిఫ్టీ 150 పాయింట్లు పడిపోవడం దీనికి ఒక సంకేతం.

5. భారత్‌కు సానుకూల సంకేతాలు
స్థిరత్వానికి సూచన: ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య ఒప్పందం కుదరడం అనేది ప్రపంచ స్థిరత్వానికి సంకేతం. ఇది పెట్టుబడిదారులలో సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తుంది.

పెట్టుబడులు పెరిగే అవకాశం: స్థిరమైన మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టడానికి విదేశీ పెట్టుబడిదారులు ఆసక్తి చూపుతారు. భారతదేశంలో దేశీయ వినియోగం బలంగా ఉండటం, లిక్విడిటీ ఒత్తిడిలో ఉన్నప్పటికీ.. విదేశీ పెట్టుబడిదారులు భారత మార్కెట్‌లో తమ పెట్టుబడిని పెంచే అవకాశం కూడా ఉంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+