దుర్గా మండపాలు ధ్వంసం, మత ఘర్షణలు.. ముగ్గురి మృతి
దేవి నవరాత్రులు చివరి అంకానికి చేరింది. మరో రోజు పూజించి అమ్మవారిని నిమజ్జనం చేస్తారు. కోల్ కతాలో దుర్గాదేవి నవరాత్రులు/ పూజలు చాలా బాగుంటాయి. అయితే పొరుగు దేశం బంగ్లాదేశ్‌లో మాత్రం దాడులు జరుగుతున్నాయి. అక్కడ పలు దుర్గాదేవి మండపాలను కొందరు ద్వంసం చేశారని తెలుస్తోంది. ఈ మేరకు అక్కడి స్థానిక మీడియా చానెళ్లు రిపోర్ట్ చేశాయి. నవరాత్రుల సందర్భంగా అక్కడ మతపరమైన ఉద్రిక్త నెలకొంది.
కామిల్లా పట్టణం నానుర్ దిగాయ్ సరస్సు వద్ద ఉన్న దుర్గాదేవి మండపం వద్ద ఖురాన్‌ను అపవిత్రం చేశారని వార్తలు గుప్పుమన్నాయి. ఈ విషయం సోషల్ మీడియాలో షేర్ చేయడంతో దావానాలంలా వ్యాపించింది. దీంతో మతపరమైన హింసకు కారణమయ్యింది. ఆ తర్వాత చాంద్‌పూర్ హజిగనీ, ఛాటొగ్రామ్ భాక్షాలి, పెకువాలో గల కాక్స్ బజార్ వద్ద కూడా హింస చెలరేగింది.

ఇతర మండపాలకు కూడా హింస వ్యాపించింది. పరిస్థితిని చేయి దాటనీయకుండా పోలీసులు విశ్వ ప్రయత్నం చేశారు. కానీ కొన్ని సమూహాలు రాళ్లతో దాడి చేశాయి. దీంతో భద్రతా దళాలు టియర్ గ్యాస్ ప్రయోగించారు. రబ్బర్ బుల్లెట్లు కూడా ఉపయోగించారు. ఆందోళనకారులను చెల్లచెదురు చేయడానికి ఇంతకన్నా మార్గం కనిపించలేదు. ఈ ఘటనలో ముగ్గురు చనిపోయారని తెలుస్తోంది. ఆ సంఖ్య పెరగొచ్చు.. గాయపడ్డ వారి వివరాలు కడపటి వార్తలు అందేసరికి తెలియరాలేదు.
Spreading rumors of insulting the Qur'an, the puja mandapa of Nanua Dighi par in Comilla was attacked. https://t.co/KmljSISWFu pic.twitter.com/4oM1gS46yJ
— Bangladesh Hindu Unity Council (@UnityCouncilBD) October 13, 2021
పరిస్థితి దృష్ట్యా ఘటనా స్థలంలోకి ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ రంగంలోకి దిగింది. ఖురాన్‌కు అవమానం జరిగిందనే సమాచారంతోనే దాడులు జరిగాయని.. ఈ ఏడాది జరిగిన హింసాత్మక ఘటనలను మరచిపోలేం అని హిందు కౌన్సిల్ తెలియజేసింది. ఢాకాలో గల టిప్పు సుల్తాన్ రోడ్, చిట్టాగ్యాంగ్‌లో గల కొట్వాలీ వద్ద కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి. ఘటనపై బంగ్లాదేశ్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ప్రజలు సంయమనంగా ఉండాలని.. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవద్దని మంత్రి ఫరిదుల్ ఖాన్ కోరారు. ఘటనకు బాధ్యులైన వారిని తప్పకుండా శిక్షిస్తామని వివరించారు. అప్పటివరకు కాస్త ప్రశాంతంగా ఉండాలని కోరారు.
Asura Vahini attack on Shankhnidhi Puja Mandap at Tipu Sultan Road in puran Dhaka. The Pratima of maa Durga is now on the street.#SecularBangladesh pic.twitter.com/ju9BOU88PN
— Bangladesh Hindu Unity Council (@UnityCouncilBD) October 11, 2021
Some anti-Hindu Muslim fanatics secretly put the Quran on the feet of Hanuman statue at Durga puja pandal in Comilla, Bangladesh. It is just for an excuse to attack Hindus in the name of hurting religious feelings. Hope govt will save the minority community.
— taslima nasreen (@taslimanasreen) October 13, 2021
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications