Elon Musk: లెక్క మారుతోంది..! మస్క్ సంచలన ట్వీట్..!

ప్రపంచ పెద్దన్నగా చెప్పుకుంటూ తమ దేశంతో పాటు ఇతర దేశాలపై పెత్తనం చేస్తున్న అమెరికాకు, దాని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ (elon musk) షాకిచ్చాడు. అంతర్జాతీయంగా మారుతున్న ఆర్ధిక పరిస్ధితుల్లో భారత్, చైనాలతో పోలిస్తే అమెరికా స్ధానం ఎక్కడో తేల్చిచెప్పేశాడు. అధికార సమతుల్యత మారుతోందంటూ మస్క్ చేసిన ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది.

ఈ ఏడాది ప్రపంచంలో టాప్ జీడీపీ (స్ధూల జాతీయోత్పత్తి) కలిగిన దేశంగా 31.82 ట్రిలియన్ డాలర్లతో అమెరికా కొనసాగుతోంది. ఆ తర్వాత స్ధానంలో చైనా 20.65 ట్రిలియన్ డాలర్లతో రెండో స్ధానంలో ఉంది. మూడో స్ధానంలో జర్మనీ 5.33 ట్రిలియన్ డాలర్లతో కొనసాగుతుండగా.. భారత్ 4.51 ట్రిలియన్ డాలర్ల జీడీపీతో నాలుగో స్ధానంలో నిలిచింది. అయితే ప్రపంచ జీడీపీ వృద్ధిలో ఆయా దేశాల భాగస్వామ్యం ఎలా ఉందని చూస్తే మాత్రం అమెరికాకు షాక్ తప్పలేదు.

Elon Musk Declares Global Power Shift After Comparing 2026 GDP Growth of China India and the US

ఈ ఏడాది ప్రపంచ జీడీపీ వృద్దిలో భాగస్వామ్యం ఆధారంగా దేశాల్ని చూసినప్పుడు 26.6 శాతం వాటాతో చైనా అగ్రస్ధానంలో నిలిచింది. అలాగే 17 శాతం వాటాతో భారత్ రెండో స్ధానంలో ఉంది. అమెరికా మాత్రం కేవలం 9.9 శాతం వాటాతో మూడో స్ధానంలో నిలిచింది. ఆ తర్వాత స్ధానాల్లో ఇండోనేషియా, టర్కీ, నైజీరియా, బ్రెజిల్, వియత్నాం, సౌదీ అరేబియా, జర్మనీ వంటి దేశాలు ఉన్నాయి. దీంతో ఎలాన్ మస్క్.. అధికార సమతుల్యత మారుతోందంటూ అమెరికాను హెచ్చరిస్తూ ఈ ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది. గతంలో ట్రంప్ తో సన్నిహిత సంబంధాలు నెరిపిన మస్క్..ఆ తర్వాత దూరమయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+