ఐరాస వేదికగా కెనడాను దులిపేసిన జైశంకర్

వాషింగ్టన్: విదేశాంగ శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్.. కెనడా వైఖరిని ఎండగట్టారు. భారత్ పట్ల ఆ దేశం అనుసరిస్తోన్న వైఖరిని- ప్రపంచంలో అత్యుత్తమ వేదిక ఐక్యరాజ్యసమితి సాక్షిగా దులిపేశారు. పొరుగు దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం సరికాదని హితవు పలికారు.

ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో పాల్గొన్నారు జైశంకర్. నమస్తే భారత్ అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. పలు అంశాలను ప్రస్తావించారు. చంద్రయాన్ 3, అమృత్ కాల్, వాతావరణ మార్పులు, మహిళలకు రిజర్వేషన్, అంతర్జాతీయ ఉగ్రవాదం- దాన్ని నిర్మూలించడానికి అనుసరించాల్సిన వ్యూహాలు, భారత్‌లో విజయవంతంగా ముగిసిన జీ20 శిఖరాగ్ర సదస్సు, విదేశాంగ విధానాల గురించి వివరించారు.

EAM S Jaishankar hitting out at a standoff with Canada during his speech at UNGA meeting

భారత్ అమృత కాలంలోకి ప్రవేశించిందని, దీనికి గుర్తుగా చంద్రయాన్ 3 మిషన్‌ను విజయవంతం చేశామని జైశంకర్ అన్నారు. చంద్రుడిపై ల్యాండర్‌ను విజయవంతంగా ల్యాండ్ చేయించిన దేశంలో ఆవిర్భవించిందని పేర్కొన్నారు. భారత్‌లో ఇన్‌ఫ్రా వేగంగా అభివృద్ధి చెందుతోందని, శక్తిమంతమైన స్టార్టప్ దేశంగా అవతరిస్తోందని వ్యాఖ్యానించారు.

అదే సమయంలో కెనడాపైనా ఘాటు విమర్శలు చేశారు. కెనడాతో నెలకొన్న దౌత్యపర ప్రతిష్ఠంభనపై జైశంకర్ మాట్లాడారు. ఉగ్రవాదం, హింసాత్మక వాతావరణానికి అన్ని దేశాలు ఉమ్మడిగా స్వస్తి పలకాల్సిన అవసరం ఏర్పడిందని అన్నారు. ఒక దేశ ప్రాదేశికతను, సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను గౌరవించడం, అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం వంటి అంశాలను పొరుగు వారు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందని కెనడాను ఉద్దేశించి చెప్పారు.

మహిళా రిజర్వేషన్ బిల్లును జైశంకర్ తన ప్రసంగంలో ప్రస్తావించారు. ఈ బిల్లును పాత్-బ్రేకింగ్‌గా అభివర్ణించారు. ప్రజాస్వామ్యంలో మహిళలకు సమాన ప్రాతినిథ్యాన్ని కల్పించడానికి అధిక ప్రాధాన్యత ఇస్తోన్నామని చెప్పారు. భారత్ అనుసరిస్తోన్న ఆలోచనలు, విధానాలు, వాస్తవికతతో కూడుకున్న నిర్ణయాలు, వాటిని అనుసరించే చర్యలు అన్ని వర్గాల వారికీ ప్రయోజనాలను కల్పిస్తాయని పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+