గ్రీన్ కార్డు దరఖాస్తుదారులకు ట్రంప్ మరో షాక్..! విమర్శల వెల్లువ..!

అమెరికాలో ఓవైపు వలసదారులు, మరోవైపు గ్రీన్ కార్డు, హెచ్ 1బీ వీసాదారులపై ఉరుముతున్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా గ్రీన్ కార్డు దరఖాస్తు దారులకు ఈ నిర్ణయంతో షాక్ తగిలింది. ఇప్పటికే దేశంలో ఉన్న గ్రీన్ కార్డుదారులకు సైతం శాశ్వత నివాసం గ్యారంటీ లేదని చెప్పేస్తున్న ట్రంప్ సర్కార్.. ఇప్పుడు కొత్తగా గ్రీన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకునే వారికీ షాకిచ్చింది.

అమెరికాలో ఇప్పటికే చట్టబద్ధంగా ఉన్న గ్రీన్ కార్డ్ దరఖాస్తుదారుల సోషల్ మీడియా ప్రొఫైల్‌లను పరిశీలించాలని ట్రంప్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. విదేశాలలో నివసిస్తున్న వీసా దరఖాస్తుదారులు ఇప్పటికే తమ సోషల్ మీడియా హ్యాండిల్‌లను అమెరికా పౌరసత్వం, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్‌తో పంచుకోవాలని ప్రభుత్వం కోరబోతోంది. ఇప్పటికే చట్టబద్ధంగా దేశంలో ఉంటూ శాశ్వత నివాసం కోరుతున్న గ్రీన్ కార్డు దరఖాస్తు దారులతో పాటు ఆశ్రయం కోరుతున్న వారికీ ఇది వర్తించబోతోంది.

donald trump s another shocker to green card seekers ask to share social media profiles

మెరుగైన గుర్తింపు ధృవీకరణ, పరిశీలన, జాతీయ భద్రతా స్క్రీనింగ్" కోసం సోషల్ మీడియా ఖాతాల పరిశీలన అవసరమని అమెరికా ప్రభుత్వం చెబుతోంది. విదేశీ ఉగ్రవాదులు, ఇతర జాతీయ భద్రత, ప్రజా భద్రతా బెదిరింపుల నుండి అమెరికాను రక్షించడం అనే ట్రంప్ కార్యనిర్వాహక ఆదేశాన్ని పాటించడంలో భాగంగా ఇలా గ్రీన్ కార్డు దరఖాస్తుదారుల సోషల్ మీడియా ప్రొఫైల్స్ కోరుతున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే ప్రజలు మాత్రం ఇది తమ వాక్ స్వాతంత్య్రంపై దాడిగా దీన్ని భావిస్తున్నట్లు తాజా సర్వే తెలిపింది.

Take a Poll

అమెరికాలో ఇప్పటికే ఉంటున్న గ్రీన్ కార్డుదారుల్ని ఏదో విధంగా టార్గెట్ చేస్తున్న ప్రభుత్వం .. ఇప్పుడు కొత్తగా గ్రీన్ కార్డులు తీసుకునే వారు సైతం తమ సోషల్ మీడియా ప్రొఫైల్స్ ఇవ్వాల్సిందేనని ఆంక్షలు పెట్టడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయినా ట్రంప్ సర్కార్ ఇవేవీ పట్టించుకునేందుకు సిద్దంగా లేదు. ఇమ్మిగ్రేషన్ వర్గాలకు ఇచ్చిన అపరిమిత అధికారాల నేపథ్యంలో తమ సోషల్ మీడియా ప్రొఫైల్స్ దుర్వినియోగం అవుతాయన్న ఆందోళన కూడా వ్యక్తమవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+