Ukraine: తీర ప్రాంతాలను ముంచెత్తుతున్న నీపర్ నది.. ప్రమాదంలో వేల మంది జీవితాలు..
ఉక్రెయిన్ లో మంగళవారం తెల్లవారుజామున నీపర్ నదిపై ఉన్న నోవా కఖోవ్కా డ్యామ్‌ను పేల్చి వేయడంతో నది తీర ప్రాంతాల్లో నీరు చేరుతోంది.1,400 మందికి పైగా ప్రజలు తమ ఇళ్లను విడిచిపెట్టి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. డ్యామ్ పేల్చి వేయడంతో నీపర్ నది పరీవాహక ప్రాంతాల్లోని వేల మంది ప్రమాదంలో పడినట్లు ఉక్రెయిన్ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. వచ్చే 24 గంటల్లో తీరు ప్రాంతాల్లో నీటి మట్టం పెరిగే అవకాశం ఉందని పేర్కొంది.
వరద నీటి ప్రవాహానికి ఇప్పటికే యెల్జావెటికోవ్ అనే గ్రామంలోని వంతెన కొట్టుకుపోయింది. నీటి ఉద్ధృతి కారణంగా 8 మందికి పైగా గల్లంతయ్యారు. డ్నిప్రో పశ్చిమ ఒడ్డున ఉన్న పది గ్రామాలు, ఖేర్సన్ నగరంలో కొంత భాగం వరద ముప్పును ఎదుర్కొంటోంది.ఆనకట్టను రష్యా దళాలు పేల్చివేసినట్లు ఉక్రెయిన్ సాయుధ దళాల దక్షిణ సైనిక కమాండ్ ఫేస్‌బుక్‌లో పేర్కొంది.

ఈ డ్యామ్ 30 మీటర్ల ఎత్తు ఉంది. ఈ డ్యామ్ ను 1956లో కఖోవ్కా జలవిద్యుత్తు కేంద్రంలో భాగంగా కట్టారు. ఈ జలాశయం సామార్థ్యం 18 క్యూబిక్ కిలోమీటర్లుగా ఉంది. ఆనకట్టను రష్యా దళాలు పేల్చివేసినట్లు ఉక్రెయిన్ సాయుధ దళాల దక్షిణ సైనిక కమాండ్ ఫేస్‌బుక్‌లో పేర్కొంది. ఖచ్చితమైన రుజువును మాత్రం అందించలేకపోయింది. డ్యామ్‌పై ఉద్దేశపూర్వకంగా దాడి చేశారా లేక నిర్మాణ వైఫల్యం వల్లే ఈ విఘాతం జరిగిందా అనేది ఇంకా స్పష్టంగా తెలియరాలేదు.

ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వోలోడిమిర్ జెలెన్స్కీ పరిస్థితిని "సామూహిక విధ్వంసంగా, పర్యావరణ బాంబు" గా అభివర్ణించారు. వన్యప్రాణులు, వ్యవసాయ భూములు, నివాసాలు వరదల వల్ల దెబ్బతినే అవకాశం ఉందన్నారు. క్రిటికల్ డ్యామ్ వాల్యూమ్ పరంగా ఉక్రెయిన్‌లో అతిపెద్ద రిజర్వాయర్. ఇది ఆగ్నేయ ఉక్రెయిన్ గుండా ప్రవహించే ప్రధాన జలమార్గమైన డ్నిప్రో నదిపై ఉన్న ఆరు సోవియట్-యుగం ఆనకట్టల క్యాస్కేడ్‌లో చివరిది.












Click it and Unblock the Notifications