ఈజిప్ట్ చర్చిలో ఆత్మాహుతి దాడి: 45 మంది మృతి, తమ పనేనని ఐసిస్ ప్రకటన

ఈజిప్ట్‌ టన్టా పట్టణంలోని ప్రముఖ కోప్టిక్‌ చర్చిలో ఆదివారం పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 45 మంది మృత్యువాతపడ్డారు. 119 మందికి గాయాలయ్యాయి.

కైరో: ఈజిప్ట్‌ టన్టా పట్టణంలోని ప్రముఖ కోప్టిక్‌ చర్చిలో ఆదివారం పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 45 మంది మృత్యువాతపడ్డారు. 119 మందికి గాయాలయ్యాయి.

ప్రార్థనలు నిర్వహిస్తున్న సమయంలో ఓ వ్యక్తి పేలుడు పదార్థాలతో వచ్చి చర్చిలో తనని తాను పేల్చేసుకున్నాడు. మొత్తం రెండు పేలుళ్లు చోటు చేసుకున్నాయి.

తొలి పేలుడులో 27 మంది మృతి చెందగా, 78 మంది గాయపడ్డారు. ఇది టాన్టాలోని కాప్టిక్ చర్చి వద్ద జరిగింది. ఇది కైరోకు 120 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆ తర్వాత సూసైడ్ బాంబర్ పేలుడు చోటు చేసుకుంది. ఈ ఘటనలో 16 మంది మృతి చెందగా, 41 మంది గాయపడ్డారు. ఈ ఘటనకు తామే కారణమని ఇస్లామిక్ స్టేట్ ప్రకటించింది.

Egypt: 21 killed in explosion at Coptic Christian church

సహాయక బృందం ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రుల్ని స్థానిక ఆసుపత్రులకు తరలించారు. చర్చి చుట్టూ భారీ బందోబస్తు విధించారు. 2016 డిసెంబర్‌లో ఇదే చర్చిలో జరిగిన పేలుడులో 25 మంది ప్రాణాలు కోల్పోయారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+