వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాలుడి చేతిలో తుపాకి: ఎదురుదాడి

|
Google Oneindia TeluguNews

గాజా: ముక్కుపచ్చలారని చిన్నారులు సైతం తుపాకి చేత పట్టి ఎదురుదాడి చెయ్యడానికి సిద్దం అవుతున్నారు. పాలస్తీనాలోని పిల్లలు వారి కుటుంబ సభ్యులకు తోడుగా ఉంటూ ఇజ్రాయెల్ దళాల మీద పోరుకు దిగుతున్నారు.

పాలస్తీనాకు చెందిన ఓ బాలుడు రివాల్వర్ చేతపట్టుకుని ఇజ్రాయెల్ దళాల మీద గురి పెడుతున్న ఓ దృశ్యం ప్రపంచ దేశాలను షాక్ కు గురి చేస్తున్నది. హెబ్రాన్, రమల్లా తదితర నగరాల్లో ఇజ్రాయెల్ దళాలతో పాలస్తీనా ప్రజలు ఘర్షణ పడుతున్నారు.

Eight-month-old Palestinian boy choked to death near Bethlehem in Palestina

ఈ ఘర్షణలో రివాల్వర్ చేతపట్టుకున్న ఈ బాలుడు రోడ్ల మీదకు వచ్చి ఇజ్రాయెల్ దళాలపై కాల్పులు జరిపాడని పాలస్తీనా అధికారులు అంటున్నారు. ఇదే సమయంలో ఇజ్రాయెల్ దళాలు ప్రయోగించిన బాష్పవాయు గోళం తగిలి ఓ బాలుడు మరణించాడని పాలస్తీనా అధికారులు తెలిపారు.

బెత్లహాం సమీపంలోని ఓ గ్రామంలో ఇజ్రాయెల్ దళాలు జరిపిన దాడిలో రమదాన్ తవాబ్తె (8 నెలలు) అనే బాలుడు మరణించాడు. నెల రోజుల నుంచి ఇప్పటి వరకు 69 మంది పాలస్తీనియన్లు మరణించారని అక్కడి అధికారులు అంటున్నారు.

పాలస్తీనా యువకులు రాళ్లు, ఫైర్ బాంబులు, నిప్పంటించిన టైర్లు ఇజ్రాయెల్ దళాల మీదకు విసురుతున్నారు. అందుకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ దళాలు రబ్బర్ బుల్లెట్లు, బాష్పవాయు గోళాలు ప్రయోగిస్తున్నారు. ఈ ఘర్షణతో ఆ పరిసర ప్రాంతాలలో యుద్ధవాతావరణం నెలకొనింది.

English summary
The young protester joined the ranks of his fellow Palestinians in clashes with Israeli forces in cities including Khan Yunis, Ramallah and Hebron.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X