భూకంప భయం.. జైలు నుంచి 200 మందికి పైగా ఖైదీలు జంప్..!

భూకంప భయంతో జైలు నుంచి 200 మందికి పైగా ఖైదీలు జంప్ అయినట్లు సమాచారం. ఈ ఘటన పాకిస్థాన్ కరాచీలోని మాలిర్ జిల్లాలో జరిగింది. సోమవారం రాత్రి జైలు ప్రాంతంలో భూమి కంపించింది. దీంతో అక్కడి అధికారులు, ఖైదీలు,సిబ్బంది ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఈ క్రమంలో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త వాతావారణం నెలకొంది. ఈ సమయంలోనే ఖైదీలు జైలు నుంచి బయటపడ్డారు.

కరాచీ ప్రావిన్స్ లోని మాలిర్ జిల్లాలో షాకింగ్ ఘటన జరిగింది. సోమవారం రాత్రి భూకంపంతో జైలు పరిసర ప్రాంతాల్లో కొద్దిసేపు బీభత్స వాతావరణం నెలకొంది. ఇదే సమయంలో జైలు నుంచి 200 మందికిపైగా ఖైదీలు జంప్ అయినట్లు సమాచారం. పరారైన ఖైదీల్లో హై ప్రొఫైల్ క్రిమినల్స్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో కొంతమంది ఖైదీలు జైలు అధికారులు, సిబ్బందిపై దాడి చేసి మరీ జంప్ అయినట్లు తెలుస్తోంది.

Earthquake fears More than 200 prisoners jump from prison in Pakistan

ఖైదీల పరారీతో కరాచీ ప్రాంతం మొత్తం హై అలర్ట్ ప్రకటించారు అధికారులు. మాలిర్ ప్రాంతంలో భూ ప్రకంపనలు సంభవించడంతో ఒక్కసారిగా జైలులోని 700 నుంచి 1000 మంది వరకు సిబ్బంది మెయిన్ గేట్ వద్దకు గుమిగూడారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో దాదాపు 216 మంది ఖైదీలు జైలు నుంచి జంప్ అయ్యారు. వీరిలో సీనియర్ కిల్లర్స్ కూడా ఉన్నట్లు సమాచారం.

ఖైదీలు జైలు నుంచి బయటకు వెళ్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. ఈ ఘటనతో కరాచీ నగరంలో హై అలర్ట్ ప్రకటించారు. పరారైన ఖైదీల కోసం జైలు అధికారులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఈ ఘటనపై సింధ్ ప్రావిన్స్ హోం మంత్రి స్పందించారు. ఖైదీలు మెయిన్ గేట్ ధ్వంసం చేసి పరారైనట్లు పేర్కొన్నారు. జైలు గోడలు బద్దలు కొట్టలేదని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+