అమెరికాలో భారతీయ విద్యార్ధులకు తాజా షాక్ ! ఆ బిల్లుతో 3 లక్షల మందికి చెక్ .!

అమెరికాలో అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అక్రమ వలసలను తరిమేసేందుకు తీవ్ర ప్రయత్నాలుచేస్తున్న డొనాల్డ్ ట్రంప్.. ఇప్పుడు విదేశీ విద్యార్ధుల టార్గెట్ గా పలు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే విదేశీ విద్యార్ధుల వీసాలు, గ్రీన్ కార్డుల జారీని కఠిన తరం చేసిన ట్రంప్.. తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. దీంతో గ్రాడ్యుయేషన్ తర్వాత అమెరికాలోనే ఉంటూ ఉద్యోగాలు వెతుక్కునే వారికి షాక్ తగలబోతోంది.

అమెరికాలో విదేశీ విద్యార్ధులు గ్రాడ్యుయేషన్ కోర్సులు పూర్తి చేసిన తర్వాత ఐచ్ఛిక ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓపీటీ ) కార్యక్రమాన్ని ఎంచుకునే అవకాశం ఉంది. దీన్ని రద్దు చేయాలని కోరుతూ కాంగ్రెస్‌లో ట్రంప్ సర్కార్ కొత్త బిల్లు ప్రవేశపెట్టింది. గ్రాడ్యుయేషన్ తర్వాత భారతీయులతో పాటు విదేశీ విద్యార్ధుల్ని బలవంతంగా అక్కడి నుండి పంపేందుకు వీలుగా ఈ బిల్లును ప్రవేశపెట్టారు. దీని వెనుక కీలక కారణాలు ఉన్నాయి.

Donald trump s new bill to end OPT programme after graduation impact on 3 lakh Indian students

ఓపీటీ అనేది అంతర్జాతీయ విద్యార్థులు గ్రాడ్యుయేషన్ తర్వాత 12 నెలల వరకు అక్కడే ఉండి పని చేయడానికి అనుమతిస్తుంది. అలాగే స్టెమ్ కార్యక్రమం కింద విద్యార్థులు అదనంగా 24 నెలల వరకూ పొడిగింపుకు అర్హులుగా ఉన్నారు. కానీ ఇప్పుడు వీరంతా తమ కోర్సులు ముగియగానే స్వదేశాలకు వెళ్లిపోవాల్సి ఉంటుంది. లేకపోతే ప్రభుత్వమే బలవంతంగా వారిని స్వదేశాలకు బహిష్కరిస్తుంది.

గతంలోనూ ఓపీటీని రద్దు చేయడానికి డొనాల్డ్ ట్రంప్ తన మొదటి పదవీకాలంలో ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు వలసలపై కఠిన వైఖరి అవలంబిస్తున్న నేపథ్యంలో మరోసారి ఓపీటీ రద్దు ప్రతిపాదన తెరపైకి వచ్చింది. దీంతో ఎఫ్1, ఎం1 వీసాదారుల్లో భయాలు మొదలయ్యాయి. వీరంతా ఇప్పుడు హెచ్-1బీ వీసాలతో చేసే ఉద్యోగ ఆఫర్‌ల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఓపెన్ డోర్స్ 2024 నివేదిక ప్రకారం 2023-24 విద్యా సంవత్సరంలో 3 లక్షల మందికి పైగా భారతీయ విద్యార్థులు అమెరికా విద్యాసంస్థలలో చేరారు. వీరిలో దాదాపు మూడింట ఒక వంతు మంది ఓపీటీకి అర్హులుగా ఉన్నట్లు తేలింది.

Take a Poll

ఇప్పుడు వీరంతా ఓపీటీ రద్దు చేస్తే ఇంటి బాట పట్టాల్సి ఉంటుంది. ఇప్పటికే అమెరికాలోని చాలా మంది భారతీయ విద్యార్థులు తిరిగి రానిస్తారో లేదో అన్న భయాలతో వేసవి సెలవుల ప్రయాణాలను రద్దు చేసుకుంటున్నారు. పరిస్దితులు చక్కబడే వరకూ వీరిని అమెరికాలోనే ఉండాలని కార్నెల్, కొలంబియా, యేల్ యూనివర్శిటీలు అంతర్జాతీయ విద్యార్థులకు సూచిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+