సమత్రా దీవుల్లో భూకంపం, రిక్టర్ స్కేల్‌పై 6.5 నమోదు

Posted By:
Subscribe to Oneindia Telugu

జకార్తా: ఇండోనేషియాలోని సమత్రా దీవుల్లో ఆదివారం నాడు భూకంపం చోటుచేసుకొంది. బెంగ్‌కులు ప్రాంతానికి 73 కి.మీ. దూరంలోని భూకంప కేంద్రాన్ని గుర్తించారు.

భూకంపలేఖినిపై 6.5 తీవ్రత నమోదైంది. అయితే ఎటువంటి సునామీ హెచ్చరికలు జారీ చేయలేదని యూఎస్ జియోలాజికల్ సర్వే అధికారులు ప్రకటించారు.

Earthquake of magnitude 6.5 strikes west off Indonesia's Sumatra; tremors felt in Singapore

సమత్రా దీవుల్లో సంభవించిన భూకంపం కారణంగా సింగపూర్‌లో కూడ అక్కడక్కడ ప్రకంపనలు చోటుచేసుకొన్నాయి. ప్రజలంతా భయంతో ఇళ్ళలో నుండి బయటకు వచ్చారు.

ఎప్పుడు ఏం జరుగుతోందోననే భయంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇళ్ళనుండి బయటనే నిరీక్షిస్తున్న పరిస్థితి కన్పిస్తోంది.

గత ఏడాది డిసెంబర్‌లో ఇండోనేషియాలోని ఏస్ ప్రావిన్స్‌లో సంభవించిన భూకంపం కారణంగా వందమంది చనిపోయారు. వేల సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులయ్యారు.

తాజాగా చోటుచేసుకొన్న భూకంపం కారణంగా ప్రాణ, ఆస్తినష్గం గురించి ఇంకా వివరాలు అందాల్సి ఉందని అధికారులు ప్రకటించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
An earthquake of magnitude 6.5 struck west of Indonesia’s island of Sumatra on Sunday (Aug 13) but there was no tsunami risk, seismologists said as panicked residents fled their homes.
Please Wait while comments are loading...