బస్సుపై గన్ మెన్ కాల్పులు, 23 మంది మృతి, 25 మందికి గాయాలు
ఈజిప్టులో ఓ బస్సుపై గన్ మెన్ విచక్షణరహితంగా కాల్పులకు దిగాడు. ఈ ఘటనలో 23 మంది ప్రాణాలను కోల్పోయారు. మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారని అక్కడి స్టేట్ టీవి వెల్లడించింది.
కైరో: ఈజిప్టులో ఓ బస్సుపై గన్ మెన్ విచక్షణరహితంగా కాల్పులకు దిగాడు. ఈ ఘటనలో 23 మంది ప్రాణాలను కోల్పోయారు. మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారని అక్కడి స్టేట్ టీవి వెల్లడించింది.
శుక్రవారం నాడు మిన్యా ఫ్రావిన్స్ లోని సెయింట్ శామ్యూల్ మోనస్టీ నుండి బయలుదేరిన బస్సుపై కాల్పులు జరిగాయి. దాడిని ఈజిప్టు ఆరోగ్య మంత్రిత్వశాఖ కూడ దృవీకరించింది. మృతుల సంఖ్య పెరిగేయ అవకాశం ఉంది. కాల్పులు జరిగిన వ్యక్తి కోసం భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి.

గత నెల ఈజిప్టులోని రెండు ప్రముఖ చర్చిలపై గంటల వ్యవధిలోనే ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదలు ఆత్మాహుతి దాడి చేసి మారణహోమం సృష్టించారు. ఈస్టర్ పండుగకు వారం ముందే ఈ దాడులు జరిగాయి. ఈ దాడుల్లో సుమారు 47 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.












Click it and Unblock the Notifications