కుప్పకూలిన విమానం: 22 మంది అంతం
క్వీటో: దక్షిణ అమెరికా ఖండంలోని ఈక్వెడార్ లో విమాన ప్రమాదం సంభవించింది. దేశ తూర్పు ప్రాంతంలోని పస్తాజా ప్రావిన్స్ లో బుధవారం వేకువ జామున (భారత కాలమానం ప్రకారం) ఒక సైనిక విమానం ఒక్క సారిగా కుప్పకూలిపోయిందని ఆర్మీ వర్గాలు ప్రకటించాయి.
ఈ ప్రమాదంలో విమానంలో ప్రయాణిస్తున్న 22 మంది సైనికులు దుర్మరణం చెందారని అధికారులు వెల్లడించారు. విమానంలో ఉన్న ఏ ఒక్కరూ ప్రాణలతో జీవించే అవకాశం లేదని ఆ దేశాధ్యక్షుడు రాఫెల్ కోరియో ట్వీట్టర్ లో తెలిపారు. ఈ క్వెడార్ దేశ చరిత్రలోనే ఇంత పెద్ద విమాన ప్రమాదం జరగలేదని అన్నారు.

అయితే విమానం కూలిపోవడానికి కచ్చితమైన కారణాలు తెలియడం లేదని ఆర్మీ అధికారులు అంటున్నారు. సాంకేతిక లోపం వలన ప్రమాదం జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఉగ్రవాదుల చర్యా ? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నామని అధికారులు వివరించారు.
More From
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications